Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Health Tips: వేసవి వచ్చేసింది..హైబీపీ నియంత్రణ కోసం రోజు ఈ నీరుని ఒక గ్లాసు తాగండి..

ఇటీవల జీవనశైలి, ఆహారంలో మార్పుల కారణంగా అధిక రక్తపోటు (బీపీ)తో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. యువత కూడా బీపీతో బాధపడుతున్నారు. అయితే బీపీ బాధితులు తమ జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఈ సమస్య నుంచి తేలికగా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బీపీ ఉన్నవారు డీహైడ్రేషన్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటికే వేసవి తాపం మొదలైంది. దీంతో శరీరంలో తగినంత నీరు ఉండేలా జాగ్రత్త వహించాలని సూచించారు.

Summer Health Tips: వేసవి వచ్చేసింది..హైబీపీ నియంత్రణ కోసం రోజు ఈ నీరుని ఒక గ్లాసు తాగండి..
Coconut Water
Follow us
Surya Kala

|

Updated on: Feb 17, 2024 | 4:47 PM

వేసవి కాలం వచ్చేసింది. శరీరం హైడ్రేట్ గా ఉంచుకోవడానికి ఎక్కువ నీరు తాగాల్సి ఉంటుంది. అంతేకాదు సహజ పానీయాలైన కొబ్బరి నీరు, షుగర్ కెన్ జ్యుస్ వంటి వాటిని తాగడం వలన  ఆరోగ్యానికి మేలు అని నిపుణులు చెబుతారు. అయితే కొబ్బరి నీరు వేసవి దాహార్తిని తీర్చడం మాత్రమే కాదు బీపీ నియంత్రణకు కొబ్బరి నీళ్లను ఉపయోగించవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో అధిక రక్తపోటుతో బాధపడే వారికి ఈ నీరు దివ్య ఔషధం. ఇటీవల జీవనశైలి, ఆహారంలో మార్పుల కారణంగా అధిక రక్తపోటు (బీపీ)తో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. యువత కూడా బీపీతో బాధపడుతున్నారు. అయితే బీపీ బాధితులు తమ జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఈ సమస్య నుంచి తేలికగా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా బీపీ ఉన్నవారు డీహైడ్రేషన్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటికే వేసవి తాపం మొదలైంది. దీంతో శరీరంలో తగినంత నీరు ఉండేలా జాగ్రత్త వహించాలని సూచించారు. బీపీ బాధితులకు కొబ్బరి నీళ్లను దివ్య ఔషధం అంటారు. వీటిలో చాలా సహజమైన లక్షణాలు శరీరానికి మేలు చేస్తాయి. బీపీ నియంత్రణలో ఉపయోగపడుతుంది. బీపీ బాధితులు కొబ్బరినీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి  ఈ రోజు తెలుసుకుందాం.

* కొబ్బరి నీళ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. సాధారణంగా మనం తినే ఆహారం నుండి పొటాషియం లభిస్తుంది. వేసవిలో వీలైనంత ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగాలి. ఎందుకంటే పొటాషియం మూత్రం నుండి సోడియం, ఐరన్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారు కొబ్బరినీళ్లు తాగితే బీపీని అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

* సాధారణంగా అధిక రక్తపోటు ఉన్న రోగులలో సోడియం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో అధికంగా సోడియం గుండెపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల అధిక రక్తపోటు సమస్య వస్తుంది. అలాంటప్పుడు అధిక రక్తపోటు ఉన్నవారు కొబ్బరినీళ్లు తాగితే వారి శరీరంలోని అదనపు సోడియం తొలగిపోతుంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మీ సోడియం స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.

* కొబ్బరి నీరు రక్తనాళాలను శుభ్రపరచి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది రంధ్రాలను శుభ్రపరచడానికి ఉపయోగపడుతుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగుదలను నివారిస్తుంది.

* హై బీపీ ఉన్నవారు రోజూ ఒక గ్లాసు కొబ్బరినీళ్లు తాగాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లను తీసుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.