AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వార్నీ ఇదెక్కడి విడ్డూరం.. సీసీ రహదారిపై అడ్డంగా గోడ నిర్మాణం.. ఎందుకో తెలిస్తే అవాక్కే..!

ఏకంగా సిమెంట్ రోడ్డుకు అడ్డంగా గోడనే కట్టేశాడు సూర్య నారాయణ. తన మెట్లు అడ్డుగా ఉన్నాయంటే తాను తొలగించానని, అయితే చంద్రశేఖర్ మాత్రం వితండ వాదానికి దిగాడం ఏంటనే కోపంతో ఏకంగా రోడ్డుకి అడ్డంగా గోడనే కట్టేశానంటున్నాడు సూర్య నారాయణ. అయితే సిమెంట్ రోడ్డుకు అడ్డంగా గోడ కట్టడంతో మిలిగిన వారికి ఇబ్బందిగా మారింది. అధికారులు జోక్యం చేసుకొని గోడను తొలగించాలంటున్నారు స్థానికులు. అయితే

వార్నీ ఇదెక్కడి విడ్డూరం.. సీసీ రహదారిపై అడ్డంగా గోడ నిర్మాణం.. ఎందుకో తెలిస్తే అవాక్కే..!
Construction Of Transverse
T Nagaraju
| Edited By: Jyothi Gadda|

Updated on: Dec 02, 2023 | 4:39 PM

Share

గుంటూరు, డిసెంబర్02; పల్నాడు జిల్లా అంటేనే పౌరుషానికి ప్రతీక… పగ ప్రతీకారాలు ఇక్కడ రాజ్యమేలుతుంటాయంటారు. చిన్న చిన్న వివాదాలకే పెద్ద పెద్ద గొడవలు జరగడం ఇక్కడ సాధారణంగా కనిపిస్తుంది. ఇటువంటి ఘటనే అధికారులకు పెద్ద తలనొప్పి తెచ్చింది. పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం కారుమంచి గ్రామం.. గ్రామానికి చెందిన సూర్య నారాయణ, చంద్రశేఖర్ లు బంధువులే.. అయితే వీరిలో సూర్య నారాయణ మొదట గ్రామానికి చివరగా ఇల్లు కట్టుకున్నారు. తర్వాత ఆ బజారులో ఇల్లు రావడం మొదలైంది. ఆ తర్వాత అదే బజారులో సిమెంట్ రోడ్డు కూడా వేశారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది. అయితే సూర్య నారాయణ ఇంటి మెట్లు సిమెంట్ రోడ్డు మీదకు వచ్చాయి. దీంతో చంద్రశేఖర్ మెట్లు రోడ్డు మీదకు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సూర్య నారాయణ ఎందుకు వచ్చిన గోలంటూ మెట్లు తొలగించారు. ఈ క్రమంలో ఎటువంటి గొడవలు లేకుండా అందరూ సిమెంట్ రోడ్డును ఉపయోగించుకుంటున్నారు.

కొద్దీ కాలం తర్వాత చంద్రశేఖర్ కూడా ఇంటి నిర్మాణం మొదలు పెట్టి పూర్తి చేశాడు. అయితే అతని మెట్లు కూడా సిమెంట్ రోడ్డు మీదకు వచ్చాయి. తను మెట్లు కట్టినప్పుడు అభ్యంతరం వ్యక్తం చేసిన చంద్రశేఖర్ ఏవిధంగా రోడ్డుపైకి మెట్లు కడతాడంటూ సూర్య నారాయణ ప్రశ్నించాడు. అయితే తప్పేముంది కొద్దీగానే కదా మెట్లు రోడ్డు మీదకు వచ్చిదంటూ చంద్రశేఖర్ సమాధానం చెప్పాడు. దీంతో సూర్య నారాయణకు చిర్రెత్తుకొచ్చింది.

దీంతో ఏకంగా సిమెంట్ రోడ్డుకు అడ్డంగా గోడనే కట్టేశాడు సూర్య నారాయణ. తన మెట్లు అడ్డుగా ఉన్నాయంటే తాను తొలగించానని, అయితే చంద్రశేఖర్ మాత్రం వితండ వాదానికి దిగాడం ఏంటనే కోపంతో ఏకంగా రోడ్డుకి అడ్డంగా గోడనే కట్టేశానంటున్నాడు సూర్య నారాయణ. అయితే సిమెంట్ రోడ్డుకు అడ్డంగా గోడ కట్టడంతో మిలిగిన వారికి ఇబ్బందిగా మారింది. అధికారులు జోక్యం చేసుకొని గోడను తొలగించాలంటున్నారు స్థానికులు. అయితే పంచాయితీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..