Oats Coconut Healthy Laddu: ఓట్స్ తో హెల్దీ లడ్డూ.. చిన్న పిల్లలకు బెస్ట్ స్నాక్!
మనం ఆహారంగా తీసుకునే వాటిల్లో ఓట్స్ కూడా ఒకటి. ఓట్స్ ఆరోగ్యానికి ఎంతో హెల్దీ అన్న విషయం తెలిసిందే. అలాగే కొబ్బరిని కూడా తీసుకుంటారు. కొబ్బరి, ఓట్స్ ఈ రెండింటిలో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇమ్యునిటీ పెంచుకోవడానికి, బరువు తగ్గించు కోవడానికి, జీర్ణ శక్తిని మెరుగు పరచడంలో, చర్మానికి రక్షణగా ఉంచడంలో ఓట్స్, కొబ్బరి బాగా సహాయ పడతాయి. ఓట్స్, పచ్చి కొబ్బరి కలిపి చేసే ఈ లడ్డూలు రుచితో పాటు హెల్దీగా కూడా ఉంటాయి. రోజుకు ఓ లడ్డూ పిల్లలకు ఇవ్వడం వల్ల వారికి ఇమ్యునిటీ బాగా లభిస్తుంది. పిల్లలకు లంచ్ బాక్స్ లో..

మనం ఆహారంగా తీసుకునే వాటిల్లో ఓట్స్ కూడా ఒకటి. ఓట్స్ ఆరోగ్యానికి ఎంతో హెల్దీ అన్న విషయం తెలిసిందే. అలాగే కొబ్బరిని కూడా తీసుకుంటారు. కొబ్బరి, ఓట్స్ ఈ రెండింటిలో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇమ్యునిటీ పెంచుకోవడానికి, బరువు తగ్గించు కోవడానికి, జీర్ణ శక్తిని మెరుగు పరచడంలో, చర్మానికి రక్షణగా ఉంచడంలో ఓట్స్, కొబ్బరి బాగా సహాయ పడతాయి. ఓట్స్, పచ్చి కొబ్బరి కలిపి చేసే ఈ లడ్డూలు రుచితో పాటు హెల్దీగా కూడా ఉంటాయి. రోజుకు ఓ లడ్డూ పిల్లలకు ఇవ్వడం వల్ల వారికి ఇమ్యునిటీ బాగా లభిస్తుంది. పిల్లలకు లంచ్ బాక్స్ లో కూడా పెట్టి ఇవ్వొచ్చు. ఇది పిల్లలకు బెస్ట్ స్నాక్ గా చెప్పవచ్చు. పిల్లలు బలంగా, దృఢంగా తయారవుతారు. ఈ లడ్డూలు తయారు చేయడం కూడా చాలా సింపుల్. మరి హెల్దీ కోకోనట్ ఓట్స్ లడ్డూలను ఎలా తయారు చేస్తారు? తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓట్స్ కోకోనట్ లడ్డూ తయారీకి కావాల్సిన పదార్థాలు:
ఓట్స్, పచ్చి కొబ్బరి, బెల్లం, నెయ్యి, యాలకుల పొడి.
ఓట్స్ కోకోనట్ లడ్డూ తయారీ విధానం:
ముందుగా ఒక కడాయి తీసుకుని ఓట్స్ వేసి.. రంగు మారేంత వరకూ వేయించు కోవాలి. ఇవి చల్లారాక.. మిక్సీలో వేసి మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉండేలా పౌడర్ చేసుకోవాలి. తర్వాత కడాయిలో బెల్లం తురుము, పచ్చి కొబ్బరి, కొద్దిగా నీళ్లు వేసి వేడి చేసుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత ఓట్స్ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమం దగ్గర పడే వరకు ఉడికించి.. నెయ్యి, యాలకుల పొడి కూడా వేసి కలుపు కోవాలి.
ఈ మిశ్రమం కాస్త వేడిగా ఉన్నప్పుడే తీసుకుని లడ్డూల్లా చుట్టు కోవాలి. అవసరం అయితే నెయ్యి కొద్దిగా వేసుకోవచ్చు. మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవడానికి వీలుంటుంది. అవసరం అనుకుంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకుని వేసుకోవచ్చు. అంతే ఎంతో టేస్టీగా ఉండే ఓట్స్ కోకోనట్ లడ్డూలు రెడీ. ఏదైనా స్పెషల్ డేస్, పండుగలు ఉన్నప్పుడు కూడా వీటిని తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.








