యాగంటి బసవయ్య: శివాలయాలు అనగానే ఆలయంలో నంది విగ్రహం ఉండడం సహజం శివాలయం లోకి అడుగుపెట్టగానే మనకు నందీశ్వరుడు కనిపిస్తాడు. ఐతే యాగంటి దేవాలయంలో ఉన్న నందీశ్వరునికి ఓ ప్రత్యేకత ఉంది ఆలయంలో ఈశాన్య భాగంలో నందీశ్వరుడు కొలువై ఉండడం.. ఆ నంది విగ్రహం అంతకంతకు పెరుగుతూ ఉండడం ఇక్కడి ప్రత్యేకత.. పురావస్తు శాఖ అంచనా ప్రకారం ఈ నంది విగ్రహం ప్రతి 20 సంవత్సరాలకు అంగుళం మేర పెరుగుతుందని నిర్దారించారు.