AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: రాత్రుళ్లు జర భద్రం..! అర్థరాత్రి ఇంటిచుట్టూ చక్కర్లు కొడుతున్న బ్లాక్ పాంథర్.. సీసీకెమెరాలో రికార్డైన భయానక దృశ్యం..

అర్థరాత్రుళ్లు మీ ఇంటిముందు నల్లటి ఆకారంతో మెరిసే కళ్లతో ఏదైనా వింత జీవి కనిపించిందనుకోండీ.. అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేం కదా..? కానీ, ఒకరి ఇంటి ముందు అమర్చిన సీసీ కెమెరాలో అలాంటిదే భయానక దృశ్యం కనిపించింది. వైరల్‌ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇందులో కనిపించిన భయంకర సంఘటన ప్రతి ఒక్కరికీ ఒళ్లు జలదరింపజేసేలా ఉంది..ఈ ఘటన..

Watch Video: రాత్రుళ్లు జర భద్రం..! అర్థరాత్రి ఇంటిచుట్టూ చక్కర్లు కొడుతున్న బ్లాక్ పాంథర్.. సీసీకెమెరాలో రికార్డైన భయానక దృశ్యం..
Rare Black Panther
Jyothi Gadda
|

Updated on: Feb 18, 2024 | 9:26 AM

Share

రాత్రి పూట ఇంట్లో నుంచి బయటకు వచ్చేముందు కాస్త జాగ్రత్తగా ఉండండి.. ఎందుకంటే..సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఒక వీడియో చూస్తే ఇది నిజమే అంటారు.. అర్థరాత్రుళ్లు మీ ఇంటిముందు నల్లటి ఆకారంతో మెరిసే కళ్లతో ఏదైనా వింత జీవి కనిపించిందనుకోండీ.. అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేం కదా..? కానీ, ఒకరి ఇంటి ముందు అమర్చిన సీసీ కెమెరాలో అలాంటిదే భయానక దృశ్యం కనిపించింది. వైరల్‌ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇందులో కనిపించిన భయంకర సంఘటన ప్రతి ఒక్కరికీ ఒళ్లు జలదరింపజేసేలా ఉంది..ఈ ఘటన తమిళనాడు, నీలగిరిలో జరిగినట్టుగా తెలిసింది. నీలగిరిలోని ఒక ఇంటి బయట బ్లాక్ పాంథర్ తిరుగుతున్న వీడియో నెటిజన్లను ఎంతగానో భయపెడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కేరళలో వన్యప్రాణుల దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో తమిళనాడులో నల్లపులి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నీలగిరి జిల్లా కూనూరులో నల్లపులి కనిపించి హల్‌చల్‌ చేసింది. రాత్రి పూట పెరట్లో నల్లపులి సంచరిస్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. ఐఎఫ్ఎస్ అధికారి పర్వీర్ కస్వాన్ సోషల్ మీడియా ఎక్స్‌లో ఇందుకు సంబంధించిన వీడియోను షేర్‌ చేశారు. గతేడాది ఆగస్టులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

35 సెకన్ల నిడివిగల వీడియోలో ఒకరి ఇంటి ముందు నుంచి బ్లాక్‌ పాంథర్‌ వెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంటి బయట అమర్చిన సీసీటీవీలో నల్లపులి కదలికలు రికార్డయ్యాయి.

సాధారణంగా అడవిని వదిలిలో కనిపించే జంతువులలో నల్లపులి కూడా ఒకటి. వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్‌లకు ఇలాంటి జీవుల ఫోటో తీయడం కూడా చాలా కష్టం. ఇలాంటి అరుదైన జంతువుల విజువల్స్ సంపాదించేందుకు చాలా మంది ఫోటోగ్రాఫర్లు రోజుల తరబడి అడవిలో ఎదురు చూస్తూ ఉంటారు.. ఈ క్రమంలోనే కూనూరులో ఓ ఇంటి ముందు అమర్చిన సీసీ టీవీ కెమెరాలో నల్లపులి ప్రత్యక్షమైంది. అయితే వైరల్‌ అవుతున్న ఈ వీడియో కూనూరుకు చెందినదేనా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..