Dreams Meaning: కలలో నల్ల పిల్లి కనిపిస్తే మంచిదేనా? ఏం జరుగుతుందో తెలుసా..!
కలలు లోతైన సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఎటువంటి కారణాలు లేకుండా కలలు రావని స్వప్న శాస్త్రం చెబుతోంది. మనసులో అణచివేయబడ్డ భావాలు, కోరికలు కలల రూపంలో కనిపిస్తాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో కలలు చెబుతాయని, దాని ఫాలో అయితే జాగ్రత్త పడవచ్చని అంటున్నారు. ఎన్నో రకాల కలలు వస్తాయి. కలలో ఒక్కటేంటీ.. ఎన్నో వింతలు, విశేషాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా కలలో చాలా రకాల జంతువులు..

కలలు లోతైన సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఎటువంటి కారణాలు లేకుండా కలలు రావని స్వప్న శాస్త్రం చెబుతోంది. మనసులో అణచివేయబడ్డ భావాలు, కోరికలు కలల రూపంలో కనిపిస్తాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో కలలు చెబుతాయని, దాని ఫాలో అయితే జాగ్రత్త పడవచ్చని అంటున్నారు. ఎన్నో రకాల కలలు వస్తాయి. కలలో ఒక్కటేంటీ.. ఎన్నో వింతలు, విశేషాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా కలలో చాలా రకాల జంతువులు కనిపించడం సర్వ సాధారణం. ఈ క్రమంలో కొంత మందికి కలలో నల్ల పిల్లి కనిపించే ఉంటుంది. సాధారణంగా నల్ల పిల్లి ఎదురు పడితేనే అరిష్టం అని అంటూంటారు. మరి నల్ల పిల్లి కనిపిస్తే కలలో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మిమ్మల్ని పళ్లతో కొరికితే..
కలలో నల్ల పిల్లి కనిపిస్తే.. జాతకంలో రాహు దోషం ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. అలాగే నల్ల పిల్లి మీపై దాడి చేసి, పళ్లతో మిమ్మల్ని కొరికితే.. మీకు ప్రాణ గండం ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. సమీప భవిష్యత్తులో మీకు పెద్ద ప్రమాదం జరగవచ్చని ఈ కల సూచిస్తోంది. అయితే మీకు పిల్లి కలలో వచ్చినట్లు.. మీపై దాడి చేసిన విషయాన్ని రహస్యంగా ఉంచాలి. లేకుంటే మీకు ఇష్టమైన వ్యక్తి మీకు ద్రోహం చేయవచ్చు.
మీపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తే..
నల్ల పిల్లి మీపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తే.. మీరు దాని నుంచి తప్పించుకుంటే దానికి అర్థం.. మీకు సంబంధించిన కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు మీపై కుట్ర చేసేందుకు ప్రయత్నిస్తారు. కాబట్టి మీరు మీ వ్యాపారంలో పలు జాగ్రత్తలు పాటించాలి.
పిల్లి దాడిలో మీరు చనిపోతే..
మీపై పిల్లి దాడి చేసి.. ఆ దాడిలో మీరు మరణించినట్లయితే.. చాలా జాగ్రత్తగా ఉండాలి. సమీప భవిష్యత్తులో మీరు కొన్ని తీవ్రమైన వ్యాధులతో బాధ పడతారని అర్థం చేసుకోవచ్చు. కలలో పిల్లలు వేరే రంగుతో ఉంటే పర్వాలేదు కానీ.. నలుపు, తెలుపు రంగుల్లో ఉంటే మాత్రం ప్రాణాంతకంగా చెప్పొచ్చు. ఇలా పిల్లి మీకు కనబడిన తీరు పట్టి.. పలు రకాల అర్థాలు ఉంటాయి. అయితే కొన్ని సార్లు ఇవి కావచ్చు లేదా కాకపోవచ్చు. మీ అనుమానాలు, అపోహల గురించి శాస్త్ర నిపుణులను కలవడం ఉత్తమం.
(ఇది కేవలం నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ పేర్కొన్న అంశాలకు ఎలాంటి శాస్త్రీయత లేదని గమనించగలరు)








