AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాడు నుండి శ్రీలంకకు పడవ ప్రయాణం.. టిక్కెట్ ధర చాలా తక్కువ.. ఈ సారి ట్రై చేయండి..!

ఇది తమిళనాడు నుండి శ్రీలంక వరకు ప్రయాణిస్తుంది. ఈ ఫెర్రీ సర్వీస్ తమిళనాడులోని నాగపట్నం నుండి శ్రీలంకలోని కంకసంతురై వరకు నడుస్తుంది. ఈ ఫెర్రీ సర్వీస్‌ను షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. తమిళనాడులోని నాగపట్నం ఓడరేవు నుంచి శ్రీలంకలోని కంకసంతురై పోర్ట్ వరకు ఈ ఫెర్రీ సర్వీస్ నడపబడుతుంది. ఈ ప్రయాణం దాదాపు 60 నాటికల్ మైళ్ల దూరాన్ని(110 కిమీ) కవర్ చేస్తుంది. దాదాపు 3 నుండి 4 గంటల సమయం పడుతుంది. ఈ ప్రయాణం నిజంగా మరపురాని అనుభవం.

తమిళనాడు నుండి శ్రీలంకకు పడవ ప్రయాణం.. టిక్కెట్ ధర చాలా తక్కువ.. ఈ సారి ట్రై చేయండి..!
Ferry Service
Jyothi Gadda
|

Updated on: Dec 02, 2023 | 6:34 PM

Share

బడ్జెట్ అనుకూలమైన విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి శ్రీలంక అత్యంత అనువైన దేశంగా, చాలా మంచిదని భావిస్తారు. చాలా తక్కువ ధరతో, పడవలో ఎంజాయ్ చేస్తూ శ్రీలంకకు టూర్‌ని ఆస్వాదించే అవకాశం ఉంది. శ్రీలంక భారతదేశానికి చాలా దగ్గరగా ఉన్న ద్వీప దేశం. తమిళనాడు రాష్ట్రం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ఇక్కడికి వెళ్లాలంటే విమానంలోనో, పడవలోనో వెళ్లాలని మనకు తెలిసిందే..! అందుకు వీలుగా, యాత్ర ఫెర్రీ సర్వీస్ అక్టోబర్ 2023 మొదటి వారం నుండి ప్రారంభమైంది. ఇది తమిళనాడు నుండి శ్రీలంక వరకు ప్రయాణిస్తుంది. ఈ ఫెర్రీ సర్వీస్ తమిళనాడులోని నాగపట్నం నుండి శ్రీలంకలోని కంకసంతురై వరకు నడుస్తుంది. ఈ ఫెర్రీ సర్వీస్‌ను షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. తమిళనాడులోని నాగపట్నం ఓడరేవు నుంచి శ్రీలంకలోని కంకసంతురై పోర్ట్ వరకు ఈ ఫెర్రీ సర్వీస్ నడపబడుతుంది .

ఈ ప్రయాణం దాదాపు 60 నాటికల్ మైళ్ల దూరాన్ని(110 కిమీ) కవర్ చేస్తుంది. దాదాపు 3 నుండి 4 గంటల సమయం పడుతుంది. ఈ ప్రయాణం నిజంగా మరపురాని అనుభవం. ఈ ఫెర్రీ లింక్ వల్ల భారత్, శ్రీలంకల మధ్య పర్యాటకం, వాణిజ్యం పెరుగుతాయనడంలో సందేహం లేదు. రెండు దేశాల అభివృద్ధికి ఫెర్రీ సర్వీస్ చాలా ముఖ్యం. ఈ కొత్త కనెక్టివిటీ సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థను కూడా పెంచుతుంది. ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని నిపుణులు చెబుతున్నారు. టిక్కెట్ కౌంటర్‌ల నుండి వెయిటింగ్ రూమ్‌లు, ఫంకీ కెఫెటేరియా వరకు, టెర్మినల్‌లో ప్రయాణీకుడికి అవసరమైన ప్రతిదీ ఇక్కడ అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు ఈ పడవలో హాయిగా ప్రయాణించేలా ప్లాన్ చేసుకోవచ్చు.

ఈ పడవ ప్రయాణం ఎంతవరకు సురక్షితం..?

ఇవి కూడా చదవండి

పడవ ప్రయాణం భద్రత గురించి చాలా మంది గందరగోళానికి గురవుతుంటారు.. ప్రయాణీకుల భద్రత, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకుని SCI కొన్ని చర్యలు తీసుకుంది. భద్రతా ప్రమాణాలతో కూడిన హై-స్పీడ్ ప్యాసింజర్ ఫెర్రీని ఏర్పాటు చేశారు. ఇది 150 మంది ప్రయాణికులకు ఆందోళన లేని, ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని అందిస్తుంది.

టికెట్‌ ధర ఎంత ఉంటుంది..?

సమాచారం ప్రకారం.. వన్-వే టిక్కెట్ ధర సుమారు US$50 (రూ. 6,000-7,000కి సమానం). అయితే, ఫెర్రీ టికెట్ ఫైనల్‌ ధరను మాత్రం ఫెర్రీ ఆపరేటర్ నిర్ణయిస్తారు. ఇది మీరు ఎంచుకున్న ఫెర్రీ రైడ్ రకం, ప్రయాణ తరగతి, సమయం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..