Viral Video: ఆన్‌లైన్‌లో ఆరెంజ్ ఆర్డర్ చేశాడు.. తొక్క తీసి చూసి షాక్ తిన్నాడు.

ఓ వ్యక్తి కిరాణా డెలివరీ యాప్ Zepto నుంచి ఆన్‌లైన్‌లో కమలాఫలాలను ఆర్డర్ పెట్టాడు. తనకు వచ్చిన కమలాఫలం తినడం కోసం తొక్కలను తీసి చూసి ఆ వ్యక్తి షాక్ తిన్నాడు. ఎందుకంటే ఆ కమల ఫలం తొణలో బతికి ఉన్న పురుగుని చూశాడు. ఇది చూసి షాక్ తిన్న జనార్దన్ చిల్ముల అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో షేర్ చేశాడు. అందులో కమలా ఫలం లోపల చిన్న తెల్లని రంగు పురుగు కదులుతున్నది చూడవచ్చు. సాధారణంగా ఆహారం, కిరాణా కంపెనీలు తమ ఉత్పత్తులే అత్యుత్తమమైనవని, వాటిలో లోపాలు లేదా కల్తీలు ఉండవని చెప్పుకుంటాయి..

Viral Video: ఆన్‌లైన్‌లో ఆరెంజ్ ఆర్డర్ చేశాడు.. తొక్క తీసి చూసి షాక్ తిన్నాడు.
Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Feb 17, 2024 | 9:14 PM

సోషల్ మీడియా, వివిధ రకాల షాపింగ్ యాప్స్ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంటి వద్దకే వస్తువులు వచ్చేస్తున్నాయి. దీంతో ఏమైనా వస్తువులు కొనుగోలు చేయాలంటే ఇప్పుడు మార్కెట్‌కు వెళ్లాల్సిన పని లేదు. వాస్తవానికి కూరగాయలు కొనాలన్నా, పండ్లు కొనాలన్నా మార్కెట్‌కి వెళ్ళాలి. అయితే ఇప్పుడు ఈ పని చాలా తేలికైంది. ఇప్పుడు ప్రజలు ఇంట్లో కూర్చొని ప్రతిదీ తెప్పించుకుంటున్నారు. రకరకాల యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి.. ఇంటి వద్దకే వస్తువులను తెప్పించుకున్నాడు. ఆన్‌లైన్‌లో కూరగాయలు,  పండ్లను ఆర్డర్ చేస్తున్నారు. అయితే ఈ ఆన్‌లైన్ వ్యవహారం ఒక్కోసారి ప్రజలకు తలనొప్పులను తెస్తుంది. ఒకొక్కసారి తాము పెట్టిన వస్తువుల్లో రకరకాల పురుగులు, ఇనుప వస్తువులు వంటివి కనిపిస్తున్నాయి.

వాస్తవానికి ఓ వ్యక్తి కిరాణా డెలివరీ యాప్ Zepto నుంచి ఆన్‌లైన్‌లో కమలాఫలాలను ఆర్డర్ పెట్టాడు. తనకు వచ్చిన కమలాఫలం తినడం కోసం తొక్కలను తీసి చూసి ఆ వ్యక్తి షాక్ తిన్నాడు. ఎందుకంటే ఆ కమల ఫలం తొణలో బతికి ఉన్న పురుగుని చూశాడు. ఇది చూసి షాక్ తిన్న జనార్దన్ చిల్ముల అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో షేర్ చేశాడు. అందులో కమలా ఫలం లోపల చిన్న తెల్లని రంగు పురుగు కదులుతున్నది చూడవచ్చు. సాధారణంగా ఆహారం, కిరాణా కంపెనీలు తమ ఉత్పత్తులే అత్యుత్తమమైనవని, వాటిలో లోపాలు లేదా కల్తీలు ఉండవని చెప్పుకుంటాయి.. అయితే ఆ ఉత్పత్తులు ప్రజలకు చేరినప్పుడే వాటి అసలు గుణం బయటపడుతుంది.

ఇవి కూడా చదవండి

వైరల్ పోస్ట్ చూడండి

@JanardhanChill అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో వీడియో షేర్ చేశాడు. ఈ వీడియోకు  వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఒకరు ‘పండు పాడైన స్థితిలో ఉంటే కంపెనీని నిందించవచ్చు. అయితే పండు తొక్కని చూస్తుంటే.. అది ఫ్రెష్ గా కనిపిస్తుంది. కనుక పండులో కంపెనీ లోపల పురుగు ఉందా లేదా అని ఎలా నిర్ధారించగలదని కామెంట్ చేశారు. కొన్నిసార్లు తాజా పండ్లలో కూడా పురుగులు ఉంటాయి.  మార్కెట్ నుంచి కొంటే ఏమి చేసేవారు అని ప్రశ్నించారు.

అదే సమయంలో మరొకరు ‘ఆన్‌లైన్‌లో ఏదైనా కొనుగోలు చేయకపోవడమే మంచిది. ముఖ్యంగా పండ్లు, కూరగాయల విషయంలో చాలాసార్లు ఎదుర్కొన్నాను. ఒకరు డెలివరీకి ముందు 2 దశల్లో పరీక్షలు చేయిస్తామని చెప్పారు. అంతేకాదు స్థానిక మార్కెట్‌తో పోలిస్తే వీటి అధిక ధర గురించి కూడా అతను చెప్పాడు. ఇక నుంచి ఆన్‌లైన్‌లో ఆపివేసి, ఆఫ్‌లైన్‌కి వెళ్లండి. అయితే  ఈ సంఘటన తర్వాత కంపెనీ వ్యక్తికి క్షమాపణ చెప్పింది. అంతేకాదు పండ్లు వాపసు ఇవ్వాలని కూడా పేర్కొంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..