విదేశీ విద్యార్థులకు షాక్‌ !! వీసా నిబంధనలు మరింత కఠినతరం

విదేశీ విద్యార్థులకు షాక్‌ !! వీసా నిబంధనలు మరింత కఠినతరం

Phani CH

|

Updated on: Dec 11, 2023 | 8:38 PM

ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లే విద్యార్ధులకు షాకిచ్చింది ఆ దేశం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాలనుంచి విద్యార్ధులు ఉన్నత విద్యకోసం కెనడా వెళ్తుంటారు. ఈ క్రమంలో స్టూడెంట్‌ వీసా నిబంధనలు మరింత కఠినతరం చేసింది కెనడా. స్టడీ పర్మిట్‌ కోసం దరఖాస్తు చేసుకొనే విదేశీ విద్యార్థులు తమ ఆర్థిక సంసిద్ధతను పెంచుకొనేలా డిపాజిట్‌ను పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం 10 వేల డాలర్లు ఉన్న డిపాజిట్‌ను, 20,635 డాలర్లకు పెంచుతున్నట్టు కెనడా ఇమిగ్రేషన్‌ మంత్రి మార్క్‌ మిల్లర్‌ గురువారం ప్రకటించారు.

ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లే విద్యార్ధులకు షాకిచ్చింది ఆ దేశం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాలనుంచి విద్యార్ధులు ఉన్నత విద్యకోసం కెనడా వెళ్తుంటారు. ఈ క్రమంలో స్టూడెంట్‌ వీసా నిబంధనలు మరింత కఠినతరం చేసింది కెనడా. స్టడీ పర్మిట్‌ కోసం దరఖాస్తు చేసుకొనే విదేశీ విద్యార్థులు తమ ఆర్థిక సంసిద్ధతను పెంచుకొనేలా డిపాజిట్‌ను పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం 10 వేల డాలర్లు ఉన్న డిపాజిట్‌ను, 20,635 డాలర్లకు పెంచుతున్నట్టు కెనడా ఇమిగ్రేషన్‌ మంత్రి మార్క్‌ మిల్లర్‌ గురువారం ప్రకటించారు. ఈ నిబంధన జనవరి 1, 2024 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. కెనడాలో జీవన వ్యయం విషయంలో అంతర్జాతీయ విద్యార్థులు సవాళ్లను ఎదుర్కొంటున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకొని జీవన వ్యయ పరిమితిని సవరిస్తున్నట్టు మిల్లర్‌ వివరించారు. విద్యార్థుల వసతి కల్పనకు అవసరమైన మార్గాలను అన్వేషిస్తున్నామని, తమ నిర్ణయం ఆర్థిక బలహీనత, దోపిడీ నుంచి విద్యార్థులను రక్షిస్తుందని తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ ఆటో డ్రైవర్ చాలా స్పీడ్ గురూ !! రైలు కంటే వేగంగా వెళ్లి

ఎస్సై చేసిన పొరపాటు.. మహిళ తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్

రోడ్డుమీద హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి.. ఒక్కసారిగా దూసుకొచ్చిన పులి !!