AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: లక్ అంటే ఈ మహిళాదే.. సోడా కోసం వెళ్లి లాటరీ టికెట్ కొంది .. లక్షలు గెలుచుకుంది.. ఎక్కడంటే

ఒక పేదవాడు రాజుగా..  రాజు పేదవాడుగా మారడానికి ఎక్కువ సమయం పట్టదు. ఎప్పుడు ఎవరిని ఎలా అదృష్టం, దురదృష్టం వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. లక్ కలిసి వచ్చి ఎవరు అందలం ఎక్కుతారో ఎవరూ ఊహించలేరు. జానెట్ బైన్ అనే మహిళ విషయంలో కూడా అలాంటిదే జరిగింది. అమెరికాలోని వర్జీనియాలో నివసిస్తున్న ఈ మహిళ షాపులో సోడా కొనుక్కోవడానికి వెళ్లింది.

Viral News: లక్ అంటే ఈ మహిళాదే.. సోడా కోసం వెళ్లి లాటరీ టికెట్ కొంది .. లక్షలు గెలుచుకుంది.. ఎక్కడంటే
Lottery Jackpot
Surya Kala
|

Updated on: Dec 11, 2023 | 5:16 PM

Share

మనిషి జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. కొందరికి అదృష్టం కలిసి వచ్చి క్షణకాలంలో కోటీశ్వరులు అవుతారు. ఈ రోజు పేదరికంతో బాధపడేవారు రేపు ఆ జీవితాన్ని గడపాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అదృష్టానికి సంబంధించిన అనేక వార్తలను వింటూనే ఉంటారు. కొందరి జీవితాలు ప్రతి పైసా కోసం ఆశగా ఎదురుచూసే విధంగా నిరాశగా గడుస్తూ ఉంటాయి. అయితే అలాంటి వ్యక్తుల నిరాశను పోగొట్టే విధంగా హఠాత్తుగా లక్ష్మీదేవి తలుపు తట్టి లక్షలు కురిపిస్తే  అప్పుడు ఆ వ్యక్తి పరిస్తితి ఎలా ఉంటుంది.. ఇలాంటి సంఘటన ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ విషయం తెలిసిన తర్వాత చాలా మంది షాక్ తింటున్నారు..

ఒక పేదవాడు రాజుగా..  రాజు పేదవాడుగా మారడానికి ఎక్కువ సమయం పట్టదు. ఎప్పుడు ఎవరిని ఎలా అదృష్టం, దురదృష్టం వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. లక్ కలిసి వచ్చి ఎవరు అందలం ఎక్కుతారో ఎవరూ ఊహించలేరు. జానెట్ బైన్ అనే మహిళ విషయంలో కూడా అలాంటిదే జరిగింది. అమెరికాలోని వర్జీనియాలో నివసిస్తున్న ఈ మహిళ షాపులో సోడా కొనుక్కోవడానికి వెళ్లింది. ఆ తర్వాత 100,000 డాలర్లు అంటే మన దేశ కరెన్సీలో రూ. 83 లక్షలు బహుమతిగా అందుకుంది. ఈ విషయం.. తాను డబ్బులు గెలుచుకున్న మొత్తం గురించి మహిళకు తెలియగానే ఆమె షాక్ తింది.

లాటరీ ఎలా తగిలిందంటే?

నివేదిక ప్రకారం జానెట్ బైన్ పని మీద తాను ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కు వెళ్ళింది. అప్పుడు జానెట్ సోడా తాగడానికి ఒక సాధారణ దుకాణం వద్ద ఆగి.. అక్కడ నిలబడి, ఆమె లాటరీ టిక్కెట్టును కొనుగోలు చేసింది. అలా అనుకోకుండా కొనుగోలు చేసిన లాటరీలో ఆ మహిళకు భారీ మొత్తంలో లాటరీ తగిలింది.  ఈ విషయం తెలిసిన వెంటనే ఆమె షాక్ అయ్యింది. తనకు వచ్చిన డబ్బుల గురించి తెలిసిన తర్వాత తన కాళ్ల కింద ఉన్న భూమి కిందకు దిగిన అనుభూతి కలిగిందని బెన్ చెప్పింది. ప్రస్తుతం తనకు లాటరీలో వచ్చిన  డబ్బును ఎలా ఖర్చు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు బెన్ చెప్పింది.

ఇవి కూడా చదవండి

అయితే ఇలాంటి ఘటన వెలుగులోకి రావడం ఇదే తొలిసారి కాదు.. బ్రిటన్‌లో ఓ మహిళ పాలు, రొట్టెలు కొనేందుకు వెళ్లి అక్కడ కొన్న లాటరీ టిక్కెట్‌ కొని లక్షల బహుమతి గెలుచుకుంది. అమెరికాలోని అర్కాన్సాస్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది, గ్యారీ లేసీ అనే మహిళ సిగరెట్ కొనడానికి వెళ్లగా అక్కడ 5 మిలియన్ డాలర్ల విలువైన లాటరీ కూడా వచ్చింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..