Viral News: బాస్ చెప్పిన దానికంటే అతిగా పని చేస్తోన్న యువతి.. కట్ చేస్తే.. చివర్లో దిమ్మతిరిగింది..!

నిజాయితీగా.. మనసు పెట్టి పనిచేసే వారికి ప్రతిచోటా గౌరవం లభిస్తుంది. ఎవరైనా తమ పనిలో మంచి పనితనం చూపిస్తే.. వారికీ ప్రమోషన్లు వస్తూనే ఉంటాయి. అయితే అలా పని చేస్తున్న ఒక ఉద్యోగిని కంపెనీ తొలగిస్తే.. అవును ఒక మహిళ ఉద్యోగ విషయంలో ఇలాంటిదే జరిగింది. ఆమె తన కథను సోషల్ మీడియాలో వివరించింది. తాను పనిలో బాగా రాణిస్తున్నందున తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆ మహిళ పేర్కొంది

Viral News: బాస్ చెప్పిన దానికంటే అతిగా పని చేస్తోన్న యువతి.. కట్ చేస్తే.. చివర్లో దిమ్మతిరిగింది..!
Viral NewsImage Credit source: ljubaphoto/Getty Images
Follow us
Surya Kala

|

Updated on: Feb 17, 2024 | 7:59 PM

ఒక కంపెనీలో పని చేస్తే మంచిగా కష్టపడి పని చేసేవారికి.. లాభాలన తెచ్చి పెట్టేవారికి ఆ కంపెనీ ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో ఎవరికైనా తెలుసు. అంతేకాదు అటువంటి ఉద్యోగస్తులను కంపెనీ వదులుకోవడానికి ఇష్టపడదు. దీంతో వారి ఉద్యోగం భద్రత కలిగి ఉంటారు. నిజాయితీగా.. మనసు పెట్టి పనిచేసే వారికి ప్రతిచోటా గౌరవం లభిస్తుంది. ఎవరైనా తమ పనిలో మంచి పనితనం చూపిస్తే.. వారికీ ప్రమోషన్లు వస్తూనే ఉంటాయి. అయితే అలా పని చేస్తున్న ఒక ఉద్యోగిని కంపెనీ తొలగిస్తే.. అవును ఒక మహిళ ఉద్యోగ విషయంలో ఇలాంటిదే జరిగింది. ఆమె తన కథను సోషల్ మీడియాలో వివరించింది.

తాను పనిలో బాగా రాణిస్తున్నందున తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆ మహిళ పేర్కొంది. ఆ మహిళ ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసింది.. అందులో ‘నేను నిన్న నా ఉద్యోగం నుండి తొలగించబడ్డాను.. దీనికి కారణం తాను చాలా సమర్థవంతంగా పనిచేయడమే.. మా బాస్ ఉదయం మీటింగ్‌లో మా రాబోయే ఈవెంట్‌ల గురించి మాట్లాడటానికి సేల్స్ డైరెక్టర్‌తో సమావేశాన్ని షెడ్యూల్ చేయనున్నామని తనకు చెప్పారని పేర్కొంది.

ఏప్రిల్ వరకు మాత్రమే పని

ఆ మీటింగ్‌లో అదే ప్రాజెక్ట్‌కి సంబంధించిన చర్చలు జరగనున్నాయి. ఈ పని ఆ మహిళా ఉద్యోగికి  అప్పగించబడింది. ఈ ప్రాజెక్ట్ ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి.. అయితే మహిళ ఆ పనిని ముందుగానే పూర్తి చేసింది. ప్రాజెక్ట్‌కి సంబంధించిన డేటా మొత్తం సాఫ్ట్‌వేర్‌లో సేవ్ చేసింది. ఇప్పుడు ఆ మహిళ తన పనిని ఇంత త్వరగా ముగించడం తన యజమానికి నచ్చలేదు. అందుకే తనను ఉద్యోగం నుండి తొలగించారని పేర్కొంది. బహుశా తన పని తనం తన బాస్ కు ముప్పుగా మారుతుందని భావించడం ప్రారంభించి ఉంటాడని ఆమె చెప్పింది. దీనితో పాటు తన బాస్ తరచుగా కంపెనీకి రాకుండా గైర్హాజరవుతున్నాడని, అందువల్ల అతను చేయాల్సిన పనిని కూడా తానే చేయవలసి వచ్చిందని ఆమె ఆరోపించింది.

ఇవి కూడా చదవండి

మహిళకు రకరకాల సలహాలు ఇచ్చిన నెటిజన్లు

మహిళ పోస్ట్ చూసిన తర్వాత సోషల్ మీడియా వినియోగదారులు కూడా వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. ఆమె ఎక్కువగా మాట్లాడిందని, అందుకే ఆమెను తొలగించారని ఎవరో చెప్పారు. ఆమె తదుపరి ఉద్యోగాన్ని కూడా కష్టపడి పనిచేయాలని సూచించారు. అంతేకాదు కాదు  బాస్ ప్రతిదీ బాగా నిర్వహిస్తున్నట్లు నటించండి.. అప్పుడే ఉద్యోగం సురక్షితంగా ఉంటుందని మరొకరు కామెంట్ చేశారు

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..