Peral Benefits: చంద్ర దోషం ఉందా ముత్యం ధరించి చూడండి ..! జ్యోతిష్య శాస్త్రం ఏమి చెబుతుందంటే
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కర్కాటకం, ధనుస్సు, మీన రాశుల వారు ముత్యాన్ని ధరించవచ్చు. అదే సమయంలో జన్మ కుండలిలో చంద్రుడు ఉన్నతమైన లేదా సానుకూల స్థితిలో ఉన్న వ్యక్తులు కూడా ముత్యాన్ని ధరించవచ్చు. ముత్యాన్ని ఎప్పుడూ వెండితో చేసిన ఉంగరంలో ధరించాలి. ముత్యాల చంద్ర గ్రహానికి సంబంధించినది. కనుక దీనిని సోమవారం ఉదయం ధరించాలి. ఈ ఉంగరాన్ని చేతి చూపుడు వేలికి ధరించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
ఎవరి జాతకంలోనైనా చంద్రునికి సంబంధించిన దోషాలు తొలగిపోవడానికి ముత్యం ధరించడం మంచిది. చంద్రుడికి సంబంధించిన ముత్యం శుభ, అశుభాలను ఎలా సూచిస్తుందో తెలుసా? గ్రహాల శుభ ప్రభావాలను పెంచడానికి, వాటి అశుభాలను తగ్గించడానికి రత్న శాస్త్రంలో అనేక రత్నాలు పేర్కొన్నారు. ఈ రత్నాల్లో ఒకటి ముత్యం. రత్నశాస్త్రంలో ముత్యాన్ని ముఖ్యమైన రత్నంగా పరిగణిస్తారు. ముత్యం రంగు తెలుపు లేదా క్రీమ్ రంగులో ఉంటుంది. ఇది చంద్రుని కారకంగా పరిగణించబడుతుంది.
ముత్యాలు ఎందుకు ధరిస్తారంటే
రత్నశాస్త్రం ప్రకారం జాతకంలో లోపం ఉన్నప్పుడు చంద్రుడు ఆలోచనలు, మనస్సుపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తాడు. అటువంటి పరిస్థితిలో మనస్సును ప్రశాంతంగా, స్థిరంగా ఉంచుకోవడానికి ముత్యాన్ని ధరిస్తారు. విపరీతమైన కోపం లేదా డిప్రెషన్ తో ఉన్నవారు కూడా ముత్యాన్ని ధరించడం ద్వారా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. అంతేకాదు ముత్యం చంద్రుడిలా ప్రశాంతంగా, అందంగా, చల్లగా ఉంటుంది. ఎవరి జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నా.. చంద్ర దోషం ఉన్నా ముత్యాన్ని ధరించాలి. ముత్యం ధరించిన వ్యక్తి అనేక ప్రయోజనాలను పొందుతాడు.
ముత్యం ఏ రాశి వారికి శుభప్రదం అంటే
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కర్కాటకం, ధనుస్సు, మీన రాశుల వారు ముత్యాన్ని ధరించవచ్చు. అదే సమయంలో జన్మ కుండలిలో చంద్రుడు ఉన్నతమైన లేదా సానుకూల స్థితిలో ఉన్న వ్యక్తులు కూడా ముత్యాన్ని ధరించవచ్చు. ముత్యాన్ని ఎప్పుడూ వెండితో చేసిన ఉంగరంలో ధరించాలి.
ముత్యాల చంద్ర గ్రహానికి సంబంధించినది. కనుక దీనిని సోమవారం ఉదయం ధరించాలి. ఈ ఉంగరాన్ని చేతి చూపుడు వేలికి ధరించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇతర వేలికి ఉంగరం ధరించడం మంచిది కాదని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ముత్యం ప్రాముఖ్యత
ముత్యం, చంద్రశిల ధరించడం కొంతమందికి అశుభం. ఇది ప్రజలకు హానిని కూడా కలిగిస్తుంది. అందువల్ల, ధరించే ముందు ఖచ్చితంగా జ్యోతిష్కుల సలహా తీసుకోండి. ఉద్వేగభరితంగా ఉంటే లేదా చాలా కోపంగా ఉంటే ముత్యాలను ధరించకూడదు. ఎందుకంటే ఇలా చేయడం వలన భావోద్వేగాలు తీవ్ర తరం అవుతాయి. ముత్యాన్ని హిందూమతంలో పవిత్రమైన రత్నంగా పరిగణిస్తారు. చాలా మంది దీనిని దైవత్వం, స్వచ్ఛత, అందానికి చిహ్నంగా భావిస్తారు. అంతేకాదు ముత్యాన్ని ధరించడం శుభదాయకమా లేదా అశుభమా అనేది వ్యక్తికి సంబంచించిన విశ్వాసం, హిందూ మత దృక్పథంపై ఆధారపడి ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు