ఇదేక్కడి దారుణం..! అమ్మాయి మెడలో బెల్టు కట్టి.. కుక్కలా వీధుల్లో తిప్పుతున్న మహిళ.. నేరం ఏంటో మరీ..?

ఈ వింత దృశ్యాన్ని చోద్యం చూస్తు్న్న స్థానికులతో పాటు, వీడియో తీసిన వారిపై కామెంట్స్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఈ షాకింగ్ వీడియోలో ఒక మహిళ అమ్మాయి మెడకు బెల్టు కట్టుకుని రోడ్డుపై నడిపిస్తోంది. మెడలో బెల్టుతో ఉన్న యువతి.. నల్లటి దుస్తులు ధరించి,ఒక జంతువుల మోకాళ్లపై చేతులతో నడుస్తోంది. అంతేకాదు.. ఆ అమ్మాయి

ఇదేక్కడి దారుణం..! అమ్మాయి మెడలో బెల్టు కట్టి.. కుక్కలా వీధుల్లో తిప్పుతున్న మహిళ.. నేరం ఏంటో మరీ..?
Woman Tied Belt
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 18, 2024 | 1:15 PM

అప్పుడప్పుడు మనం వీధీలో నడుస్తుంటే.. చిన్న గొడవలు, పంచాయతీలు జరగడం చూస్తుంటాం..కానీ మెడలో బెల్టుతో కుక్కలా తిరుగుతున్న వ్యక్తిని ఎప్పుడైనా చూశారా..? తాజాగా ఇలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. అది చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. ఈ వింత దృశ్యాన్ని చోద్యం చూస్తు్న్న స్థానికులతో పాటు, వీడియో తీసిన వారిపై కామెంట్స్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఈ షాకింగ్ వీడియో ముంబైకి చెందినదిగా తెలిసింది. అక్కడ ఒక మహిళ అమ్మాయి మెడకు బెల్టు కట్టుకుని రోడ్డుపై నడిపిస్తోంది. మెడలో బెల్టుతో ఉన్న యువతి.. నల్లటి దుస్తులు ధరించి,ఒక జంతువుల మోకాళ్లపై చేతులతో నడుస్తోంది. అంతేకాదు.. ఆ అమ్మాయి కూడా జంతువులా ప్రవర్తిస్తుంది. అమ్మాయి మెడలో బెల్టు కట్టి పట్టుకుని రోడ్డుపై తిరుగుతున్న మహిళను మీరు చూడవచ్చు.

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో @mathrunner7 అనే ఖాతాతో షేర్‌ చేయబడింది. వీడియోను షేర్ చేస్తూ, ‘ముంబైకి ఏమైంది? సోషల్ మీడియాలో వీక్షణల కోసం ప్రజలు ఈ స్థాయికి ఎలా దిగజారుతున్నారు?’ అంటూ విమర్శిస్తున్నారు. పోస్ట్‌ను ముంబై పోలీసులకు ట్యాగ్ చేసి, బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి చర్య అనుమతించబడుతుందా అని అడిగారు.

ఇవి కూడా చదవండి

కేవలం 26 సెకన్ల ఈ వీడియోకి ఇప్పటి వరకు 12 వేలకు పైగా వీక్షణలు వచ్చాయి. ఈ వీడియోపై యూజర్లు రకరకాలుగా రియాక్షన్స్ ఇస్తున్నారు. దీని గురించి వ్రాసిన ఒక వినియోగదారు, మన భారతదేశానికి ఇప్పుడు ఇలాంటి వ్యాధి సోకింది అంటూ ఎద్దేవా చేశారు. మరో వినియోగదారు ఇలాంటి విపరీత చర్యల వల్ల ఇన్‌స్టాగ్రామ్‌ను మూసివేయడం మంచిదని మండిపడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..