Telangana: తెలంగాణ ప్రజలకు అదిరే శుభవార్త.. ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం.. అన్నీ ఫ్రీ..
తెలంగాణ ప్రజలకు మరో గుడ్‌న్యూస్. త్వరలో హైదరాబాద్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించిన టిమ్స్ ఆస్పత్రి ప్రారంభం కానుంది. ఇందుకు డేట్ ఫిక్స్ అయింది. సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ఉచితంగా ప్రభుత్వంలో ఇందులో అందించనుంది. 16 ఆపరేషన్ థియేటర్లు ఇందులో ఉండగా.. సీనియర్ వైద్యులను అందుబాటులో ఉంచనున్నారు.

తెలంగాణలోని ప్రజలకు గుడ్‌న్యూస్. రాష్ట్రంలోని ప్రజలు ఉచితంగా అత్యాధునిక వైద్యం పొందవచ్చు. సూపర్ స్పెషాలిటీ వైద్యం ఉచితంగా రాష్ట్రంలోని పేదలకు అందనుంది. పేదలకు కార్పొరేట్ ఆస్పత్రుల తరహాలోనే అత్యాధునిక వైద్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం టిమ్స్ ఆస్పత్రిని హైదరాబాద్‌లో నిర్మించింది. అతిపెద్ద భవనాల సముదాయంతో దీనిని నిర్మించగా.. ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభానికి ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయింది. సనత్ నగర్‌లో నిర్మించిన ఈ ఆస్పత్రిని ఉగాది రోజున ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఆరోగ్య శ్రీ ట్రస్ట్ కార్యాలయంలో గురువారం టిమ్స్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఆస్పత్రి పనులు, ప్రారంభంపై చర్చించారు.
వైద్య సేవలు అందించేందుకు సిద్దం
దాదాపు టిమ్స్ పనులన్నీ పూర్తయ్యాయి. ఎక్విప్‌మెంట్ ట్రయల్స్ పూర్తి చేయనున్నారు. ఇక మిగిలిన సివిల్ వర్క్స్ కూడా త్వరలో పూర్తి కానున్నాయి. దాదాపు పనులన్నీ పూర్తవ్వగా.. వైద్య సేవలు అందించేందుకు సిద్దంగా ఉంచాలని అధికారులకు దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు.
హాస్పిటల్‌లో సౌకర్యాలు ఇవే..
-1000 పడకల హాస్పిటల్
-ఓపీ రూమ్‌లు
-డయాగ్నోస్టిక్స్, ఇన్‌పేషెంట్ ప్రత్యేక వార్డులు
-ఆపరేషన్ థియేటర్లు
-ఐసీయూలు
-సిటీ స్కాన్, ఎంఆర్‌ఐ, డిజిటల్ ఎక్స్‌రే మిషన్లు
-16 ఆపరేషన్ థియేటర్లు
-రోగులతో పాటు వెంట వచ్చేవారి కోసం సెంట్రలైజ్డ్ కిచెన్
రోగులకు సాఫ్ట్‌వేర్ ద్వారా సేవలు
రోగులకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా సేవలు అందించనున్నారు. ఓపీ రిజిస్ట్రేషన్ నుంచి డిశ్చార్జి వరకు అన్నీ ఈ ప్రత్యేక ఫ్లాట్‌ఫామ్‌లోనే జరుగుతాయి. ఇందుకోసం హెచ్‌ఎంఐఎస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకోనున్నారు. దీంతో రోగుల స్థితి ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. దీని వల్ల రోగులు వేగంగా సేవలు అందనున్నాయి. ఇక పారిశుద్ధ్యం, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సేవలను ఆధునిక ప్రమాణాలతో ఏర్పాటు చేయనున్నారు. ఇక ఎక్స్‌రే మెషీన్ల వినియోగంపై టెక్నిషీయన్లు, సిబ్బంది ట్రైనింగ్ ఇస్తున్నారు. అలాగే ఆస్పత్రి నిర్వహణకు అవసరమైన డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది నియామకాలు జరుగుతున్నాయి. నియామక ప్రక్రియపై మంత్రి ఆరా తీశారు. త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అటు రోగులు, సహాయకుల కోసం సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రజలకు దీని వల్ల కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందనుంది. దీంతో ప్రైవేట్ హాస్పిటల్‌లో లక్షలకు లక్షలకు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. ముందుగా నిమ్స్ పరిధిలోని సీనియర్ వైద్యుల సేవలను ఇందులో ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే వైద్యులను బదిలీ చేయనుంది.
