AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ‘డ్రగ్స్ పేరెత్తితేనే భయం పుట్టాలి.. ఎంతటివారైనా వదిలిపెట్టొద్దు’

మత్తు మాఫియాపై ఉక్కుపాదం మోపాలంటూ నార్కోటిక్స్‌ అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్స్‌, గంజాయి ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవడానికి అదనపు టీమ్‌లను రంగంలోకి దించాలని అధికారులకు ఆయన సూచించారు. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి పాలనా వ్యవహారాల్లో స్పీడు పెంచారు.

Telangana: 'డ్రగ్స్ పేరెత్తితేనే భయం పుట్టాలి.. ఎంతటివారైనా వదిలిపెట్టొద్దు'
CM Revanth Reddy
Ravi Kiran
|

Updated on: Dec 12, 2023 | 9:00 AM

Share

మత్తు మాఫియాపై ఉక్కుపాదం మోపాలంటూ నార్కోటిక్స్‌ అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్స్‌, గంజాయి ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవడానికి అదనపు టీమ్‌లను రంగంలోకి దించాలని అధికారులకు ఆయన సూచించారు. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి పాలనా వ్యవహారాల్లో స్పీడు పెంచారు. వరుస రివ్యూలతో అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ఈ సందర్భంగా డ్రగ్స్ నియంత్రణపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. తాజాగా నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులతో ఆయన రివ్యూ మీటింగ్‌ నిర్వహించారు. తెలంగాణలో డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా నివారణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు ముఖ్యమంత్రి.

డ్రగ్స్‌ ముఠాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు సీఎం. అవసరమైతే టీమ్‌ స్ట్రెంగ్త్‌ను పెంచి అదనంగా బడ్జెట్ కేటాయించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో డ్రగ్స్ నియంత్రణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డ్రగ్స్ సరఫరా, వాడకంపై గతంలో పలువురు సినిమా ప్రముఖులకు నోటీసులు ఇచ్చారు. డ్రగ్స్ వ్యవహారంలో గతంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు అదే డ్రగ్స్ కేసుపై సీఎం రేవంత్‌ రెడ్డి రివ్యూ చేయడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ వినియోగం పెరుగుతున్నదంటూ ప్రజల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో నార్కోటిక్‌ అధికారులతో ఈ సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి.

ఈ సందర్భంగా డ్రగ్స్‌, గంజాయి ముఠాలపై నమోదైన కేసులను పరిగణనలోకి తీసుకుని పూర్తి స్థాయిలో మత్తు మాఫియాను నియంత్రించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. సంబంధిత అధికారులతో, పోలీసు విభాగాల ఆఫీసర్లతో చర్చించిన తర్వాత… ప్రస్తుతం హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియాను నియంత్రించడం కోసమే పనిచేస్తున్న నార్కోటిక్స్ వింగ్ పనితీరు, సాధించిన ఫలితాలు, ఎదురవుతున్న సవాళ్ళు, తీసుకోవాల్సిన కఠిన నిర్ణయాలు తదితరాలపై కూడా అధికారులతో సీఎం చర్చించారు. రేవంత్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో…ఇక మత్తు ముఠాలను పూర్తి స్థాయిలో చిత్తు చేసేందుకు నార్కోటిక్స్‌ అధికారులు రంగంలోకి దిగనున్నారు.

తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!