AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pneumonia Recovery Food: న్యూమోనియా నుంచి త్వరగా కోలుకోవాలా.. ఈ ఆహారాలు తినాల్సిందే!

న్యూమోనియా అనేది ఊపిరి తిత్తులలో వచ్చే ఇన్ ఫెక్షన్. అందులోనూ ప్రస్తుతం చలి కాలం. ఈ సీజన్ లో ఎక్కువగా న్యుమోనియా ఎటాక్ చేసే ప్రమాదం ఉంది. గతంలో న్యుమోనియాతో బాధ పడిన వారికి మళ్లీ ఎటాక్ అయ్యే అవకాశం కూడా ఉంది. న్యూమోనియా వచ్చిన వారిలో ఊపిరి తీసుకోవడం కూడా కష్టం ఉంటుంది. ఊపిరి తిత్తుల్లో చీము, ద్రవంతో నిండి ఉంటుంది. జలుబు, ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, దగ్గు వంటివి న్యుమోనియాకు ప్రాథమిక లక్షణాలుగా..

Pneumonia Recovery Food: న్యూమోనియా నుంచి త్వరగా కోలుకోవాలా.. ఈ ఆహారాలు తినాల్సిందే!
Pneumonia Recovery Food
Chinni Enni
| Edited By: Ram Naramaneni|

Updated on: Dec 02, 2023 | 8:48 PM

Share

న్యూమోనియా అనేది ఊపిరి తిత్తులలో వచ్చే ఇన్ ఫెక్షన్. అందులోనూ ప్రస్తుతం చలి కాలం. ఈ సీజన్ లో ఎక్కువగా న్యుమోనియా ఎటాక్ చేసే ప్రమాదం ఉంది. గతంలో న్యుమోనియాతో బాధ పడిన వారికి మళ్లీ ఎటాక్ అయ్యే అవకాశం కూడా ఉంది. న్యూమోనియా వచ్చిన వారిలో ఊపిరి తీసుకోవడం కూడా కష్టం ఉంటుంది. ఊపిరి తిత్తుల్లో చీము, ద్రవంతో నిండి ఉంటుంది. జలుబు, ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, దగ్గు వంటివి న్యుమోనియాకు ప్రాథమిక లక్షణాలుగా చెప్పొచ్చు. కాబట్టి చలికాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. న్యూమోనియా నుంచి త్వరగా కోలుకోవాలంటే.. ఈ రకమైన ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

నారింజ:

నారింజలో విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇది బాగా హెల్ప్ అవుతుంది. నారింజలు ఎక్కువగా తినడం వల్ల.. న్యూమోనియాని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. అంతే కాకుండా విటమిన్ సి ఎక్కువగా ఉన్న పండ్లను కూడా తీసుకోవచ్చు.

తృణ ధాన్యాలు:

న్యూమోనియా ఎటాక్ చేసిన వారు బార్లీ, ఓట్స్, బ్రౌన్ రైస్ వంటి అధిక కార్బో హైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా ఉన్న తృణ ధాన్యాలు తీసుకుంటే త్వరగా కోలుకోవడానికి హెల్ప్ చేస్తాయి. తృణ ధాన్యాల్లో ఉండ సెలీనియం కంటెంట్.. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

వేడి నీరు – పానీయాలు:

న్యూమోనియా వచ్చిన వారు ఎక్కువగా గోరు వెచ్చగా ఉండే నీటిని తీసుకుంటూ ఉండాలి. ఒకటేసారి ఎక్కువగా తాగడం కంటే.. అప్పుడప్పుడూ వేడిగా ఉండే పానీయాలు తాగడం మంచిది.

అల్లం:

న్యూమోనియాతో బాధ పడుతున్న వ్యక్తులు అల్లం తీసుకోవడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. అల్లం తీసుకోవడం వల్ల న్యూమోనియా, ఛాతీ నొప్పికి కారణం అయ్యే ఇన్ ఫెక్షన్ లను తగ్గిస్తుంది. అల్లంలో ఉండే శోథ నిరోధక లక్షణాలు.. నొప్పిని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. ఇది శ్వాస నాళాల్లో ఏర్పడిన అడ్డంకులను క్లియర్ చేసి.. ఊపిరిని తీసుకోవడం ఈజీ చేస్తుంది.

తేనె:

వివిధ అనారోగ్య సమస్యల్ని తగ్గించుకోవడానికి తేనెను పూర్వం నుంచి ఉపయోగిస్తూంటారు. ఆయుర్వేదంలో కూడా తేనెను ఔషధంగా ఉపయోగిస్తారు. తేనెతో ఆరోగ్యమే కాకుండా చర్మ సౌందర్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. అలాగే తేనెతో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి వాటిని కూడా తగ్గించు కోవచ్చు. కాబట్టి న్యూమోనియా ఉన్న వారు కూడా తమ ఆహారంలో తేనెను చేర్చుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..