AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Healthy Lifestyle: రోజువారీ జీవితంలో ఈ 5 మార్పులు చేసుకోండి.. ఒత్తిడి అంటే ఏమిటో మర్చిపోతారు!

ప్రస్తుతం ప్రతి ఒక్కరిదీ బిజీ లైఫ్‌. ప్రతి ఒక్కరూ తమ తమ పని, బాధ్యతలను నిర్వర్తించడంలో బిజీ బిజీగా ఉన్నారు. చాలా మందికి కొన్ని క్షణాలు కూడా ప్రశాంతంగా గడపడానికి కూడా సమయం దొరకడం లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ రకమైన జీవితంలో తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మరచిపోతున్నారు కూడా .. రోజంతా పనిలో బిజీగా ఉండడంలోనో..  విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూనో నిమగ్నమై ఉంటారు. అందుకే ప్రస్తుతం ఆందోళన, డిప్రెషన్, అనేక ఇతర వ్యాధులు సర్వసాధారణంగా మారాయి.

Surya Kala

|

Updated on: Nov 25, 2023 | 10:38 AM

అయితే ప్రతి ఒక్కరూ తమ బిజీ షెడ్యూల్ నుండి కొంత సమయాన్ని వెచ్చించి తమను తాము చూసుకుంటే, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం మన బిజీ షెడ్యూల్‌లో కొన్ని మార్పులు చేస్తే చాలు. మీ జీవనశైలిలో ఈ ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోమని నిపుణులు సూచిస్తున్నారు. 

1 / 6
ఆరోగ్యకరమైన ఆహారం: తినే ఆహారం మనుషుల్ని శక్తివంతంగా ఉంచుతాయి. కాబట్టి శరీరానికి మేలు చేసే సమతుల్య ఆహారాన్ని ఎప్పుడూ తినాలి. తద్వారా బరువును అదుపులో ఉంచుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు, మంచి కొవ్వు వంటివి ఆహారాన్ని తీసుకుంటే శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. 

2 / 6
యోగా, ధ్యానం: ప్రతి ఒక్కరూ యోగా, ధ్యానాన్ని దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే.. అది  ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే యోగా వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ధ్యానం మనశ్శాంతిని, జీవితంలో స్థిరత్వాన్ని ఇస్తుంది. ధ్యానం చేయడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మనస్సు శాంతి ఉన్నప్పుడే జీవితంలోని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. 

3 / 6
డైరీ రాయడం: డైరీ రాయడం మంచి అలవాటు. మన ఆలోచనలు, రోజులో జరిగిన విషయాలను వ్రాయడం ద్వారా చాలా వరకు ఉపశమనం పొందవచ్చు. ఆందోళన, నిరాశతో బాధపడుతున్న వ్యక్తుల కోసం డైరీ రాయడం బెస్ట్ అని సూచిస్తారు. అందుకే రోజూ డైరీ రాయడం అలవాటు చేసుకోండి.

4 / 6
సమయానికి తగిన నిద్ర: మానసిక ఆరోగ్యానికి సరైన నిద్ర చాలా ముఖ్యం. అందువల్ల రాత్రిపూట ఎల్లప్పుడూ సమయానికి నిద్రపోవాలి. రోజులో సుమారు 7 నుండి 8 గంటలు నిద్రపోవాలి. తక్కువ నిద్రపోయే వారు ఒత్తిడికి గురికావడమే కాదు కళ్ల కింద నల్లటి వలయాలు కూడా ఏర్పడతాయి.

5 / 6
ఉదయాన్నే లేవండి: ఇంట్లో పెద్దలు ఎప్పుడూ పొద్దున్నే లేవమని సలహా ఇస్తుంటారు. తెల్లవారుజామున నిద్రలేవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మనం పొద్దున్నే మేల్కొంటే యోగా, ధ్యానం కోసం సమయం దొరుకుతుంది. అలాగే పొద్దున్నే లేవడం ద్వారా మన సమయాన్ని చక్కగా నిర్వహించుకోవచ్చు.

6 / 6
Follow us