- Telugu News Photo Gallery Cricket photos Rs 50 lakhs Base Price for New Zealand Young Player Rachin Ravindra's Base Price in Ipl Auction 2024
IPL 2024: 10 మ్యాచ్‌ల్లో 578 పరుగులు.. కట్‌చేస్తే.. తక్కువ బేస్‌ప్రైస్‌తో లిస్టైన వరల్డ్ కప్ సెన్సేషన్..
IPL 2024 Rachin Ravindra: భారతదేశంలో జరిగిన ప్రపంచ కప్‌లో రచిన్ రవీంద్ర 10 మ్యాచ్‌లలో 64.22 సగటుతో మొత్తం 578 పరుగులు చేశాడు. అంతే కాకుండా ఈ ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ప్రపంచ కప్ 2023లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 4వ ర్యాంక్‌లో ఉన్న రచిన్ రవీంద్ర, ఐపీఎల్‌లో కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించాలని పట్టుదలతో ఉన్నాడు. ఈ ఉద్దేశంతో పాటు తక్కువ బేస్ ప్రైస్ కూడా ప్రకటించడం వల్ల యువ ఆటగాడికి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది.
Updated on: Dec 03, 2023 | 4:52 PM

ఈ ఐపీఎల్ వేలంలో న్యూజిలాండ్ యువ ఆటగాడు రచిన్ రవీంద్ర కనిపించడం ఖాయం. ఐపీఎల్ బిడ్డింగ్ కోసం నమోదు చేసుకున్న 1166 మంది ఆటగాళ్లలో రచిన్ పేరు కూడా ఉంది. కా,నీ ఈ యువ ఆటగాడు తక్కువ బేస్ ప్రైస్ లిస్టులో ఉండడం విశేషం.

ఈ వన్డే ప్రపంచకప్ ద్వారా యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన యువ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ రచిన్ రవీంద్ర రూ.50 లక్షల బేస్ ప్రైజ్‌తో లిస్ట్ చేసుకున్నాడు. ప్రస్తుత ఫారమ్‌ను పరిశీలిస్తే, అన్ని ఫ్రాంచైజీలు రచిన్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఎందుకంటే భారత్‌లో జరిగిన ప్రపంచకప్‌లో రచిన్ రవీంద్ర 10 మ్యాచ్‌ల్లో 64.22 సగటుతో మొత్తం 578 పరుగులు చేశాడు. అంతే కాకుండా ఈ ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

ఇప్పుడు, ప్రపంచ కప్ 2023లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 4వ ర్యాంక్‌లో ఉన్న రచిన్ రవీంద్ర, ఐపీఎల్‌లో కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించాలని పట్టుదలతో ఉన్నాడు. ఈ ఉద్దేశంతో పాటు తక్కువ బేస్ ప్రైస్ కూడా ప్రకటించడం వల్ల యువ ఆటగాడికి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది.

ఎందుకంటే రచిన్ రవీంద్ర ఆల్ రౌండర్. ఫలితంగా, 10 జట్లు ఇంత తక్కువ బేస్ ధరతో ప్రారంభ బిడ్డింగ్‌లో కనిపించడం ఖాయం. దీంతో యువ ఆటగాడి కొనుగోలుకు మొదటి నుంచి పోటీ నెలకొంటుంది. ఈ పోటీ కారణంగా రచిన్ రవీంద్ర భారీ మొత్తానికి వేలం వేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.




