- Telugu News Photo Gallery Make sure that these Things do not slip out of your hand at all, check here is details
Vatu Tips: మీ చేతిలో నుంచి ఈ వస్తువులు అస్సలు జారిపోకుండా చూసుకోండి!
అప్పుడప్పుడు చేయి జారడం అనేది కామన్ గా అందరికీ జరిగే విషయం. కొన్ని సార్లు అనుకోకుండా చేయి జారి పోతూ వస్తువులు పడి పోతూ ఉంటాయి. కొన్ని రకాల గాజు వస్తువులు, పాత్రలు అయితే పగిలి పోతాయి. అయితే కొన్ని రకాల వస్తువుల అనేవి అసలు చేతిలో నుంచి జార కూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఎలాంటి వస్తువులు చేతిలో నుంచి జారితే.. ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయో..
Updated on: Dec 02, 2023 | 8:46 PM

అప్పుడప్పుడు చేయి జారడం అనేది కామన్ గా అందరికీ జరిగే విషయం. కొన్ని సార్లు అనుకోకుండా చేయి జారి పోతూ వస్తువులు పడి పోతూ ఉంటాయి. కొన్ని రకాల గాజు వస్తువులు, పాత్రలు అయితే పగిలి పోతాయి. అయితే కొన్ని రకాల వస్తువుల అనేవి అసలు చేతిలో నుంచి జార కూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఎలాంటి వస్తువులు చేతిలో నుంచి జారితే.. ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

చేతిలో నుంచి పాలు అనేవి కింద జారకుండా చూసుకోండి. పాలు కింద పడి పోవడం వల్ల కుటుంబంలో ఆందోళనకర పరిస్థితులు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు.

అలాగే చేతిలో నుంచి ఉప్పు కూడా జారి పోకుండా చూసుకోడాలి. అకస్మాత్తుగా చేతిలో నుంచి ఉప్పు పడి పోవడం వల్ల.. భవిష్యత్తులో డబ్బు కొరత, ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. బియ్యం, ధాన్యాలు కూడా కింద పడకూడదు. ఇవి కింద పడటం వల్ల.. భవిష్యత్తులో ఆహార కొరత, డబ్బు కొరత ఏర్పడవచ్చు.

నల్ల మిరియాలు కూడా చేతిలో నుంచి జారి పోకుండా చూసుకోండి. అవి జారి పోవడం వల్ల మీకు దగ్గరగా ఉండే వారు రాబోయే రోజుల్లో అనారోగ్య పాలవుతారు. అంతే కాకుండా ఆర్థిక, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని అర్థమట.

అదే విధంగా పూజకు సంబంధించిన వస్తువులు కూడా జారి పడిపోకుండా చూసుకోవాలి. పూజా ఫలకం చేతిలో నుంచి పొరపాటున జారి పడిపోయితే.. కుటుంబంలో యజమాని చిక్కుల్లో పడపోతారని అర్థం. కాబట్టి పైన తెలిపిన వస్తువులు వీలైనంత వరకూ జారి పడి పోకుండా చూసుకోండి.




