మనిషైతే సరిపోదు మానవత్వం కూడా ఉండాలి.. హృదయాన్ని టచ్ చేసే వీడియో ఇది
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో రైల్లో ఒక వృద్ధ మహిళ చేతిలో నుండి ఒక బాటిల్ నుండి జ్యూస్ నేలపై పడింది. కిందపడిపోయిన జ్యూస్‌ని ఎలా క్లీన్ చేయాలో అర్థం కాక ఆమె తటపటాయిస్తున్న క్రమంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన చొక్కాను విప్పేసి కిందపడిపోయిన జ్యూస్‌ని శుభ్రం చేస్తాడు. ఇది చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోతున్నారు. అతను వృద్ధ మహిళకు సహాయం చేసిన తీరుకు అందరూ ప్రశంసించారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ యువకుడు ఔదర్యం ప్రదర్శించాడు. రైలులో ప్రయాణిస్తుండగా ఒక వృద్ధ మహిళకు అతడు సాయం చేసిన తీరు అందరినీ ఆకర్షించింది. ప్రజల హృదయాలను గెలుచుకోవడంలో విజయవంతమైన ఇలాంటి వీడియోలు చాలాసార్లు సోషల్ మీడియాలో కనిపిస్తాయి. ఇలాంటి వీడియోలను నెటిజన్లు సైతం ఎంతగానో ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి వృద్ధ మహిళకు సహాయం చేస్తున్నాడు. తెలిసో తెలియకో మహిళ చేతిలో ఉన్న జ్యూస్ బాటిల్ రైలు నేలపై పడింది. దాంతో ఆ వృద్ధురాలు పాపం ఏం చేయాలో అర్థంకాక సతమతమవుతుంది.. అంతలోనే ఆ యువకుడు స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది.. ఈ వ్యక్తి చేసిన పనిని చూసి జనాలు అవాక్కయ్యారు. తరువాత, ఆ వృద్ధురాలు అతన్ని ప్రేమగా కౌగిలించుకుంటుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై జనాలు ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రజల హృదయాలను కొల్లగొడుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో రైలులో ప్రయాణికులు ప్రయాణిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. రైల్లో ఒక వృద్ధ మహిళ చేతిలో నుండి ఒక బాటిల్ నుండి జ్యూస్ నేలపై పడింది. కిందపడిపోయిన జ్యూస్‌ని ఎలా క్లీన్ చేయాలో అర్థం కాక ఆమె తటపటాయిస్తున్న క్రమంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన చొక్కాను విప్పేసి కిందపడిపోయిన జ్యూస్‌ని శుభ్రం చేస్తాడు. ఇది చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోతున్నారు. అతను వృద్ధ మహిళకు సహాయం చేసిన తీరుకు అందరూ ప్రశంసించారు. దాంతో ఆ వృద్ధురాలు అతన్ని కౌగిలించుకుంటుంది. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో షేర్ చేయబడింది. దీనిని ఇప్పటివరకు 27 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వైరల్ వీడియోను ఇప్పటి వరకు 6 లక్షల మందికి పైగా లైక్ చేశారు.
The best gentleman ever.pic.twitter.com/boUOqzEXnk
— Figen (@TheFigen_) November 30, 2023
అదే సమయంలో, చాలా మంది దీనిపై తమ అభిప్రాయాన్ని కూడా తెలిపారు. ఈ పోస్ట్‌పై ఒక వినియోగదారు, ‘హృదయాన్ని గెలుచుకునే వీడియో’ అని రాశారు. మరో వినియోగదారు ఇలా వ్రాశాడు, ‘ప్రతి వ్యక్తి ఇలాగే సహాయం చేయాలంటూ సూచించారు. అదే సమయంలో ఒక వినియోగదారు నేటి అత్యుత్తమ వీడియో అని రాశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..