Toilet: టాయ్‌లెట్ వాడేటప్పుడు ఆ తప్పు అస్సలు చేయకండి.. అలా చేస్తే వ్యాధులకు వెల్కమ్ చెప్పినట్లే..!
మన రోజువారీ అలవాట్లు మనల్ని అనారోగ్యాలకు గురి చేస్తాయనే విషయం చాలామందికి తెలియడం లేదు. 1950ల నుండి ప్రపంచవ్యాప్తంగా చాలామంది టాయిలెట్‌ను ఫ్లష్ చేయడం వల్ల టాయిలెట్ వాటర్‌లో ప్రాణాంతక క్రిములు వ్యాప్తి చెందుతాయని తెలుసుకోవడం లేదు. అయినప్పటికీ మనలో చాలామంది ఫ్లష్ చేయడానికి ముందు మూత మూసివేయడం మర్చిపోతుంటారు.
మన రోజువారీ అలవాట్లు మనల్ని అనారోగ్యాలకు గురి చేస్తాయనే విషయం చాలామందికి తెలియడం లేదు. 1950ల నుండి ప్రపంచవ్యాప్తంగా చాలామంది టాయిలెట్‌ను ఫ్లష్ చేయడం వల్ల టాయిలెట్ వాటర్‌లో ప్రాణాంతక క్రిములు వ్యాప్తి చెందుతాయని తెలుసుకోవడం లేదు. అయినప్పటికీ మనలో చాలామంది ఫ్లష్ చేయడానికి ముందు మూత మూసివేయడం మర్చిపోతుంటారు. అయితే దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయట.
కొలరాడో విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ విషయం గురించి మాట్లాడారు. ”మేము టాయిలెట్ వాడిన తర్వాత ఫ్లష్ చేస్తే ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయోగం చేసారు. టాయిలెట్ ప్లూమ్స్ ఎనిమిది సెకన్లలో 4.9 అడుగుల ఎత్తులో వ్యాప్తి చెందుతాయని గుర్తించాం. అయితే అవి కంటితో కనిపించవు. ఈ ‘టాయిలెట్ ప్లూమ్స్’ చాలా చిన్న క్రీములుగా ఉంటాయి. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే బాత్రూమ్ చుట్టూ బ్యాక్టీరియా, వైరస్ వ్యాప్తి చెందేలా చేస్తుందట. అంతేకాదు.. బాత్రూంలో ఉండే ఇతర వస్తులువుల బ్రష్, టూత్ పెస్ట్, సబ్బులపై ఆ క్రీములు పడుతాయట. అంతేకాదు.. మనుషులకు కూడా సోకుతుంది. అందుకే టాయిలెట్ ను వాడిన తర్వాత ఫ్లష్ చేయడానికి ముందు మూత మూసివేవేయాలి” అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
శాస్త్రవేత్తల ప్రకారం.. ఫ్లషింగ్ తర్వాత చిన్న బిందువుల టాయిలెట్ ప్లూమ్స్ గాలి ద్వారా బాత్రూమ్ అంతటా వ్యాప్తిస్తాయి. దీనిని నివారించడానికి, మూత మూసివేసి టాయిలెట్‌ను ఫ్లష్ చేయడం మంచిది. ఇది శానిటరీ పరిశుభ్రత, సూక్ష్మక్రిములు, వాసనలు వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో కూడా సహాయపడుతుంది. ఇదిలా ఉంటే, ఫ్లషింగ్ చేసే ముందు మూత మూసేయడం వల్ల నోరోవైరస్ వంటి అనారోగ్యాల రేటు తగ్గుతుందని పరిశోధనలో తేలింది.
పబ్లిక్ టాయిలెట్లలో మూయడానికి మూత లేకపోవడం వల్ల డొమెస్టిక్ టాయిలెట్ కంటే స్థిరంగా ఎక్కువ కలుషితమవుతుంది. ఫలితంగా గాలిలో చిన్న కణాలు ప్రజలను ఇన్ఫ్లుఎంజా, COVID-19 వంటి శ్వాసకోశ వ్యాధులకు గురిచేస్తాయి. సో టాయిలెట్ వాడేటప్పుడు కనీస జాగ్రత్తలు పాటించడం తెలుసుకోండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి