AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యముడిని ఎదురించిన స్నేహం.! లోయలో పడబోయిన కారు.. మిత్రుడి కోసం మిగిలిన వారు ఏం చేశారంటే..

వైరల్‌గా మారిన ఈ వీడియోపై జనాలు ఘాటుగా స్పందిస్తున్నారు. ఒక వినియోగదారు స్పందింస్తూ..ఇది స్నేహంలోని బలం అంటూ రాశారు. మరొక వినియోగదారు, షాకింగ్ వీడియో అని రాశారు. అదే సమయంలో మరొక వినియోగదారు స్పందిస్తూ..వీడియో తీసిన వ్యక్తులు కూడా తయారీదారు కూడా సపోర్ట్ చేసి ఉంటే వాహనం కూడా సేవ్ చేయబడి ఉండేది అని రాశాడు.

యముడిని ఎదురించిన స్నేహం.! లోయలో పడబోయిన కారు.. మిత్రుడి కోసం మిగిలిన వారు ఏం చేశారంటే..
Car Fall Into A Deep Ditch
Jyothi Gadda
|

Updated on: Dec 09, 2023 | 10:23 AM

Share

సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అది క్షణాల్లో మన అరచేతిలో ప్రత్యక్షమవుతుంది. సోషల్ మీడియాలో చాలా సార్లు హృదయాన్ని కదిలించే వీడియోలు కనిపిస్తాయి. అలాంటి వీడియోల్లో కొన్ని ఎమోషనల్‌గా ఉంటాయి. ఈ రోజుల్లో ఇలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కొంతమంది స్నేహితులు తమ మిత్రుడిని మృత్యువు బారిన పడకుండా.. రక్షించి కాపాడారు. వైరల్ వీడియోను చూసిన ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు. ఆ స్నేహితులను ప్రశంసిస్తున్నారు. మిలియన్ల మంది ప్రజలు ఇప్పటివరకు వీడియోను వీక్షించారు. వీడియోపై నెటిజన్లు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే..

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక కారు లోతైన గుంటలో పడబోతుంది. కారు ఆ గుంట అంచున ఆగిపోయి ఉంది..అదే సమయంలో కొందరు స్నేహితులు కారులో ఉన్న వ్యక్తిని రక్షించడానికి ప్రయత్నించారు. వారి సాయంతో కారులో ఉన్న ఆ వ్యక్తి సురక్షితంగా కారులోంచి దిగిపోయాడు. ఆ మరుక్షణంలోనే కారు లోతైన గుంతలో పడిపోయింది. ఈ వీడియో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. వారి స్నేహాన్ని, తమ స్నేహితులను ఎంతగానో కొనియాడుతున్నారు. @HasnaZaruriHai అనే యూజర్ ద్వారా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో వీడియో షేర్ చేయబడింది. దీనిని ఇప్పటివరకు 50 వేల మందికి పైగా వీక్షించారు.

ఇవి కూడా చదవండి

వైరల్‌గా మారిన ఈ వీడియోపై జనాలు ఘాటుగా స్పందిస్తున్నారు. ఒక వినియోగదారు స్పందింస్తూ..ఇది స్నేహంలోని బలం అంటూ రాశారు. మరొక వినియోగదారు, షాకింగ్ వీడియో అని రాశారు. అదే సమయంలో మరొక వినియోగదారు స్పందిస్తూ..వీడియో తీసిన వ్యక్తులు కూడా తయారీదారు కూడా సపోర్ట్ చేసి ఉంటే వాహనం కూడా సేవ్ చేయబడి ఉండేది అని రాశాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..