ప్రపంచంలోనే అత్యంత సంతోషంగా ఉన్న దేశం ఏదో తెలుసా..? ఆ ఆనందానికి రహస్యం ఏంటంటే..
ఇక్కడి ప్రభుత్వ ఆరోగ్య సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ప్రజా రవాణా చాలా నమ్మదగినది, చౌకైనది. ఎక్కువ సంపాదించేవారు తక్కువ సంపాదించేవారు అనే తేడా లేదు. ప్రజలకు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంది. అవినీతి తక్కువ. ఇవన్నీ ఇక్కడి ప్రజల ముఖాల్లో, జీవితాల్లో ఆనందాన్ని పెంచుతున్నాయి. మనం కూడా ఇలాంటి దేశంలో ఉంటే ఎంత బావుంటుందో కదా.?
ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రకరకాల సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను వేధిస్తున్నాయి. ఈ సమస్యలు ప్రజల ముఖాల్లో చిరునవ్వును దూరం చేస్తున్నాయి. అయితే గత 6 సంవత్సరాలుగా ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా ఒకే ఒక్క దేశం ఉంది. అక్కడ ఎవరూ విచారంగా కనిపించరు. అక్కడ అందరూ ఎల్లప్పుడూ చాలా సంతోషంగా ఉంటారు. వారి ఆనంద రహస్యాన్ని నిపుణులు వెల్లడించారు. దానిని పాటిస్తే మన దేశం కూడా తప్పకుండా సంతోషంగా ఉంటుంది. నిపుణులు చెప్పిన ఆ ఫార్ములా ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం,..ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం ఫిన్లాండ్. ఫిన్లాండ్ ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ఎలా అవతరించింది ? ఫిన్నిష్ మనస్తత్వవేత్త ఫ్రాంక్ మార్టెలా ఇక్కడ ప్రజల సంతోషానికి కారణం ఏంటో వివరించారు. ఫిన్లాండ్ సంతోషకరమైన దేశంగా ఉండటానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. వీటిని ప్రజలు తమ దైనందిన జీవితంలో ఖచ్చితంగా అనుసరిస్తారు. ఏ దేశ ప్రజలైనా ఈ నిబంధనలను పాటించడం ప్రారంభిస్తే, సంతోషంగా ఉండటానికి ఎక్కువ సమయం పట్టదు. అలాగే ఐకమత్యంతో ఈ ప్రతిజ్ఞ చేస్తే చెడు పరిస్థితులపై పోరాడే శక్తి సంతరిస్తుంది.
మొదటి నియమం..
సమాజం కోసం జీవించాలనే భావన. “ఫిన్లాండ్‌లోని ప్రజలు తమ చుట్టూ ఉన్న వారి పట్ల శ్రద్ధ వహిస్తారు” అని నిపుణులు అంటున్నారు. వారి ముఖాల్లో సంతోషాన్ని చూడడానికి, తమ వంతు సహాయం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. మీరు ఎవరికైనా విపత్కర పరిస్థితుల్లో సహాయం చేస్తే, వారు మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు. మీరు మీ కుటుంబం, స్నేహితులు, పొరుగువారితో ఎంత ఎక్కువ సమయం గడుపుతున్నారో, మీ జీవితం అంత సంతోషంగా ఉంటుందని ఫిన్లాండ్‌లోని అనేక అధ్యయనాలు ధృవీకరించాయి. ఎందుకంటే మీరు మీ సమస్యలను వారితో పంచుకోవచ్చు. మీరు వారి ఆనందాన్ని పంచుకోవచ్చు. అది మీ ముఖంలో చిరునవ్వు, ఆనందాన్ని నింపుతుంది. ఆందోళన, నిరాశను దూరం చేస్తుంది. ఇక్కడి ప్రజలు తమకు సంతోషాన్ని కలిగించే విషయాలను ఒక లిస్ట్‌గా తయారు చేసుకుంటారు. ఇక్కడి వారంతా అదే పని చేయాలనుకుంటున్నారు. అనేక ఏళ్లుగా ఇక్కడ ఈ పాత పద్ధతి కొనసాగుతూ వస్తోంది. ఇతరులకు మంచి చేయడమే ఇక్కడి వారి ప్రధమ ప్రాధాన్యత.
రెండవ నియమం..
ఇక్కడి ప్రభుత్వ సంస్థలు కూడా ఎల్లప్పుడూ ప్రజలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాయి. అక్కడి ప్రజలను ప్రభుత్వం ఎప్పుడూ సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తుంది. ప్రతి క్షణం ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తుంది.
మూడవ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ దేశం ఎలా నడుస్తుంది అనేది మీ ఆనందంపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. దేశంలో గందరగోళం ఉంటే, మీ ముఖంలో నిరాశ కనిపిస్తుంది. అరాచకం సామాజికమైనా, రాజకీయమైనా లేదా ఆర్థికమైనా పరిస్థితులు ప్రజలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి దేశంలో శాంతి నెలకొనాలి. ఇది ఆనందానికి ప్రధాన పునాది.
ఫిన్లాండ్‌లో ప్రభుత్వ ఆరోగ్య సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ప్రజా రవాణా చాలా నమ్మదగినది, చౌకైనది. ఎక్కువ సంపాదించేవారు తక్కువ సంపాదించేవారు అనే తేడా లేదు. ప్రజలకు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంది. అవినీతి తక్కువ. ఇవన్నీ ఇక్కడి ప్రజల ముఖాల్లో, జీవితాల్లో ఆనందాన్ని పెంచుతున్నాయి. మనం కూడా ఇలాంటి దేశంలో ఉంటే ఎంత బావుంటుందో కదా.?
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..