Ghol Fish: ఈ ఒక్క చేప ధర ఏకంగా ఐదు లక్షలు.! ఇది ఓ రాష్ట్రానికి స్టేట్‌ఫిష్‌.. ఎక్కడో తెలుసా..?

దాని ఎయిర్ బ్లాడర్ కారణంగా ఈ చేపకు విపరీతమైన డిమాండ్ ఉంది. బీర్, వైన్ తయారీలో దీనిని ఉపయోగిస్తారు. ఘోల్‌ ఫిష్‌ మూత్రపు తిత్తులు (ఎయిర్ బ్లాడర్)ను అనేక ఔషధాల్లో ఉపయోగిస్తారు. ఘోల్ ఫిష్ మాంసం, ఎయిర్ బ్లాడర్‌ను వేర్వేరుగా విక్రయిస్తారు. ముంబై నుంచి ఎయిర్ బ్లాడర్ విదేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతుంటుంది. చైనాతో సహా ఇతర ఆసియా దేశాలలో అధిక ధరకు అమ్ముడవుతోంది. దీని సహాయంతో చాలా ఫార్మా కంపెనీలు తమ మందులను తయారు చేస్తున్నాయి.

Ghol Fish: ఈ ఒక్క చేప ధర ఏకంగా ఐదు లక్షలు.! ఇది ఓ రాష్ట్రానికి స్టేట్‌ఫిష్‌.. ఎక్కడో తెలుసా..?
Ghol Fish
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 02, 2023 | 5:21 PM

గుజరాత్‌లో నాన్ వెజ్ తినే వారి సంఖ్య తక్కువ. అంటే గుజరాతీలు మాంసం, చేపలు వంటివి తక్కువగా తింటారట. అయితే బిజినెస్ పరంగా మాత్రం అన్ని రంగాలలోనూ ముందంజలోనే ఉంటుంది. గుజరాత్ సముద్రపు ఒడ్డున ఉన్న రాష్ట్రం కాబట్టి ఇక్కడ చేపల వ్యాపారం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇక్కడి నుండి చేపలు మన దేశానికే కాకుండా ప్రపంచం మొత్తానికి కూడా సరఫరా అవుతాయి. అందుకే ఇక్కడి ప్రభుత్వం చేపలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఇటీవల, గ్లోబల్ ఫిషరీస్ కాన్ఫరెన్స్ ఇండియా 2023 కార్యక్రమంలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఒక ప్రత్యేక చేపను రాష్ట్ర చేపగా ప్రకటించారు. దాని ప్రత్యేకత గురించి ఇక్కడ తెలుసుకుందాం.

గుజరాత్ స్టేట్‌ ఫిష్‌ గా గుర్తింపు..

గుజరాత్ ప్రభుత్వం స్టేట్‌ ఫిష్‌గా ప్రకటించిన చేప పేరు ఘోల్ ఫిష్. ఈ చేప చాలా ప్రత్యేకమైనది. దీనికి విదేశాలలో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా చైనాలో ఈ చేప అధిక ధరకు అమ్ముడవుతోంది. ముఖ్యంగా ఈ చేపను ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నందున చైనా ప్రజలు కూడా ఈ చేపను ఎక్కువగా తింటారు.

ఇవి కూడా చదవండి

ఈ చేప ఎంతో ప్రత్యేకమైనది..

ఈ చేప మాంసం, దాని ఎయిర్ బ్లాడర్ కారణంగా ఈ చేపకు విపరీతమైన డిమాండ్ ఉంది. బీర్, వైన్ తయారీలో దీనిని ఉపయోగిస్తారు. ఘోల్‌ ఫిష్‌ మూత్రపు తిత్తులు (ఎయిర్ బ్లాడర్)ను అనేక ఔషధాల్లో ఉపయోగిస్తారు. ఘోల్ ఫిష్ మాంసం, ఎయిర్ బ్లాడర్‌ను వేర్వేరుగా విక్రయిస్తారు. ముంబై నుంచి ఎయిర్ బ్లాడర్ విదేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతుంటుంది. చైనాతో సహా ఇతర ఆసియా దేశాలలో అధిక ధరకు అమ్ముడవుతోంది. దీని సహాయంతో చాలా ఫార్మా కంపెనీలు తమ మందులను తయారు చేస్తున్నాయి.

ఈ చేప ఎంతో ఖరీదైనది..?

ఈ చేపపై వెల్లడైన ప్రత్యేక కథనం ప్రకారం.. కిలో ఘోల్ చేప ధర రూ.5 నుంచి 15 వేల రూపాయల వరకు పలుకుతోంది. అయితే దాని ఎండిన ఎయిర్ బ్లాడర్ ధర మరింత ఎక్కువగా ఉంటుంది. ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుండగా దీని ధర కిలో రూ.25 వేలకు చేరింది. ఈ చేపను గుజరాత్ రాష్ట్ర చేపగా ఎంచుకోవడం వెనుక కూడా ఇదే కారణం. దాని భారీ డిమాండ్ కారణంగా మత్స్యకారులు సైతం ఈ చేపను ఎక్కువగా వేటాడుతుంటారు. అందుకే గుజరాత్ ప్రభుత్వం దీనిని సంరక్షించడానికి పలు రకాల చర్యలు తీసుకుంటోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..