Jnanpith Award: 2023 ఏడాదికిగాను సాహితీవేత్తలు గుల్జార్, జగద్గురు రామభద్రాచార్యకు జ్ఞానపీఠ్ అవార్డు

అద్భుతమైన సాహిత్యంతో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన గేయ రచయిత గుల్జార్‌కు ఉర్దూ భాషకు చేసిన సాటిలేని కృషికి గాను జ్ఞానపీఠ్ అవార్డును ప్రకటించారు. అంతేకాదు సంస్కృత భాషకు చేసిన కృషికి గాను జగద్గురు రామభద్రాచార్య ను అత్యున్నత సాహిత్య పురస్కారానికి ఎంపిక చేశారు. రామభద్రాచార్య చిత్రకూట్‌లోని తులసి పీఠం వ్యవస్థాపకులు, అధిపతి. ప్రపంచ ప్రఖ్యాత హిందూ ఆధ్యాత్మిక గురువు, ఉపాధ్యాయులు అంతేకాదు 100 కంటే ఎక్కువ పుస్తకాలను రచించారు. 

Jnanpith Award: 2023 ఏడాదికిగాను సాహితీవేత్తలు గుల్జార్, జగద్గురు రామభద్రాచార్యకు జ్ఞానపీఠ్ అవార్డు
Jnanpith Award 2023
Follow us
Surya Kala

|

Updated on: Feb 17, 2024 | 5:46 PM

భారతదేశపు సాహితీ పురస్కారాల్లో జ్ఞానపీఠ పురస్కారం అత్యున్నతమైంది. తాజాగా జ్ఞానపీఠ్ అవార్డు 2023కి సంబంధించిన వ్యక్తుల పేర్లను ఎంపిక ప్యానెల్ ప్రకటించింది. 58వ జ్ఞానపీఠ అవార్డుకు ప్రముఖ సినీ నిర్మాత, గీత రచయిత, ఉర్దూ కవి గుల్జార్‌తో పాటు సంస్కృత భాషా పండితుడు జగద్గురు రాంభద్రాచార్య ఎంపికయ్యారు. గుల్జార్, జగద్గురు రాంభద్రాచార్య ఎంపికైనట్లు అవార్డుకు సంబంధించిన ఎంపిక ప్యానెల్ తెలిపింది. గుల్జార్ ఇప్పటికే సాహిత్య అకాడమీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు అందుకున్నారు.  రామభద్రాచార్యను పద్మవిభూషణ్‌తో సత్కరించారు.

జ్ఞానపీఠ్‌ అవార్డును అందుకోనున్న గుల్జార్‌, జగద్గురు రాంభద్రాచార్య

అద్భుతమైన సాహిత్యంతో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన గేయ రచయిత గుల్జార్‌కు ఉర్దూ భాషకు చేసిన సాటిలేని కృషికి గాను జ్ఞానపీఠ్ అవార్డును ప్రకటించారు. అంతేకాదు సంస్కృత భాషకు చేసిన కృషికి గాను జగద్గురు రామభద్రాచార్య ను అత్యున్నత సాహిత్య పురస్కారానికి ఎంపిక చేశారు. రామభద్రాచార్య చిత్రకూట్‌లోని తులసి పీఠం వ్యవస్థాపకులు, అధిపతి. ప్రపంచ ప్రఖ్యాత హిందూ ఆధ్యాత్మిక గురువు, ఉపాధ్యాయులు అంతేకాదు 100 కంటే ఎక్కువ పుస్తకాలను రచించారు.

ప్రత్యేక సాహిత్యంతో సినిమాల్లో గుర్తింపు

గుల్జార్ ప్రముఖ భారతీయ కవి, గీత రచయిత, చలనచిత్ర దర్శకుడు. అంతేకాదు ఆధునిక కాలంలోని అద్భుతమైన ఉర్దూ కవుల్లో కూడా పేరు పొందారు. ఇంతకుముందు గుల్జార్ ఉర్దూ భాషలో చేసిన కృషికి గాను 2002లో సాహిత్య అకాడమీ అవార్డు, 2013లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2004లో పద్మభూషణ్ సహా కనీసం 5 జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్నారు. గుల్జార్ ప్రసిద్ధ రచనలు చాంద్ పుఖ్‌రాజ్ కా, రాత్ పష్మినే కి , పంచ్ పాంచ్ పచత్తర్.

ఇవి కూడా చదవండి

గుల్జార్ అసలు పేరు సంపూర్ణ సింగ్ కల్రా. అతను అవిభక్త  భారతదేశంలోని జీలం జిల్లాలోని దేనా గ్రామంలో 1934 ఆగస్టు 18న జన్మించారు. తండ్రి పేరు మఖన్ సింగ్. చిరు వ్యాపారి. తల్లి మరణానంతరం ఎక్కువ సమయం తండ్రితోనే జీవించాడు. అయితే చదువుపై పెద్దగా ఆసక్తి లేకపోవడంతో 12వ తరగతి పరీక్షలో కూడా ఫెయిల్ అయ్యాడు. అయితే సాహిత్యం పట్ల ఆసక్తి మాత్రం ఎక్కువగా ఉంది. రవీంద్రనాథ్ ఠాగూర్,  శరత్ చంద్ అతని అభిమాన సాహితీవేత్తలు.

22 భాషల్లో పరిజ్ఞానం, 100 కంటే ఎక్కువ పుస్తకాలు

అయోధ్యలో రామయ్య జన్మించాడు అని ప్రధాన సాక్ష్యం చెప్పిన జగద్గురు రామభద్రాచార్యులు  పుట్టిన 2 నెలలకే కంటి చూపు కోల్పోయారు. అద్భుతమైన ఉపాధ్యాయుడు. సంస్కృత భాషా పండితుడు. జగద్గురు రామభద్రాచార్యులు అనేక భాషలలో జ్ఞాని, 100 కి పైగా పుస్తకాలు రచించారు. ఆయనకు 22 భాషల్లో పరిజ్ఞానం ఉంది. జగద్గురు రామభద్రాచార్య కూడా పద్మవిభూషణ్‌తో సత్కరించారు. జగద్గురు రామభద్రాచార్యను భారత ప్రభుత్వం 2015లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది.

రామభద్రాచార్యుల ప్రసిద్ధ రచనలలో శ్రీ భార్గవరాఘవీయం, అష్టావక్ర, ఆజాద్‌చంద్రశేఖరచరితం, లఘురఘువరం, సరయులహరి, భృంగదూతం, కుబ్జపత్రం వంటి అనేక పుస్తకాలున్నాయి

జ్ఞానపీఠ్ ఎంపిక కమిటీ విడుదల చేసిన ఒక ప్రకటనలో “ఈ అవార్డును (2023 కోసం) రెండు భాషల ప్రముఖ రచయితలైన సంస్కృత సాహిత్యవేత్త జగద్గురు రాంభద్రాచార్య, ప్రసిద్ధ ఉర్దూ సాహిత్యవేత్త గుల్జార్‌లకు ఇవ్వాలని నిర్ణయించారు. చివరిసారిగా 2022 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ్ అవార్డు గోవా రచయిత దామోదర్ మావ్జోకు లభించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..