Arthritis: ఆర్థరైటిస్ రోగులు శీతాకాలంలో ఈ పొరపాట్లు చేయవద్దు.. తీవ్రమైన ఇబ్బంది పడతారు..
శీతాకాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. దీని కారణంగా కీళ్లనొప్పులు మరింతగా ఇబ్బంది పెడతాయి. ఈ వ్యాధి బారిన పడిన వారు చాలా సార్లు సాధారణ రోజువారీ పని చేసుకోవడంలో కూడా ఇబ్బంది పడతారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి చలికాలంలో కీళ్ల నొప్పులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకుందాం.
ఆర్థరైటిస్ అనేది ఎముకలకు సంబంధించిన ఒక వ్యాధి. ఈ వ్యాధి బారిన పడినవారు చేతులు, కాళ్ల సహా శరీరంలోని ఇతర కీళ్లలో తీవ్రమైన నొప్పి, వాపు వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆర్థరైటిస్‌ను సాధారణంగా వయస్సుతో వచ్చే వ్యాధిగా పరిగణిస్తారు. అయితే సరైన ఆహారం తీసుకోక పోవడం వలన శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరిగినప్పుడు.. కీళ్లలో స్ఫటికాలు పేరుకుపోతాయి. అప్పుడు చిన్న వయసు అయినా సరే కీళ్ళనొప్పు బారిన పడతారు. అయితే చలికాలంలో ఆర్థరైటిస్ రోగులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎవరైనా సరే శీతాకాలంలో కొన్ని తప్పులు చేస్తే.. ఆర్థరైటిస్ తో బాధపడేవారి పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. తీవ్రమైన కీళ్ల నొప్పితో బాధపడవలసి ఉంటుంది.
శీతాకాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. దీని కారణంగా కీళ్లనొప్పులు మరింతగా ఇబ్బంది పెడతాయి. ఈ వ్యాధి బారిన పడిన వారు చాలా సార్లు సాధారణ రోజువారీ పని చేసుకోవడంలో కూడా ఇబ్బంది పడతారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి చలికాలంలో కీళ్ల నొప్పులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకుందాం.
నిరంతరం ఒకే చోట కూర్చోవడం
ఆర్థరైటిస్‌తో బాధపడుతుంటే ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం మానుకోండి. ఎందుకంటే చలికాలంలో సాధారణ వ్యక్తుల శరీరం కూడా ఎముకల నొప్పులతో బాధపడుతున్నారు. మరి అలాంటిది ఆర్థరైటిస్‌తో బాధపడుతుంటే అప్పుడు కీళ్ల నొప్పి గణనీయంగా పెరుగుతుంది.
చల్లని నీరు ఉపయోగించకండి
శీతా కాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. దీని కారణంగా కీళ్ల నొప్పి పెరుగుతుంది. అదే సమయంలో చల్లటి నీటితో పని చేస్తే లేదా స్నానానికి చల్లని నీటిని ఉపయోగిస్తే, అప్పుడు కీళ్ల నొప్పి, వాపు, ఎముకల దృఢత్వం సమస్య మరింత పెరుగుతుంది.
ఈ విషయాలపై దృష్టి పెట్టండి..
ఆర్థరైటిస్ రోగులు శీతాకాలంలో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎక్కువ చక్కెర, కెఫిన్ కలిగిన ఆహారాలు (టీ-కాఫీ), అనారోగ్యకరమైన కొవ్వులు, శుద్ధి చేసిన ఆహారాలు మొదలైన వాటికి ఈ చలికాలంలో దూరంగా ఉండండి. లేకుంటే కీళ్ల వాపు, నొప్పిని ప్రేరేపించవచ్చు. అదే సమయంలో తినే ఆహారంలో విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని భాగం చేసుకోవాలి. ఇందు కోసం మీరు వైద్యుడిని కూడా సంప్రదించవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.