AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shani Surya Transit: 30 ఏళ్ల తర్వత కలిసిన సూర్య, శని.. మార్చి 13 వరకూ ఈ 3 రాశుల వారు పట్టిందల్లా బంగారమే..

ప్రస్తుతం శనీశ్వరుడు కుంభ రాశిలో సంచారం దశలో ఉన్నాడు. అయితే సూర్యుడు ఫిబ్రవరి 13వ తేదీన కుంభ రాశిలోకి అడుగు పెట్టాడు. దీంతో దాదాపు 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలో తండ్రి కొడుకు అయిన సూర్య, శని గ్రహాలు కలిశాయి. ఈ రెండు గ్రహాల కలయికు జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక ప్రముఖ్యత ఉంది. ప్రత్యేక యోగాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఈ ప్రభావం దాదాపు మార్చి 13 వరకు ఉంటుంది. సూర్యుడు-శని కలయిక అహం ఘర్షణలు.. విభిన్న ఆలోచన ప్రక్రియల కారణంగా కొందరి జాతకంలో తండ్రి. కొడుకుల మధ్య అభిప్రాయ భేదాలను కలిగిస్తుంది.

Shani Surya Transit: 30 ఏళ్ల తర్వత కలిసిన సూర్య, శని.. మార్చి 13 వరకూ ఈ 3 రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
Shani Surya Transit
Surya Kala
|

Updated on: Feb 15, 2024 | 2:32 PM

Share

జ్యోతిషశాస్త్రంలో రాశులకు, గ్రహాలకు ప్రముఖ స్థానం ఉంది. నవగ్రహాల సంచారం ఆధారంగా మానవుడి జీవితంలో మంచి చెడులు ఆధారపడి ఉంటాయి. నవ గ్రహాలకు అధినేత సూర్యుడు. మన జీవితాలను గణనీయంగా ప్రభావితం చేసే శక్తివంతమైన గ్రహం. కనుక మనిషి జాతకంలో సూర్యుడి స్థానం వ్యక్తిత్వం, జీవిత మార్గం గురించి చాలా వెల్లడిస్తుంది. సూర్యుడు స్వీయ స్వభావాన్ని సూచిస్తాడు. అదే సమయంలో సూర్యుడి తనయుడైన శనిశ్వరుడికి నవగ్రహాలలో ప్రముఖ స్థానం ఉంది. కర్మ ఫల దాత శని. మకర, కుంభ రాశులకు అధిపతి అయిన శని గ్రహం. ప్రస్తుతం శనీశ్వరుడు కుంభ రాశిలో సంచారం దశలో ఉన్నాడు. అయితే సూర్యుడు ఫిబ్రవరి 13వ తేదీన కుంభ రాశిలోకి అడుగు పెట్టాడు. దీంతో దాదాపు 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలో తండ్రి కొడుకు అయిన సూర్య, శని గ్రహాలు కలిశాయి. ఈ రెండు గ్రహాల కలయికు జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక ప్రముఖ్యత ఉంది. ప్రత్యేక యోగాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఈ ప్రభావం దాదాపు మార్చి 13 వరకు ఉంటుంది. సూర్యుడు-శని కలయిక అహం ఘర్షణలు.. విభిన్న ఆలోచన ప్రక్రియల కారణంగా కొందరి జాతకంలో తండ్రి. కొడుకుల మధ్య అభిప్రాయ భేదాలను కలిగిస్తుంది. అదే సమయంలో  సూర్య, శనిశ్వరుడిని కలయిక కారణంగా కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఈ రోజు ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం..

సింహ రాశి: తండ్రి కొడుకుల కలయిక ఈ రాశికి చెందిన వారికి అదృష్టాన్ని తెస్తుంది. ఎప్పటి నుంచో భార్యాభర్తల మధ్య ఉన్న వివాదాలు పరిష్కారం అయి… సంతోషంగా జీవించే అవకాశం ఉంది. వ్యాపారస్తులు తమ పెట్టుబడుల వలన లాభాలను పొందుతారు. అంతేకాదు ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశం ఉంది,

మిథున రాశి: 30 ఏళ్ల తర్వత శని సూర్యుడి కలయిక వలన మిథున రాశులకు చెందినా వ్యక్తులకు శుభప్రదం కానుంది. ఉద్యోగస్తులు సుభవార్త వినే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు పూర్తి చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులు లాభాలను పొందుతారు. పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అంతేకాదు వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారు శుభవార్త వినే అవకాశం ఉంది. ఈ రాశికి చెందిన వ్యక్తులకు సమాజంలో కీర్తి, ప్రతిష్టలు, గౌరవం అందుకుంటారు.

ఇవి కూడా చదవండి

మకర రాశి: ఈ రాశికి చెందిన వారికి ఈ రెండు గ్రహాల కలయికతో పట్టిందల్లా బంగారంగా మారుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగస్తులు తమ పని తీరుతో అధికారుల నుంచి ప్రశంసలు కూడా పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న స్టూడెంట్స్ సక్సెస్ ను అందుకుంటారు. ఆర్ధికంగా లాభలను పొందుతారు. కోరుకున్న కోర్కెలు నెరవేర్చుకుంటారు. అయితే ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అనారోగ్యం బారిన పడే అవ ఆకాశం ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

Follow Us
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ