AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఐదు కూరగాయలను వండకుండా అస్సలు తినొద్దు.. అలా తింటే.. తీవ్రమైన సమస్యలు తప్పవు..!

పోషకాహార లోపం వల్ల శారీరక సమస్యలే కాకుండా ముఖ్యమైన మానసిక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. కూరగాయలు, పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పోషకాహార లోపాలను చాలా వరకు అధిగమించవచ్చు. ఇది వైద్యులు స్వయంగా సిఫార్సు చేస్తారు. కానీ చాలా మంది ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నారనేది నిజం.  అయితే, కొన్ని ఆకుకూరలు పచ్చిగా తింటే ఆరోగ్యానికి మంచిది. కానీ అన్ని కూరగాయలను ఈ విధంగా తినడానికి ప్రయత్నిస్తే అత్యంత హానికరం.

ఈ ఐదు కూరగాయలను వండకుండా అస్సలు తినొద్దు.. అలా తింటే.. తీవ్రమైన సమస్యలు తప్పవు..!
Vegetable
Jyothi Gadda
|

Updated on: Dec 01, 2023 | 9:31 PM

Share

కొన్ని ఆకుకూరలు పచ్చిగా తింటే ఆరోగ్యానికి మంచిది. కానీ అన్ని కూరగాయలను పచ్చిగా తినడానికి ప్రయత్నించకండి. అలా చేస్తే.. శరీరంలోకి రోగకారక క్రిములు ప్రవేశించేలా చేసి ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. అలాగే, పోషకాలు సరిగా అందకపోవటం కూడా జరుగుతుంది. అయితే, పోషకాహార లోపాన్ని చాలా మంది సామాన్యమైనదిగా భావిస్తారు. కానీ, పోషకాహార లోపం క్రమంగా వివిధ ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఇది చదువు, చేసే పని, వ్యక్తిగత సంబంధాలు, సృజనాత్మక జీవితం, సామాజిక జీవితం వంటి మన వివిధ రంగాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.

పోషకాహార లోపం వల్ల శారీరక సమస్యలే కాకుండా ముఖ్యమైన మానసిక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. కూరగాయలు, పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పోషకాహార లోపాలను చాలా వరకు అధిగమించవచ్చు. ఇది వైద్యులు స్వయంగా సిఫార్సు చేస్తారు. కానీ చాలా మంది ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నారనేది నిజం.  అయితే, కొన్ని ఆకుకూరలు పచ్చిగా తింటే ఆరోగ్యానికి మంచిది. కానీ అన్ని కూరగాయలను ఈ విధంగా తినడానికి ప్రయత్నిస్తే అత్యంత హానికరం. ఒకటి శరీరంలోకి రోగకారక క్రిములు ప్రవేశించి ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. రెండు పోషకాలు సరిగా లభించకపోవటం.

ఏది ఏమైనప్పటికీ, ఈ పోషకాలు ఉండేలా మీరు క్రమం తప్పకుండా ఉడికించి తినాల్సిన ఐదు కూరగాయల గురించి తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

పాలకూర…

పాలకూర అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ఆకు కూర. అయితే పచ్చిగా తినకపోవడమే మంచిది. పాలకూరలోని ఆక్సాలిక్ యాసిడ్ కాల్షియం, ఐరన్ ఆహారం నుండి శోషించబడకుండా చేస్తుంది. కానీ ఈ ఆమ్లం వంట సమయంలో కుళ్ళిపోతుంది.

చిలగడదుంప…

చిలగడదుంపను సాధారణంగా వండకుండా తినరు. వాస్తవానికి కూడా వండకుండా అస్సలు తినకూడదు. ఎందుకంటే దీన్ని వండుకుంటేనే అందులోని పోషకాలు ఉపయోగపడతాయి.

పచ్చి బఠానీలు…

పచ్చిమిర్చి కూడా సాధారణంగా అందరూ ఒకసారి వండి తింటారు. కానీ కొంతమంది సలాడ్లలో పచ్చి బఠానీలను కూడా కలుపుతారు. కానీ, ఇలా తినడం వల్ల ప్రయోజనం లేదు. అంతే కాదు హాని కూడా కలిగిస్తుంది. పచ్చి బఠాణీల్లో ఉండే ‘లెక్టిన్‌లు’ ఉడకకుండా తింటే జీర్ణ సమస్యలు వస్తాయి.

వంకాయలు..

వంకాయను ఏమీ లేకుండా తినే వారు అరుదు. కానీ, వంకాయను కూడా ఉడికించిన తర్వాత మాత్రమే తినాలి. అప్పుడే వంకాయలోని ఆరోగ్య ప్రయోజనాలు మనకు అందుతాయి. లేదంటే ఇతర అనారోగ్య సమస్యలు తప్పవు.

పుట్టగొడుగులు…

కొంతమంది పుట్టగొడుగులను కూడా ఉడికించకుండా తింటారు. కానీ పుట్టగొడుగులను వండకుండా తినడం మంచిది కాదు. ఇది తీవ్రమైన కడుపు నొప్పిని కలిగిస్తుంది. పుట్టగొడుగులను తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ప్రతి 12 ఏళ్లకోసారి ఆలయాల్లో కుంభాభిషేకం ఎందుకు చేస్తారు? దీని..
ప్రతి 12 ఏళ్లకోసారి ఆలయాల్లో కుంభాభిషేకం ఎందుకు చేస్తారు? దీని..
ఒకప్పుడు జేసీబీ డ్రైవర్.. ఇప్పుడు జబర్దస్త్‌లో అదరగొడుతున్నాడు
ఒకప్పుడు జేసీబీ డ్రైవర్.. ఇప్పుడు జబర్దస్త్‌లో అదరగొడుతున్నాడు
ఉద్యోగుల్లో అధికంగా సంతానలేమి.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
ఉద్యోగుల్లో అధికంగా సంతానలేమి.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
తెలంగాణ పోలీస్‌శాఖ కీలక నిర్ణయం
తెలంగాణ పోలీస్‌శాఖ కీలక నిర్ణయం
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో ఒక గిన్నెడు ఉప్పు ఎందుకు పెట్టాలో తెలుసా?
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో ఒక గిన్నెడు ఉప్పు ఎందుకు పెట్టాలో తెలుసా?
ఒక్కరోజులోనే మొటిమలు మాయం.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..
ఒక్కరోజులోనే మొటిమలు మాయం.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..
వివాహానికి రాహువు అడ్డంకిగా మారుతున్నాడా? ఈ జ్యోతిష్య పరిహారాలతో
వివాహానికి రాహువు అడ్డంకిగా మారుతున్నాడా? ఈ జ్యోతిష్య పరిహారాలతో
డీఎస్పీ భీమ్‌రెడ్డి అక్రమాస్తుల కేసు: ఏసీబీ దాడుల్లో భారీ ఆస్తులు
డీఎస్పీ భీమ్‌రెడ్డి అక్రమాస్తుల కేసు: ఏసీబీ దాడుల్లో భారీ ఆస్తులు
పీఎఫ్ విత్ డ్రా కొత్త రూల్స్.. ఏడాదికి రెండుసార్లు మాత్రమే..
పీఎఫ్ విత్ డ్రా కొత్త రూల్స్.. ఏడాదికి రెండుసార్లు మాత్రమే..
50 ఏళ్ల వయసులో ప్రియురాలిని పెళ్లాడిన ప్రముఖ నటుడు.. ఫొటోస్ వైరల్
50 ఏళ్ల వయసులో ప్రియురాలిని పెళ్లాడిన ప్రముఖ నటుడు.. ఫొటోస్ వైరల్