AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూ లోని పులి బోనులో సగం తిన్న మనిషి మృతదేహం కలకలం.. ఏం జరిగిందంటే..

కానీ, పులి మనిషిపై దాడి చేయడానికి అది బోనులోంచి బయటకు రాలేదని, బదులుగా మృతిచెందిన వ్యక్తే పులి ఆవరణలోకి వెళ్లినట్టుగా ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. ఏదైనా భద్రతా లోపం ఉంటే, దానిని కూడా పరిష్కరిస్తామని అన్నారు. అవసరమైతే జూలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను కూడా నియమిస్తామని చెప్పారు. మృతదేహం గుర్తించలేని స్థితిలో ఉందన్నారు. అలాగే మృతదేహాన్ని గుర్తించేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదని చెప్పారు.

జూ లోని పులి బోనులో సగం తిన్న మనిషి మృతదేహం కలకలం.. ఏం జరిగిందంటే..
Half Eaten Body
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 09, 2023 | 11:39 AM

జూ లేదా నేషనల్ పార్క్‌ వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరూ ఎంతో అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలి.. ఈ విషయంపై జూ సిబ్బంది పదే పదే హెచ్చరికలు, సూచనలు చేస్తూనే ఉంటారు. అయినప్పటికీ కొందరు పర్యాటకులు అల్లరి చిల్లరగా ప్రవర్తిస్తుంటారు. చాలా సందర్భాలలో జంతుప్రదర్శనశాలకు వచ్చిన కొందరు వ్యక్తులు అక్కడి జంతువులపై రాళ్ళు విసరడం వంటి వెకిలి చేష్టలు మనం చూస్తాము. మరికొన్ని సందర్భాల్లో వ్యక్తులు బోనులో ఉన్న జంతువులను ముట్టుకోవాలనే ప్రయత్నం లేదంటే, వాటికి ఆహారం అందించాలనే కోరికతో పరుగులు తీస్తూ..ప్రమాదాలకు గురవుతుంటారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఇలాంటి విషాద సంఘటనలను మనం చాలా చూశాం. అయితే, తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్‌లోని షేర్‌బాగ్ జంతుప్రదర్శనశాలలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. జూ సిబ్బంది పులి బోనులో సగం తిన్న వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. ఈ వ్యక్తి పులి బోనులోకి దూకి ఉంటాడని భావిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

పాకిస్థాన్‌లో జరిగిన ఓ షాకింగ్ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాకిస్థాన్‌లోని బహవల్‌పూర్‌లోని షేర్‌బాగ్ జంతుప్రదర్శనశాలలో షాకింగ్‌ ఘటన వెలుగుచూసింది. పులి బోనులో సగం తిన్న మనిషి మృతదేహాన్ని జూ సిబ్బంది గుర్తించడంతో ప్రజలు షాక్‌కు గురయ్యారు. ఈ వ్యక్తి పులి బోనులోకి దూకి ఉంటాడని భావిస్తున్నారు.

వన్యప్రాణి విభాగం సీనియర్ అధికారి ఉస్మాన్ బుఖారీ మాట్లాడుతూ, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించామని చెప్పారు. అక్కడి సీసీ టీవీ ఫుటేజ్‌, ఎన్‌క్లోజర్ నుండి వచ్చిన ఆధారాల ప్రకారం.. అతనిపై పులులు దాడి చేసిన సమయంలో అతడు బ్రతికే ఉన్నాడని భావిస్తున్నట్టుగా చెప్పారు. ఈ ఘటన తర్వాత పంజాబ్‌లోని తూర్పు ప్రావిన్స్‌లో ఉన్న ఈ జూని మూసివేశారు. అలాగే, పులి బోనులోకి ఆ మనిషి ఎలా వెళ్లాడనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. కానీ, పులి మనిషిపై దాడి చేయడానికి అది బోనులోంచి బయటకు రాలేదని, బదులుగా మృతిచెందిన వ్యక్తే పులి ఆవరణలోకి వెళ్లినట్టుగా ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. ఏదైనా భద్రతా లోపం ఉంటే, దానిని కూడా పరిష్కరిస్తామని అన్నారు. అవసరమైతే జూలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను కూడా నియమిస్తామని చెప్పారు. మృతదేహం గుర్తించలేని స్థితిలో ఉందన్నారు. అలాగే మృతదేహాన్ని గుర్తించేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదని చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. పులి ఎన్‌క్లోజర్‌లోకి దూకిన వ్యక్తి మతిస్థిమితం లేని వాడిగా జూ సిబ్బంది చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం విచారణలో ఉంది. ఆ వ్యక్తి సింహం ఆవరణలోకి దూకి ప్రాణాలు కోల్పోవడంతో ఏం జరిగిందో తదుపరి విచారణ తర్వాత మాత్రమే తెలుస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..