Kitchen Hacks: ఇంట్లోనే గిన్నెలను తోముకునే డిష్ వాష్ పౌడర్‌ని తయారు చేసుకోండి ఇలా.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. డబ్బులు అదా

గిన్నెలు తోమడానికి వినియోగిస్తున్న పౌడర్, సబ్బులు, లిక్విడ్లు వంటి వాటిని రసాయనాలు కలిసి తయారు చేస్తున్నారు. దీంతో తోమిన తర్వాత గిన్నెలను ఎంత సేపు ఎంత నీరుతో కడిగినా నురుగ వస్తూనే ఉంటుంది. ఈ గిన్నేల్లో ఉంచిన ఆహారాన్ని తినడం వలన అనారోగ్యం బారిన పడుతున్నారు అంటూ గత కొంతకాలంగా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపధ్యంలో రసాయనాలు ఉండే ఉత్పత్తులు కన్నా సేంద్రీయ పద్ధతిలో తయారైన ఉత్పత్తులను ఉపయోగించడం ఆరోగ్యానికి మంచింది. కనుక ఇంట్లోనే గిన్నెలను తోమడానికి ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండా డిష్ వాష్ పౌడర్ ను తయారు చేసుకోవచ్చు

Kitchen Hacks: ఇంట్లోనే గిన్నెలను తోముకునే డిష్ వాష్ పౌడర్‌ని తయారు చేసుకోండి ఇలా.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. డబ్బులు అదా
Dish Washing Powder
Follow us

|

Updated on: Feb 15, 2024 | 3:23 PM

మారిన మనిషి జీవన విధానంలో తినే తిండి, నిద్రపోయే సమయంతో పాటు ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి, పండించే పంటలు, పండ్లు, ఆహారం వండిన తర్వాత శుభ్రం చేయడానికి వినియోగించే డిటర్జెంట్ పౌడరు అన్ని రసాయనాల మయమే.. ముఖ్యంగా గిన్నెలను ఇప్పుడు శుభ్రం చేయడానికి బూడిద స్థానంలో డిష్ వాష్ సబ్బులు రాగా.. తోమడానికి పీచు బదులు స్క్రబ్బర్ వచ్చింది. అయితే ఇలా గిన్నెలు తోమడానికి వినియోగిస్తున్న పౌడర్, సబ్బులు, లిక్విడ్లు వంటి వాటిని రసాయనాలు కలిసి తయారు చేస్తున్నారు. దీంతో తోమిన తర్వాత గిన్నెలను ఎంత సేపు ఎంత నీరుతో కడిగినా నురుగ వస్తూనే ఉంటుంది. ఈ గిన్నేల్లో ఉంచిన ఆహారాన్ని తినడం వలన అనారోగ్యం బారిన పడుతున్నారు అంటూ గత కొంతకాలంగా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపధ్యంలో రసాయనాలు ఉండే ఉత్పత్తులు కన్నా సేంద్రీయ పద్ధతిలో తయారైన ఉత్పత్తులను ఉపయోగించడం ఆరోగ్యానికి మంచింది. కనుక ఇంట్లోనే గిన్నెలను తోమడానికి ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండా డిష్ వాష్ పౌడర్ ను తయారు చేసుకోవచ్చు. ఈ పౌడర్ గిన్నెల మురికిని వదిలించడమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎటువంటి హానిని చెయ్యదు. ఈ రోజు ఇంట్లోనే సేంద్రీయ పద్ధతిలో డిష్ వాష్ పౌడర్ తయారీ గురించి తెలుసుకుందాం…

కావాల్సిన పదార్ధాలు :

  1. నారింజ తొక్కలు ( ఎండబెట్టినవి )
  2. నిమ్మ తొక్కలు (ఎండబెట్టినవి )
  3. వేపాకులు ( ఎండబెట్టినవి )
  4. బేకింగ్ సోడా
  5. ఇవి కూడా చదవండి
  6. కుంకుడు కాయలు పొడి
  7. యూకలిప్టస్ ఆయిల్ లేదా టీ ట్రీ ఆయిల్

డిష్ వాషింగ్ పౌడర్ తయారీ విధానం:

ముందుగా ఎండబెట్టుకున్న నారింజ, నిమ్మ తొక్కలతో పాటు వేపాకులను పొడిగా చేసుకోవాలి. తర్వాత కుంకుడు కాయలను పొడి చేసుకుని ఇప్పుడు మిక్సి జార్ తీసుకుని అందులో నిమ్మ తొక్కల పొడి, నారింజ తొక్కల పొడి, వేప పొడి, బేకింగ్ సోడా, కుంకుడు కాయల పొడిని వేసుకుని మిక్సి పట్టుకుని పొడి చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమంలో కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆయిల్ లేదా టీ ట్రీ ఆయిల్ ను వేసుకుని బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక కంటైనర్ లోకి తీసుకుని గాలి తగలకుండా మూత పెట్టుకోవాలి.

గిన్నెలను తోమే ముందు కొంచెం పౌడర్ లో వేడి నీరు పోసుకుని పేస్ట్ లా చేసి గిన్నెలను శుభ్రం చేసుకోవాలి. గిన్నెల మీద ఉన్న ఎంతటి మురికైనా సులువుగా పోతుంది. ఈ పొడి తయారీలో ఎటువంటి రసాయనాలను ఉపయోగించలేదు కనుక ఆరోగ్య కరం. అంతేకాదు ఈ పొడి యాంటీ బ్యాక్టీరియా లక్షణాలను కలిగి ఉండడంతో.. బ్యాక్టీరియాని చంపేస్తాయి. తయారీకి ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.. ఒక్కసారి ఈ మిశ్రమం చేసి పెట్టుకుంటే.. చాలా నెలలు నిల్వ ఉంటుంది. ఈ పొడితో వంటింటి సామాన్లు మాత్రమే కాదు రాగి, వెండి, ఇత్తడి వస్తువులను కూడా శుభ్రం చేసుకోవచ్చు. సహజ పదార్ధాలతో తయారు చేస్తాం కనుక ఈ పౌడర్ ను హెర్బల్ డిష్ వాషింగ్ పౌడర్ అని కూడా అనవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఉప్పు తక్కువగా తింటున్నారా..? మీరు డేంజర్‌లో ఉన్నట్టే.. జాగ్రత్త!
ఉప్పు తక్కువగా తింటున్నారా..? మీరు డేంజర్‌లో ఉన్నట్టే.. జాగ్రత్త!
జాతకంలో శని దోషం తొలగాలంటే ఇంట్లో జమ్మి చెట్టుని ఇలా పూజించండి..
జాతకంలో శని దోషం తొలగాలంటే ఇంట్లో జమ్మి చెట్టుని ఇలా పూజించండి..
భారతదేశంలో అత్యంత ఖరీదైన విస్కీ బాటిల్‌ ఏదో తెలుసా?
భారతదేశంలో అత్యంత ఖరీదైన విస్కీ బాటిల్‌ ఏదో తెలుసా?
బ్యాచ్‌ల వారీగా USAకు భారత క్రికెట్ జట్టు.. మొదటి వెళ్లేది వీరే
బ్యాచ్‌ల వారీగా USAకు భారత క్రికెట్ జట్టు.. మొదటి వెళ్లేది వీరే
కమల్ హాసన్ పై డైరెక్టర్ ఫిర్యాదు..
కమల్ హాసన్ పై డైరెక్టర్ ఫిర్యాదు..
హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వామును అద్భుత ఔషధం!
హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వామును అద్భుత ఔషధం!
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..