- Telugu News Photo Gallery Are you suffering from kidney stones stay away from this vegetable, check here is details in Telugu
Kidney Health Precautions: కిడ్నీలో రాళ్లతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ కూరగాయలకు దూరంగా ఉండండి!
ప్రస్తుతం మారిన జీవిన విధానం కారణంగా ఎటు నుంచి ఎలాంటి వ్యాధి ఎటాక్ చేస్తుందో గుర్తించ లేక పోతున్నాం. ఉరుకుల పరుగుల లైఫ్ కారణంగా శరీరం గురించి ప్రత్యేకంగా శ్రద్ధ కూడా తీసుకోలేక పోతున్నారు. మన శరీరంలో ముఖ్యమైన భాగాల్లో మూత్ర పిండాలు కూడా ఒకటి. చాలా మంది ప్రస్తుతం కిడ్నీలో రాళ్ల సమస్యతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నీటిని తక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య ఎదురువుతుంది. ఇలా కిడ్నీలో రాళ్ల సమస్యతో ఇబ్బంది పడే వారు..
Chinni Enni | Edited By: Ravi Kiran
Updated on: Nov 25, 2023 | 9:00 PM

ప్రస్తుతం మారిన జీవిన విధానం కారణంగా ఎటు నుంచి ఎలాంటి వ్యాధి ఎటాక్ చేస్తుందో గుర్తించ లేక పోతున్నాం. ఉరుకుల పరుగుల లైఫ్ కారణంగా శరీరం గురించి ప్రత్యేకంగా శ్రద్ధ కూడా తీసుకోలేక పోతున్నారు. మన శరీరంలో ముఖ్యమైన భాగాల్లో మూత్ర పిండాలు కూడా ఒకటి. చాలా మంది ప్రస్తుతం కిడ్నీలో రాళ్ల సమస్యతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా నీటిని తక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య ఎదురువుతుంది. ఇలా కిడ్నీలో రాళ్ల సమస్యతో ఇబ్బంది పడే వారు పలు ఇతర సమస్యలను కూడా ఎదుర్కొంటారు. నడుము భాగంలో విపరీతంగా పెయిన్ వస్తుంది. ఎక్కువ సేపు కూర్చోలేరు. మూత్ర సమస్యలు కూడా రావచ్చు. కడుపులో నొప్పిగా కూడా ఉంటుంది.

ఇలా కిడ్నీలో రాళ్ల సమస్యతో ఇబ్బంది పడేవారు ముఖ్యంగా కొన్ని రకాల కూరగాయలకు దూరంగా ఉండాలి. టమాటా, బెండకాయ, వంకాయ, బచ్చలి కూర, దోస కాయ వంటి వాటిని పొరపాటున కూడా తీసుకోకూడదు. అలాగే సరిగ్గా ఉడికించని వెజిటేబుల్స్ కి కూడా దూరంగా ఉండాలిస

బచ్చల కూర, వంకాయలో ఆక్సలేట్స్ ఉంటాయి. కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడేవారు బచ్చలి కూర తినడం వల్ల ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. ఇది మూత్ర పిండాల్లో రాళ్ల సమస్యని పెంచుతుంది. కాబట్టి వీటికి ఖచ్చితంగా దూరంగా ఉండండి.

కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు దోసకాయ తినడం వల్ల కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే దోసకాయలో పొటాషియం అధికంగా ఉంటుంది. కాబట్టి కిడ్నీలో రాళ్ల సమస్యలో బాధ పడేవారు ఖచ్చితంగా తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి.





























