AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆలుగడ్డ తొక్కలను పరేయకండి.. అందులో ఆరోగ్యం దాగి ఉంది..! ముఖ్యంగా కేశ సౌందర్యానికి..

ప్రతి ఒక్కరి ఇంట్లో విరివిగా వండే కూరగాయ ఆలుగడ్డ అదే బంగాళదుంప. సాధారణంగానే బంగాళాదుంప మంచి కూరగాయ.. అంతేకాదు..దానిపై ఉండే తొక్క కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని మీకు తెలుసా.? శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఆలు తొక్కలు అద్భుతంగా సహాయపడుతుంది. అసలు ఆలుగడ్డ తొక్క వల్ల కలిగే ఉపయోగాలేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..ఎలా వాడాలో కూడా ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Dec 02, 2023 | 4:50 PM

Share
జుట్టు సమస్యలకు ఉత్తమమైన ఇంటి నివారణలలో ఒకటి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది కూడా వ్యర్థాలుగా విసిరిపారేసిన బంగాళదుంప తొక్కల నుండి. ఇది మీకు ఆశ్చర్యంగా అనిపించిన్పటికీ ఇది నిజం. ఎందుకంటే బంగాళదుంపలో ఉండే స్టార్చ్ జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతుంది.

1 / 5
జీవనశైలి సరిగా లేకపోవడం, వాతావరణంలో కాలుష్యం, సరైన ఆహారం లేకపోవడం వల్ల జుట్టు త్వరగా తెల్లగా మారుతుంది. ప్రస్తుతం చాలా మంది యువత కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే, నెరిసిన జుట్టును వదిలించుకోవడానికి చాలా మంది ఎక్కువగా రసాయనాలను ఉపయోగిస్తారు. కానీ, ఇది జుట్టు మాత్రమే కాకుండా స్కాల్ప్ ఎలర్జీని కూడా కలిగిస్తుంది.

2 / 5
బంగాళదుంప తొక్క నుండి తీసిన రసం జుట్టుకు మంచిదని చెబుతారు ఆరోగ్య నిపుణులు. ఇది జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. బంగాళాదుంప తొక్కల నుండి వచ్చే నీటిలో ఇనుము, జింక్, రాగి, కాల్షియం, పొటాషియం, నియాసిన్ మరియు మెగ్నీషియం ఉంటాయి. ఇది నెరిసిన జుట్టుకే కాదు జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది.

3 / 5
నెరిసిన జుట్టును నల్లగా మార్చటం కోసం బంగాళాదుంప తొక్కలను ఒక కప్పు వరకు తీసుకుని, అందులో మరో కప్పు నీళ్లు పోసి ఉడికించాలి. అందులో నీరు పూర్తిగా చిక్కబడే వరకు బాగా మరిగించాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని చిక్కటి పేస్ట్‌లా తయారు చేసుకుని దీన్ని మీ జుట్టుకు పట్టించి అరగంట పాటు అలాగే ఉంచి షాంపూతో తలస్నానం చేయాలి.

4 / 5
మరోక పద్దతిలో ఒక కప్పు బంగాళదుంప తొక్కలను ఉడికించిన తర్వాత ఆ గుజ్జులో కాఫీ పౌడర్‌, కలబంద, రోజ్ వాటర్ యాడ్‌ చేసుకోవాలి. ఈ లేహాన్ని జుట్టుకు బాగా పట్టించాలి. సుమారు అరగంట తర్వాత శుభ్రమైన నీటితో హెయిర్‌ వాష్‌ చేసుకోవాలి.

5 / 5