Koti Talambralu: రాములోరి పెళ్ళికి గోటి తలంబ్రాలు రెడీ.. గోదారి తీరం నుంచి సరయూ నదీ తీరానికి భక్తులు పయనం
ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాజమహేంద్రవరం గోదావరి పుష్కర ఘాట్ వద్ద కోటి తలంబ్రాలకు విశ్వశాంతి హారతిని ఇచ్చారు. కోటి వత్తులకు కూడా సీతారామ అష్టోత్తర శతనామ పూజను చేశారు. అంతేకాదు అయోధ్య రామయ్య కోటి శుభలేఖలు యజ్ఞం కార్యక్రమం ప్రారంభించి శుభలేఖలు కూడా శాంతి హారతి కార్యక్రమం నిర్వహించారు.
తూర్పుగోదావరి జిల్లా ఆధ్యాత్మిక నగరం గోదావరి తీరాన రామచిలకలతో అయోధ్య బాల రాముడికి పెండ్లి శుభలేఖ తో పాటు గోటితో వలిచిన కోటి తలంబ్రాలు వేడుక వైభవంగా జరిగింది. సుమారు నాలుగు నెలల పాటు వరి పంట పండించిన అనంతరం గోటితో తలంబరాలను సిద్ధం చేశారు. కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం సభ్యులు. రాజమండ్రి పుష్కర ఘాట్ లో సీతారామ విగ్రహాల ముందు 200 కేజీల తలంబ్రాలను పోసి శ్రీరామ నామ జపం చేశారు.
జై శ్రీరామ్ శ్రీ రామ్ జై రామ్ జై జై రామ్ శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా 13 సంవత్సరాలుగా భద్రాచలం రామయ్యకు, ఏడు సంవత్సరాలుగా ఒంటిమిట్ట.. రెండు సంవత్సరాలుగా సీతారామచంద్రులకు కోటి కోటి తలంబ్రాలు సమర్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాజమహేంద్రవరం గోదావరి పుష్కర ఘాట్ వద్ద కోటి తలంబ్రాలకు విశ్వశాంతి హారతిని ఇచ్చారు. కోటి వత్తులకు కూడా సీతారామ అష్టోత్తర శతనామ పూజను చేశారు. అంతేకాదు అయోధ్య రామయ్య కోటి శుభలేఖలు యజ్ఞం కార్యక్రమం ప్రారంభించి శుభలేఖలు కూడా శాంతి హారతి కార్యక్రమం నిర్వహించారు.
గోకవరం మండలం అచ్చుతాపురం గ్రామ సర్వేనెంబర్ 16/2 లో వరి చేలల్లో ప్రత్యేకంగా పూజ చేసిన వడ్లను పండించి పంట ఎనిమిది వందల కేజీలను ఐదు రాష్ట్రాలకు 600 మంది భక్తులకు ఇచ్చి పంపిణీ చేశారు. అనంతరం అయోధ్యకు పయనమయ్యారు.
అయోధ్య రామయ్యకు కోటి తలంబ్రాలతో పాటు కోటి శుభలేఖల యజ్ఞం చేపట్టి ఈనెల 24వ తేదీన సాయంత్రం అయోధ్య సరయూ నది తీరాన కోటి వత్తుల దీపారాధన చేయనున్నారు. అలాగే 25వ తేదీన రాముడి కళ్యాణంలో గోటితో వలచిన తలంబ్రాలు సమర్పించనున్నారు రామభక్తులు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..