Vastu Tips: ఇంట్లో ఈ వాస్తు దోషాలున్నాయా.? చాలా డేంజర్..
ఇంటి స్థలం కొనుగోలు నుంచి మొదలు ఇల్లు నిర్మాణం వరకు అన్ని వాస్తు ప్రకారం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక ఇంటిని ఎంత వాస్తు ప్రకారం నిర్మించినా తెలిసితెలియక చేసే కొన్ని తప్పులు ఇంట్లో ఉండే వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువులు వాస్తు ప్రకారం ఎలా ఉండాలి.? ఒకవేళ వాస్తుకు విరుద్ధంగా ఉంటే ఎలాంటి నష్టాలు ఎదురవుతాయి.?
భారతీయులను, వాస్తును వేరు చేసి చూడని పరిస్థితి. వాస్తు శాస్త్రాన్ని ఎక్కువగా విశ్వసించే వారిలో భారతీయులే ప్రధానంగా ఉంటారు. ఇంటి నిర్మాణం వాస్తుకు అనుగుణంగా ఉండాలని భావిస్తుంటారు. అందుకు అనుగుణంగానే వాస్తు పండితుల అభిప్రాయాల మేరకు ఇంటి నిర్మాణాన్ని చేపడుతంటారు.
ఇంటి స్థలం కొనుగోలు నుంచి మొదలు ఇల్లు నిర్మాణం వరకు అన్ని వాస్తు ప్రకారం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక ఇంటిని ఎంత వాస్తు ప్రకారం నిర్మించినా తెలిసితెలియక చేసే కొన్ని తప్పులు ఇంట్లో ఉండే వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువులు వాస్తు ప్రకారం ఎలా ఉండాలి.? ఒకవేళ వాస్తుకు విరుద్ధంగా ఉంటే ఎలాంటి నష్టాలు ఎదురవుతాయి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
* ఇంటికి తూర్పు దిశలో చెత్త కుప్పలు వేస్తే దరిద్రం వెంటాడుతుంది. ఇంటి బయట కూడా తూర్పు దిశలో చెత్తలేకుండా చూసుకోవాలి.
* తూర్పు దిశలో చెట్లను పెంచుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటికంటే ఎక్కువ ఎత్తులో ఉండకుండా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
* ఇక ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో బరువైన వస్తువులను తూర్పు దిశలో పెట్టకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో అశాంతి నెలకొంటుంది.
* ఇంటి ఆగ్నేయ దిశ మిగతా అన్ని దిక్కుల కంటే ఎత్తుగా ఉండకూదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వాస్తు లోపం ఉంటే ఇంట్లో వారందరికీ అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉంటాయంటున్నారు.
* ఇక ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో దక్షిణ దిశలో మంచి బోర్ ఉండకుండా చూసుకోవాలి. ఇలాంటి వాస్తు దోషం ఉంటే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు.
* నైరుతి దిశకు సమీపంలో ఎట్టి పరిస్థితుల్లో తలుపు ఉండకుండా చూసుకోవాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు. ఇలాంటి వాస్తు దోషం వల్ల ప్రమాదాలను ఆహ్వానించినట్లే అవుతుంది.
* ఇంటికి ఈశాన్య దిశలో కొంత ఖాళీ స్థలం ఉండాలి. ఒకవేళ ఈశాన్యంలో ఏమైనా వాస్తు లోపాలు ఉన్నట్లయితే స్వస్తిక్, ఓం చిహ్నాలను ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏవైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయి.
* ఇంటి లోపలికి తూర్పు దిశ నుంచి గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. అందుకే ఇంటి చుట్టూ ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు.
* ఇక తలుపుల విషయంలో కూడా కొన్న వాస్తు చిట్కాలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఇంటి తలుపు ఎట్టి పరిస్థితుల్లోనూ నైరుతి దిశలో ఉండకూడదు. ఒక తలుపు మరొక తలుపుకు ఎదురుగా ఉండకూడదు. మెట్లు తూర్పు ఆగ్నేయం లేదా ఉత్తర వాయువ్యంగా ఉండాలి.
నోట్: పైన తెలిపిన విషయాలు వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాలు, వాస్తు పండితులు తెలిపిన విషయాల ఆధారంగా అందించినవి మాత్రమే. ఇందులో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..