డిసెంబర్‌ నెలలో టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? ఇది మీకు బెస్ట్‌ ట్రిప్‌..! యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు…

కర్నాటక దాని ఐశ్వర్యానికి ప్రసిద్ధి హంపి.. భారతదేశంలోని పూర్వ మధ్యయుగ హిందూ రాజ్యాలలో ఒకదానిని ప్రేరేపించే శిధిలాలు ఇక్కడ కనువిందు చేస్తాయి. విజయనగర కాలం నాటి ఈ చారిత్రాత్మక పట్టణంలో అన్వేషించదగిన అనేక శిథిలాలు ఉన్నాయి. హంపిలోని ఒక్కో ఆకర్షణ సందర్శకులను అబ్బురపరుస్తాయనడంలో సందేహం లేదు. హంపిలో సైక్లింగ్, రాక్ క్లైంబింగ్ వంటి థ్రిల్లింగ్ సాహసాలను సాహసికులు, పర్యాటకులు ఎంతగానో ఎంజాయ్‌ చేస్తారు.

డిసెంబర్‌ నెలలో టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? ఇది మీకు బెస్ట్‌ ట్రిప్‌..! యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు...
Attention Travelers
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 02, 2023 | 5:43 PM

కర్ణాటకకు గొప్ప చరిత్ర, వారసత్వం, శక్తివంతమైన సంస్కృతులు ఉన్నాయి. ఇక్కడి పర్యాటక ఆకర్షణలు పర్యాటకుల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తాయి. మీరు ఆసక్తిగల యాత్రికులైనా, చరిత్ర ప్రియులైనా, సాహసోపేతమైన పర్యాటనలు చేయాలనుకున్నా, ప్రతి ఒక్కరికీ చాయిస్‌లో కర్ణాటక అగ్రస్థానంలో ఉంటుంది. కర్ణాటకలోని 4 UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశాల గురించి సవివరమైన సమాచారాన్ని ఇక్కడ తెలుసుకుందాం..మీరు కూడా కర్ణాటక టూర్‌ ప్లాన్‌ చేసుకున్నట్టయితే.. అది మీకు మరింత చిరస్మరణీయంగా మార్చుకోవడానికి ఈ ప్రదేశాలను సందర్శిస్తారు. ఈ ప్రదేశాలను తప్పక సందర్శించండి..

కర్నాటక దాని ఐశ్వర్యానికి ప్రసిద్ధి హంపి.. భారతదేశంలోని పూర్వ మధ్యయుగ హిందూ రాజ్యాలలో ఒకదానిని ప్రేరేపించే శిధిలాలు ఇక్కడ కనువిందు చేస్తాయి. విజయనగర కాలం నాటి ఈ చారిత్రాత్మక పట్టణంలో అన్వేషించదగిన అనేక శిథిలాలు ఉన్నాయి. హంపిలోని ఒక్కో ఆకర్షణ సందర్శకులను అబ్బురపరుస్తాయనడంలో సందేహం లేదు. హంపిలో సైక్లింగ్, రాక్ క్లైంబింగ్ వంటి థ్రిల్లింగ్ సాహసాలను సాహసికులు, పర్యాటకులు ఎంతగానో ఎంజాయ్‌ చేస్తారు.

UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో పట్టడకల్లు చాలా సొగసైన ప్రదేశం. చరిత్ర ప్రేమికులను ప్రతిచోటా ఆకర్షించే ఈ ప్రాంతం చాళుక్యుల రాజవంశం నిర్మాణ ఆవిష్కరణలను ప్రదర్శిస్తుంది. అద్భుతమైన దేవాలయాలు ఆనాటి కళాత్మక నైపుణ్యాన్ని తెలియజేస్తాయి.

ఇవి కూడా చదవండి

* పట్టడకల్లు బాగల్‌కోటే జిల్లాలో ఉంది. అక్టోబర్ నుండి మార్చి మధ్య సందర్శించడానికి ఇది అనువైన ప్రదేశంగా చెబుతారు.

* బేలూరులోని చెన్నకేశవ దేవాలయం..హళేబీడులోని హోయసలేశ్వర దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చబడ్డాయి.

* హొయసల కాలంలో నిర్మించబడిన ఈ దేవాలయాలు విశేషమైన నగారా, ద్రావిడ శైలి శిల్పకళను ప్రదర్శిస్తాయి. ఆలయ శిల్పాలు, సున్నితమైన శిల్పాలు వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయి. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

* శ్రీరంగపట్నం: మాండ్య జిల్లాలో కావేరీ నదికి సమీపంలో ఉన్న శ్రీరంగపట్నం కర్ణాటకలోని ఉత్తమ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇక్కడి రంగనాథస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి. ఇది కర్నాటకలోని ప్రసిద్ధ, అతిపెద్ద దేవాలయం. శ్రీరంగపట్నంలోని కోటలు అనేక చారిత్రక కట్టడాలు పర్యాటకుల్ని కట్టిపడవేస్తాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..