Priyanka Gandhi: మధిరలో రోడ్ షోలో డ్యాన్స్ చేసిన ప్రియాంక.. కార్యకర్తల్లో సరికొత్త జోష్

ప్రియాంక గాంధీ ఖమ్మంలో రోడ్‌ షో నిర్వహించారు. ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతుగా ఆమె ప్రచారం సాగించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరావు, పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, సీఎల్పీనేత భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ప్రియాంక గాంధీని చూసేందుకు అధిక సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు హాజరయ్యారు. రోడ్లన్నీ ఎటు చూసినా వాహనాలతో కిక్కిరిసిపోయింది. మధిర టౌన్‌లో కిలోమీటర్ల పొవునా అభిమానులు క్యూ కట్టారు.

Srikar T

|

Updated on: Nov 25, 2023 | 10:14 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన ప్రచారంలో వేగం పెంచింది. ఒకవైపు రాహుల్ తన ప్రసంగాలతో సభలు ఏర్పాటు చేస్తుంటే ప్రియాంక రోడ్ షోలతో జనంలోకి వెళ్లారు.

1 / 5
ప్రచార రథంపైకి ఎక్కిన ప్రియాంకా గాంధీ లంబాడీ మహిళలతో కలిసి నృత్య చేశారు. ప్రియాంక డ్యాన్స్ చూసిన అభిమానులు కేరింతలు కొడుతూ, రంగురంగుల కాగితాలు గాల్లో ఎగిరేస్తూ ఆనందంలో తేలిపోయారు. ఈ రోడ్ షోతో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలో సరికొత్త జోష్ నింపారు ప్రియాంక.

2 / 5
ప్రియాంక గాంధీని చూసేందుకు అధిక సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు హాజరయ్యారు. రోడ్లన్నీ ఎటు చూసినా వాహనాలతో కిక్కిరిసిపోయింది. మధిర టౌన్‌లో కిలోమీటర్ల పొవునా అభిమానులు క్యూ కట్టారు.

3 / 5
ప్రజలకు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు ప్రియాంకా గాంధీ. తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలతో పాటూ మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా కోరారు.

4 / 5
ప్రియాంక గాంధీ ఖమ్మంలో రోడ్‌ షో నిర్వహించారు. ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతుగా ఆమె ప్రచారం సాగించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరావు, పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, సీఎల్పీనేత భట్టి విక్రమార్క పాల్గొన్నారు.

5 / 5
Follow us