జోమాటోలో ఆర్డర్ చేసిన బిర్యానీలో బొద్దింక.. నగరంలోని ప్రముఖ హోటల్‌పై బాధితుల ఫిర్యాదు.. ఫోటోలు వైరల్
వైరల్ అవుతున్న ఈ ఫోటోను షేర్ చేసిన మహిళ వివరిస్తూ.. తాను ఫిష్ బిర్యానీని ఆర్డర్ చేశానని అయితే తనకు కొంచెం ఎక్కువ ప్రొటీన్ ఇచ్చేందుకు రెస్టారెంట్లు బిర్యానీకి ఏం జోడించారో చూడండి అనే క్యాప్షన్‌తో ఫోటోను షేర్ చేసింది సదరు మహిళ. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగినట్టుగా తెలిసింది. బాధిత మహిళ షేర్ చేసిన ఫోటో, ఆమె అనుభవం నెట్టింట వైరల్‌గా మారింది. అదే సమయంలో ఆన్‌లైన్‌లో హోటళ్లలో ఫుడ్ ఆర్డర్ చేయడంతో తమకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో..
ఇది ఆన్‌లైన్ ఆర్డర్‌ల యుగం. నేడు బట్టలు, ఎలక్ట్రానిక్ పరికరాల వంటి ఉత్పత్తులే కాదు ఆహారాన్ని కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి వినియోగిస్తున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అత్యధికంగా ఆన్‌లైన్ షాపింగ్ అలవాటు విస్తృతంగా ఉంటుంది. కానీ మీరు ఇలా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినప్పుడు కాస్త ఖర్చు ఎక్కువగా ఉంటుందని, అలాగే, ఆహారం నాణ్యత,పరిమాణం కూడా తక్కువగా ఉంటుందని తరచూ అనేక వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే, అన్ని రెస్టారెంట్లు ఇలా ఉండవు. కానీ, చాలా రెస్టారెంట్లపై ఇలాంటి ఫిర్యాదులు ఉన్నాయి. అదేవిధంగా ఆన్‌లైన్ ఆర్డర్‌లలో ఆహార పరిశుభ్రత,ఆహార భద్రతకు సంబంధించిన ఫిర్యాదులు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. తాజాగా అలాంటి ఘటనే బిర్యానీకి సంబంధించి మరొకటి వెలుగులోకి వచ్చింది. రెడ్డిట్ ద్వారా కస్టమర్ షేర్ చేసిన ఫోటో, ఫిర్యాదు సోషల్ మీడియా వేదికగా దుమారం రేపుతోంది.
వైరల్ అవుతున్న ఈ ఫోటోను షేర్ చేసిన మహిళ వివరిస్తూ.. తాను ఫిష్ బిర్యానీని ఆర్డర్ చేశానని అయితే తనకు కొంచెం ఎక్కువ ప్రొటీన్ ఇచ్చేందుకు రెస్టారెంట్లు బిర్యానీకి ఏం జోడించారో చూడండి అనే క్యాప్షన్‌తో ఫోటోను షేర్ చేసింది సదరు మహిళ. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగినట్టుగా తెలిసింది. హైదరాబాద్‌లోని కోటిలోని గ్రాండ్ హోటల్‌పై వారు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇప్పటి వరకు హోటల్ యజమానులు స్పందించారా లేదా అన్న విషయంపై స్పష్టత లేదు. కానీ, బాధిత మహిళ మాత్రం.. Zomato ద్వారా చేపల బిర్యాణీని కొనుగోలు చేశారు. భోజనం సగం అయ్యాక ఆహారంలోంచి చనిపోయిన బొద్దింక బయటపడిందని చెప్పారు.
ఇది ఎవరికైనా నిరాశ కలిగించే పరిస్థితి. ఫొటో చూస్తున్నప్పుడు వీక్షకులకు కూడా ఈ చేదు అనుభవం గుర్తు చేసుకున్నారు. బాధిత మహిళ షేర్ చేసిన ఫోటో, ఆమె అనుభవం నెట్టింట వైరల్‌గా మారింది. అదే సమయంలో ఆన్‌లైన్‌లో హోటళ్లలో ఫుడ్ ఆర్డర్ చేయడంతో తమకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో పలువురు సోషల్ మీడియాలో వెల్లడించారు. ఆహార పరిశుభ్రత, ఆహార భద్రతను నిర్ధారించడంలో సంబంధిత అధికారుల వైఫల్యం ఈ రంగంలో తీవ్రమైన వైఫల్యం అని పలువురు వాదిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..