AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter Season: రాజస్థాన్‌లోని ఈ ప్రదేశాలు చలికాలంలో మరింత అందంగా మారుతాయి..

మనదేశంలో అతి పెద్ద రాష్ట్రం రాజస్థాన్. పర్యాటక ప్రదేశంగా చాలా ప్రసిద్ధి గాంచింది. దేశ విదేశాల నుంచి పర్యాటకులు రాజస్థాన్ ను సందర్శిస్తారు. ఇక్కడ ఉన్న చారిత్రక భవంతులు, కోటలు, కళలు, సంస్కృతులు, కట్టడాలు పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి. అందుకనే మన దేశానికి వచ్చే విదేశీ పర్యాటకులు ఎక్కువగా రాజస్థాన్ ను సందర్శిస్తారు. వాస్తవానికి రాజస్థాన్ వేడి ప్రాంతం అయినప్పటికీ.. శీతాకాలంలో అనేక ప్రదేశాల అందం పెరుగుతుంది. ఈ చలికాలంలో రాజస్థాన్‌లో ఏయే ప్రదేశాలను సందర్శించవచ్చో  ఇపుడు తెలుసుకుందాం.. 

Surya Kala
|

Updated on: Dec 03, 2023 | 5:22 PM

Share
రాజస్థాన్ లో రాజరిక శైలి అడగడుగనా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న చారిత్రక కట్టడాలను చూడటానికి యాత్రికులు వస్తూ ఉంటారు. అయితే శీతాకాలంలో ఈ ప్రాంతంలోని అనేక ప్రదేశాలు మరింత అందంగా  ఆకర్షణీయంగా కనిపిస్తాయి.  

1 / 5
మౌంట్ అబూ అందాలు : వర్షాకాలం తర్వాత పర్యాటక ప్రదేశం మౌంట్ అబూలో చలి మరింత పెరిగింది. పర్వతాలు, పచ్చదనంతో చుట్టుముట్టబడిన ఈ ప్రదేశంలోని అందాన్ని పర్యాటకులు ఇష్టపడతారు. రాజస్థాన్‌లోని ఈ ఏకైక హిల్ స్టేషన్ హనీమూన్ డెస్టినేషన్‌గా పరిగణించబడుతుంది.

2 / 5
జైసల్మేర్‌ను సందర్శించండి : రాజస్థాన్‌లోని జైసల్మేర్ వేసవిలో రాత్రిపూట చల్లగా ఉండే ప్రాంతం. జైసల్మేర్ ఇసుక ఎడారి శీతాకాలంలో మరింత అందంగా కనిపిస్తుంది. ఇసుకలో ఏర్పాటు చేసే ఫైర్ పార్టీ ఒక విభిన్నమైన వినోదాన్ని అందిస్తుంది. 

3 / 5
పిచోలా సరస్సు, ఉదయపూర్ : రాజస్థాన్‌లోని సరస్సుల నగరం ఉదయపూర్. ఈ ప్రసిద్ధ సరస్సులలో ఒకటి పిచోలా. దీని సహజ సౌందర్యం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ సరస్సును సందర్శించేటప్పుడు, జగ్ మందిర్, జగ్ నివాస్ , మోహన్ మందిర్ చూడటం మర్చిపోవద్దు.

4 / 5
బ్లూ సిటీ 'జోధ్‌పూర్' : రాజస్థాన్‌లోని బ్లూ సిటీ 'జోధ్‌పూర్' శీతాకాలంలో సందర్శించడానికి గొప్ప పర్యాటక ప్రదేశం. శీతాకాలపు సాయంత్రాలలో ఈ ప్రదేశం మరింత అందంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ శీతాకాలంలో ఖచ్చితంగా జోధ్‌పూర్‌ని సందర్శించండి.

5 / 5