AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smartest Snake: ప్రపంచంలోనే అత్యంత తెలివైన పాము ఇదే..! లేకపోతే నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారా..? అంటూ యువకుడి స్టంట్‌ వైరల్‌..

జంతువులు, పాముల వీడియోలతో ఫేమస్ అయిన నిక్ ది రాంగ్లర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో 4 మిలియన్లకు పైగా వీక్షణలను సంపాదించింది. పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయిన ఈ వీడియోను చూసి చాలా మంది భయాందోళనలకు గురవుతున్నారు. స్నేక్ వీడియో చూసి చాలా మంది నివ్వెరపోతే, కొందరు యువకుడి ధైర్యాన్ని ప్రశంసించారు.

Smartest Snake: ప్రపంచంలోనే అత్యంత తెలివైన పాము ఇదే..! లేకపోతే నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారా..? అంటూ యువకుడి స్టంట్‌ వైరల్‌..
King Cobra
Jyothi Gadda
|

Updated on: Feb 18, 2024 | 12:04 PM

Share

సోషల్ మీడియా రకరకాల అద్భుతమైన విషయాలతో నిండిపోయింది. ఇంటర్నెట్‌లో మనం చూసే చాలా వైరల్‌ వీడియోలు మనల్ని షాక్‌ అయ్యేలా చేస్తాయి. కొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. మరికొన్ని షాకింగ్‌గా ఉంటాయి. సాధారణంగా జంతువుల వీడియోలను చూసి ఆనందించడానికి ఇంటర్నెట్‌లో అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు, వైరల్ అవుతున్న ఈ వీడియోలో మనల్ని ఆశ్చర్యపరిచేది పాము కాదు..ఆ భారీ పొడవైన పామును చేతిలో పట్టుకుని ఆడిస్తున్న ఓ యువకుడిధైర్యం. వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువకుడు నిర్భయంగా భారీ పామును చేతిలో పట్టుకుని దాని గురించి ఉపన్యాసం ఇస్తున్నాడు..! ఏం చెబుతున్నాడో తెలుసా..?

ఓ యువకుడు నిర్భయంగా పామును పట్టుకుని ఉపన్యాసం ఇస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నాగుపాముపై ప్రజలు దాడి చేయడం దిగ్భ్రాంతిని కలిగిస్తోందని చెబుతున్న ఆ యువకుడు..ప్రపంచంలోనే అత్యంత తెలివైన జీవి పాము అని చెబుతున్నాడు.

ఇవి కూడా చదవండి

పామును చూడగానే చాలా మంది భయంతో వణికిపోతుంటారు. కానీ, ఈయనకు మాత్రం కాదు..ఎందుకంటే వీడియోలో కనిపించే యువకుడు భయంకరమైన పామును ఒట్టి చేతులతో నిర్భయంగా పట్టుకున్నాడు. అందుకే ఈ వీడియో లక్షలాది మంది ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈ వారం వైరల్ వీడియోలలో ఇదే అగ్రస్థానంలో నిలిచింది.

జంతువులు, పాముల వీడియోలతో ఫేమస్ అయిన నిక్ ది రాంగ్లర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో 4 మిలియన్లకు పైగా వీక్షణలను సంపాదించింది. పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయిన ఈ వీడియోను చూసి చాలా మంది భయాందోళనలకు గురవుతున్నారు. స్నేక్ వీడియో చూసి చాలా మంది నివ్వెరపోతే, కొందరు యువకుడి ధైర్యాన్ని ప్రశంసించారు. ఈ అసాధారణ దృశ్యాన్ని మెచ్చుకునే వారు కూడా “ఇది భయంకరంగా ఉంది” అని వ్యాఖ్యానించారు.

ఇలాంటి పిచ్చి విన్యాసాలు ఇంకోసారి చేయకండి అంటూ మరికొందరు అంటున్నారు. ఈ వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో