Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mysterious Temple: సాయంత్రం అయితే ఈ ఆలయంలో ప్రవేశం నిషేధం.. వెళ్తే పిచ్చోళ్లు అయిపోతారని విశ్వాసం.. ఎందుకంటే..

కృష్ణుడు నడయాడిన నేల బృందావనంలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. ఈనాటికీ శ్రీకృష్ణుని రూపాన్ని ఇక్కడ బృందావనంలో చూడవచ్చునని చెబుతారు. శ్రీకృష్ణుడుని దర్శించుకోవడానికి భక్తులు ప్రతిరోజూ భారీ సంఖ్యలో బృందావనానికి వస్తుంటారు. శ్రీ కృష్ణుడు రాధా రాణి , గోపికలతో రాసలీలలు ఆడడం కోసం రాత్రిపూట నిధివనానికి వచ్చి అక్కడ నిద్రిస్తాడని ఒక ప్రసిద్ధ నమ్మకం. గుడి తలుపులు మూసి వేసిన తర్వాత లోపలి నుంచి డ్యాన్స్, పాటల శబ్దం కూడా వినిపిస్తుందని ప్రజలు చెబుతారు. 

Mysterious Temple: సాయంత్రం అయితే ఈ ఆలయంలో ప్రవేశం నిషేధం.. వెళ్తే పిచ్చోళ్లు అయిపోతారని విశ్వాసం.. ఎందుకంటే..
Nidhivan Temple
Follow us
Surya Kala

|

Updated on: Feb 17, 2024 | 4:10 PM

బృందావనం రాధాకృష్ణుల ప్రేమ నగరం.. నాటి ద్వాపర కాలం నుంచి నేటి వరకూ బృందావనం కృష్ణ నగరంగా ప్రసిద్ధి చెందింది. రాధా-కృష్ణులకు సంబంధించిన అనేక దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ  భక్తులు పూజల కోసం ప్రతిరోజూ వస్తారు. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా.. శ్రీ కృష్ణుడికి హొలీ రోజున రంగులు అద్దడం కోసం భారీ సంఖ్యలో మధుర, బృందావనాలకు వస్తారు. ఈ బృందావనంలో ఇటువంటి అనేక దేవాలయాలు ఉన్నాయి. వీటి గురించి అనేక ప్రత్యేక నమ్మకాలు ప్రబలంగా ఉన్నాయి. ఈ ఆలయాలలో ఒకటి బృందావనంలోని నిధివన్ ఆలయం. శ్రీ కృష్ణుడు ప్రతి రాత్రి రాధ, గోపికలతో ఇక్కడికి వస్తాడని నమ్మకం. ఇది రాథాకృష్ణులకు సంబంధించిన పవిత్ర స్థలం అని నమ్మకం. సూర్యాస్తమయం తర్వాత నిధివన్‌లోకి ప్రజల ప్రవేశంనిషేధం. ఈ రోజు నిధివన్‌కి సంబంధించిన రహస్యమైన నమ్మకాల గురించి తెలుసుకుందాం.

కృష్ణుడు నడయాడిన నేల బృందావనంలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. ఈనాటికీ శ్రీకృష్ణుని రూపాన్ని ఇక్కడ బృందావనంలో చూడవచ్చునని చెబుతారు. శ్రీకృష్ణుడుని దర్శించుకోవడానికి భక్తులు ప్రతిరోజూ భారీ సంఖ్యలో బృందావనానికి వస్తుంటారు. శ్రీ కృష్ణుడు రాధా రాణి , గోపికలతో రాసలీలలు ఆడడం కోసం రాత్రిపూట నిధివనానికి వచ్చి అక్కడ నిద్రిస్తాడని ఒక ప్రసిద్ధ నమ్మకం. గుడి తలుపులు మూసి వేసిన తర్వాత లోపలి నుంచి డ్యాన్స్, పాటల శబ్దం కూడా వినిపిస్తుందని ప్రజలు చెబుతారు.

రాత్రిపూట నిధివనంలోకి నో ఎంట్రీ

ఇవి కూడా చదవండి

దట్టమైన చెట్లు, మొక్కలతో నిండి బృందావనంలోని నిధివనం ఇతర అడవుల మాదిరిగానే ఉంటుంది. అయితే కృష్ణుడి కారణంగా ఈ ప్రదేశం ప్రత్యేకంగా, పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇక్కడ చెట్ల మధ్య ఒక చిన్న ప్యాలెస్ ఉంది. దీనిని రంగ్ మహల్ అని పిలుస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి రాత్రి శ్రీ కృష్ణుడు గోపికలతో రాసలీలలు చేయడానికి నిధివనం రంగ మహల్‌కు వస్తాడు. ఈ రాసలీల చూడాలనుకున్న వ్యక్తి మానసిక సమతుల్యత కోల్పోయాడని చెబుతున్నారు. సాయంత్రం పూట నిధివనంలోకి ప్రవేశించడం నిషేధించబడటానికి కారణం ఇదే. అదే సమయంలో కాముడిపున్నమి రాత్రి నిధివన్‌లోకి ప్రవేశం పూర్తిగా మూసివేయబడుతుంది.

నిధివనం సంబంధిత గుర్తింపు

నిధివన్‌లోని రంగ్ మహల్‌లో సూర్యాస్తమయం తర్వాత కన్నయ్య కోసం నీళ్లతో పాటు వెన్న, పంచదార నైవేద్యంగా ఉంచబడుతుంది. అంతేకాదు రాధ కోసం మేకప్ వస్తువులు, పండ్లు కూడా ఉంచబడతాయి.  తెల్లవారుజామున ఆలయ తలుపులు తెరిచినప్పుడు.. ఆ నీటి పాత్ర ఖాళీగా ఉంటుందని.. అక్కడ ఉన్న విగ్రహాలు తడిగా కనిపిస్తాయని ఒక నమ్మకం. కృష్ణుడు ప్రతిరోజూ ఇక్కడికి వచ్చి ఇవన్నీ స్వీకరిస్తాడని స్థానికుల విశ్వాసం.

పగటిపూట తెరిచి ఉండే ఆలయం 

సూర్యుడు అస్తమించిన వెంటనే నిధివనం ఖాళీ చేయబడుతుంది. దీని తలుపులు 7 తాళాలను వేసి మరీ  మూసివేస్తారు. అయితే బృందావనానికి వచ్చే భక్తులు రోజులో ఎప్పుడైనా నిధివనంలోకి ప్రవేశించవచ్చు. ఈ నిధివనంలోని అడవిలో తులసి, మెహందీ, కదంబ చెట్లు ఉన్నాయి. నిధివనంలో ఉన్న తులసి మొక్కలు  రాత్రిపూట గోపికల రూపంలో వస్తాయని చెబుతారు. రంగ్ మహల్ మాత్రమే కాదు రాధాకు చెందిన ప్రసిద్ధ ఆలయం కూడా నిధివనంలో ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు