AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel: తక్కువ బడ్జెట్‌తో ఈ దేశాన్ని చుట్టేయండి.. ఒక్క రూపాయి విలువ రూ.291

ఈ దేశం పేరు వియత్నాం. అక్కడ ఒక భారతీయ రూపాయి విలువ 291 వియత్నామీస్ డాంగ్‌లు. వియత్నాం చాలా ప్రశాంతమైన అందమైన దేశం. ఈ దేశాన్ని అధిక సంఖ్యలో భారతీయ పర్యాటకులు సందర్శిస్తారు. ఇది భారతీయులకు అత్యంత ఇష్టమైన పర్యాటక ప్రదేశం. మీరు రూ. 1 లక్షలోపు ఇక్కడ సులభంగా ప్రయాణించవచ్చు. మీరు ఈ దేశంలో ఏయే ప్రదేశాల్లో సందర్శించవచ్చునంటే..   

Travel: తక్కువ బడ్జెట్‌తో ఈ దేశాన్ని చుట్టేయండి.. ఒక్క రూపాయి విలువ రూ.291
Currency Of Vietnam
Surya Kala
|

Updated on: Dec 02, 2023 | 6:42 PM

Share

ప్రతి ఒక్కరూ విదేశాలకు వెళ్లాలని కలలు కంటారు. అయితే పాస్‌ పోర్ట్, వీసా, టిక్కెట్‌లతో పాటు వసతి,  ఆహారం కోసం అధిక ఖర్చు చేయాల్సి వచ్చినా.. అందునా లక్షల్లో వ్యయం చేయాల్సి వస్తే తమ పర్యటనకు సంబంధించిన ప్లాన్‌లను రద్దు చేసుకుంటారు. అయితే కొన్ని ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే ఖర్చుని గురించి అస్సలు అవసరం లేదు. కొన్ని దేశాలకు ప్రయాణించడం చాలా సులభం. ఎందుకంటే ఆ దేశాల్లో ఒక భారతీయ రూపాయి విలువ 291 అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఈ దేశం పేరు ఏమిటి ఆలోచిస్తున్నారా ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ దేశం పేరు వియత్నాం. అక్కడ ఒక భారతీయ రూపాయి విలువ 291 వియత్నామీస్ డాంగ్‌లు. వియత్నాం చాలా ప్రశాంతమైన అందమైన దేశం. ఈ దేశాన్ని అధిక సంఖ్యలో భారతీయ పర్యాటకులు సందర్శిస్తారు. ఇది భారతీయులకు అత్యంత ఇష్టమైన పర్యాటక ప్రదేశం. మీరు రూ. 1 లక్షలోపు ఇక్కడ సులభంగా ప్రయాణించవచ్చు. మీరు ఈ దేశంలో ఏయే ప్రదేశాల్లో సందర్శించవచ్చునంటే..

హనోయి

ఇవి కూడా చదవండి

వియత్నాంను సందర్శించాలనుకుంటే ఖచ్చితంగా హనోయికి వెళ్లండి. వియత్నాం రాజధాని హనోయి ప్రపంచంలోని పురాతన నగరాల్లో ఒకటి. ఇక్కడి భవనాలు, బంగారు పగోడాలు, మ్యూజియంలు, సాంప్రదాయ మార్కెట్‌లు పర్యాటకులకు నచ్చుతాయి. దీనితో పాటు ఇక్కడ ఎటువంటి సందేహం లేకుండా షాపింగ్ ను చేయవచ్చు.

హోయి అన్

హోయి అన్ ఆసియాలోని పురాతన నగరాల్లో ఒకటి. ఇది శాంతియుత సమావేశ స్థలంగా కూడా పిలువబడుతుంది. ప్రకృతికి దగ్గరగా జీవించడానికి ఇష్టపడే వారు హోయి అన్ నగరానికి వెళ్లాలి. ఈ నగరం  పట్టణ ప్రజల జీవితానికి దూరంగా ఉంటుంది.

హా గియాంగ్

హా గియాంగ్ అందాన్ని వర్ణించడం కష్టం. ఇది వియత్నాంలోని అత్యంత అందమైన నగరాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ ఉన్న పర్వతాలు, పరిశుభ్రత పర్యాటకులను ఆకర్షిస్తాయి. వియత్నాం సందర్శించడానికి ఎవరు వెళ్లినా ఈ ప్రదేశాన్ని సందర్శించడం మర్చిపోరు. పర్వతాల మీద ఉన్న అందమైన వరి పొలాలు ఈ స్థలాన్ని మరింత అద్భుతంగా కనిపిస్తాయి.

ఎలా వెళ్ళాలంటే

ఇక్కడ మీరు విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవాలి. ఈ దేశానికి వెళ్ళడానికి విమాన టిక్కెట్లు కూడా చాలా చౌకగా ఉంటాయి. వన్ వే టికెట్ ధర దాదాపు రూ.13 నుంచి 15 వేల వరకు ఉంటుంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి అనేక ప్రాంతాల నుండి వియత్నాంకు విమాన సర్వీసులు ఉన్నాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..