Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాల రామయ్యకు భారీగా భక్తుల కానుకలు.. దేశంలోనే ఏడాదికి వందల కోట్ల విరాళాలు అందుకునే సంపన్న ఆలయాలు..

భారతదేశంలో ప్రఖ్యాత వైష్ణవ దేవాలయాల్లో ఒకటి. భక్తులు సమర్పించే విరాళాల విషయంలో ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయం తిరుపతి. ఈ ఆలయ నిర్మాణశైలి చూడదగ్గది. ఇక్కడ భక్తులు ప్రతి సంవత్సరం నగదు, బంగారం, నగలు ఇలా వివిధ రూపాల్లో సుమారు రూ.600 కోట్ల విలువ జేసే విరాళంగా అందజేస్తారు. విష్ణువు అవతారంగా భావించే వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన కలియుగ వైకుంఠంగా ప్రసిద్ది.

బాల రామయ్యకు భారీగా భక్తుల కానుకలు.. దేశంలోనే ఏడాదికి వందల కోట్ల విరాళాలు అందుకునే సంపన్న ఆలయాలు..
Hindu Temples
Follow us
Surya Kala

|

Updated on: Feb 15, 2024 | 6:38 PM

భారత దేశం ఆధ్యాత్మికతకు నెలవు. అనేక పుణ్యక్షేత్రాలు, స్వయంభు ఆలయాలున్నాయి. పండగలు పర్వదినాల సమయంలో మాత్రమే కాదు.. తరచుగా తీర్ధయాత్రలు చేయడానికి హిందువులు ఆసక్తిని చూపిస్తారు. తమకు ఇష్టమైన ఆరాధ్య దైవాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అయోధ్య బాల రామయ్యకు కూడా భారీగా భక్తులు కానుకలను సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో  అత్యధిక విరాళాలు అందుకునే ఆలయలు గురించి తెలుసుకుందాం..

తిరుమల తిరుపతి దేవస్థానం: ప్రపంచంలోనే ధనిక దేవాలయంగా ఖ్యాతి గాంచిన తిరుపతి తిరుపతి క్షేత్రం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. భారతదేశంలో ప్రఖ్యాత వైష్ణవ దేవాలయాల్లో ఒకటి. భక్తులు సమర్పించే విరాళాల విషయంలో ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయం తిరుపతి. ఈ ఆలయ నిర్మాణశైలి చూడదగ్గది. ఇక్కడ భక్తులు ప్రతి సంవత్సరం నగదు, బంగారం, నగలు ఇలా వివిధ రూపాల్లో సుమారు రూ.600 కోట్ల విలువ జేసే విరాళంగా అందజేస్తారు. విష్ణువు అవతారంగా భావించే వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన కలియుగ వైకుంఠంగా ప్రసిద్ది. ఈ ఆలయం సముద్ర మట్టానికి 2800 అడుగుల ఎత్తులో ఉంది. శ్రీవారిని దర్శించుకోవడానికి రోజుకు 60 వేల మందికి పైగా భక్తులు వస్తారు.

పద్మనాభ స్వామి దేవాలయం: ఇది భారతదేశంలోనే అత్యంత ధనిక దేవాలయం. ఈ ఆలయం కేరళలోని తిరువనంతపురంలో ఉంది. ఈ ఆలయాన్ని ట్రావెన్‌కోర్ రాజకుటుంబం నిర్వహిస్తోంది. కేరళలోని తిరువనంతపురంలో ఉన్న దీని సంపదలో వజ్రాలు, బంగారు ఆభరణాలు, బంగారు శిల్పాలు ఉన్నాయి. ఇక్కడ ఏటా దాదాపు రూ.500 కోట్ల విలువైన కానుకలు వస్తాయి. అంతేకాదు పద్మనాభస్వామీ వారి పేరు మీద 20 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తి ఉందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

షిర్డీ సాయిబాబా దేవాలయం: మహారాష్ట్రలోని షిర్డీలో షిర్డీ సాయిబాబా ఆలయం ఉంది. ఆలయ బ్యాంకు ఖాతాలో 380 కిలోల బంగారం, 4428 కిలోల వెండి ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. 2017లో రామ నవమి సందర్భంగా గుర్తు తెలియని భక్తుడు 12 కిలోల బంగారాన్ని ఇక్కడ విరాళంగా ఇచ్చాడు. దేశం మొత్తం చర్చనీయాంశమైంది. ఇక్కడకు ఏటా దాదాపు రూ.400 కోట్ల విలువైన విరాళాలు వస్తుంటాయి.

వైష్ణో దేవి ఆలయం: దేశంలో అధిక ధనిక దేవాలయాల్లో శక్తి పీఠమైన వైష్ణో దేవి ఆలయం కూడా ఉంది. జమ్మూ కాశ్మీర్‌లోని వైష్ణో దేవి ఆలయం దేశంలోని అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. భారతదేశంలో గుర్తింపు పొందిన శక్తిపీఠ దేవాలయాలలో ఇది ఒకటి. ఈ ఆలయానికి సంవత్సరానికి రూ. 500 కోట్ల కానుకలు అందుతాయి. ఇది దేశంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటిగా నిలిచింది.

సిద్ధివినాయక దేవాలయం: దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో సిద్ధివినాయక దేవాలయం కూడా ఉంది. దేశంలోని ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. బాలీవుడ్ సెలబ్రిటీల నుండి బిజినెస్ టైకూన్ల వరకు చాలా మంది సెలబ్రిటీలు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. ఈ ఆలయం కోల్‌కతా వ్యాపారవేత్త విరాళంగా ఇచ్చిన 3.7 కిలోల బంగారంతో పూత పూయబడింది. రికార్డుల ప్రకారం సిద్ది వినాయకుడికి ప్రతి సంవత్సరం సుమారు రూ.125 కోట్ల విలువైన కానుకలు అందుతాయి. అయితే ఇప్పుడు అయోధ్యలోని రామ మందిరం ఈ ఆలయాలన్నింటినీ అధిగమిస్తుందని చెబుతున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు