AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: డబ్బుకోసం ఇబ్బందులు పడుతున్నారా.. ఈ సులభమైన వాస్తు చిట్కాలను పాటించండి చూడండి

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి మెయిన్ డోర్ తో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచండి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఎప్పుడూ చెత్తను ఉంచకూడదు. అంతేకాదు ఇంటి మెట్ల క్రింద లేదా పడకగదిలో పూజ కోసం ఎప్పుడూ గదిని నిర్మించకూడదు. ఆర్థిక లాభం కోసం ఇంటి ప్రధాన ద్వారం ఆగ్నేయంలో వినాయకుడి విగ్రహాన్ని, నెమలి ఈకలను ఉంచండి.

Vastu Tips: డబ్బుకోసం ఇబ్బందులు పడుతున్నారా.. ఈ సులభమైన వాస్తు చిట్కాలను పాటించండి చూడండి
Vastu Tips For Money
Surya Kala
|

Updated on: Feb 15, 2024 | 7:33 PM

Share

వాస్తు మన జీవితాలపై చాలా సానుకూల ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతారు. వాస్తు ప్రకారం ఇంట్లో వస్తువులను సరైన స్థలంలో ఉంచడం ద్వారా, ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఇది ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతేకాదు ఇంట్లో సిరి సంపదలను, సుఖ సంతోషాలను తెస్తుంది. అయితే ప్రతి ఒక్కరూ తమ ఇష్టానుసారం తమ ఇంటిని అలంకరించుకుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ అలంకరణ వస్తువులను ఇంట్లో సరైన స్థలంలో ఉంచినట్లయితే.. అది ఇంటి వాతావరణాన్ని పూర్తిగా మార్చగలదు. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఉంటుంది. మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.

వాస్తు శాస్త్రానికి సంబంధించిన కొన్ని సులభమైన పరిష్కారాలు ఏమిటో తెలుసా..

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి మెయిన్ డోర్ తో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచండి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఎప్పుడూ చెత్తను ఉంచకూడదు. అంతేకాదు ఇంటి మెట్ల క్రింద లేదా పడకగదిలో పూజ కోసం ఎప్పుడూ గదిని నిర్మించకూడదు. ఆర్థిక లాభం కోసం ఇంటి ప్రధాన ద్వారం ఆగ్నేయంలో వినాయకుడి విగ్రహాన్ని, నెమలి ఈకలను ఉంచండి.

ఇవి కూడా చదవండి

మానసిక ప్రశాంతత, శాంతిని ఇచ్చే సంగీతం ఇంట్లో ఆనందం, సంపద, శ్రేయస్సును ఆకర్షిస్తుంది అని నమ్ముతారు. కనుక ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఘటియా లేదా గంటలను అమర్చండి. ఇంటి వాతావరణం స్వచ్ఛంగా, పవిత్రంగా ఉండాలంటే ఇంట్లో రోజూ దీపం లేదా కర్పూరం వెలిగించండి. దీపం లేదా కర్పూరంతో పాటు అగరబత్తిని వెలిగిస్తే, అది ఇంటిపై చాలా సానుకూల ప్రభావం చూపుతుంది. ఇంట్లో ఆనందం, శాంతి వాతావరణం నెలకొంటుంది.

మీరు ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేయడానికి దాల్చిన చెక్కను లేదా బే ఆకులను ఇంట్లో కాల్చవచ్చు. ఇలా చేయడం వలన ప్రతికూల శక్తిని తొలగుతుంది. ఇంట్లో ప్రతిరోజూ శ్లోకం, భజన, మంత్రం లేదా హారతిని పఠించండి లేదా ఇంట్లో శ్లోకం, మంత్రం లేదా భజన ఆడియో ప్లే చేయండి. వినండి. దీంతో మనసుకు ప్రశాంతతతోపాటు ఇల్లు ఆహ్లాదకరంగా ఉంటుంది. విరిగిన పాత్రలను ఎప్పుడూ ఇంట్లో ఉంచవద్దు లేదా వాటిని ఉపయోగించవద్దు.

ఇంట్లో మనం చాలా కాలంగా ఉపయోగించని వస్తువులు చాలా ఉంటాయి. ఇలాంటివి ఇంటి వాతావరణాన్ని పాడు చేస్తాయి. అందుకే ఎక్కువ కాలం ఉపయోగించని వస్తువులన్నింటినీ ఇంట్లో నుండి తొలగించండి. ఇంటి ప్రధాన ద్వారం దక్షిణ దిశలో మాత్రమే ఉండాలి. అలాగే దక్షిణ దిశలో మాత్రమే తెరుచుకునే విధంగా ఏర్పాటు చేసుకోండి.

వాస్తు ప్రకారం ఇంటి మెయిన్ డోర్ కు ఎప్పుడూ నలుపు రంగు వేయకండి. నలుపు రంగుకు బదులుగా.. ముదురు గోధుమ రంగును వేసుకోవచ్చు. వాస్తు ప్రకారం ప్రవహించే జలపాతం లేదా నది వంటి ప్రవహించే నీటి చిత్రాన్ని లేదా పెయింటింగ్‌ను ఇంట్లో ఉంచండి. ఇది ఇంట్లో ఆనందం , శ్రేయస్సును తెస్తుంది, ఆర్థిక లాభం తెస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు