Puja Astro Tips: గుడి నుంచి ఇంటికి తిరిగి వస్తూ ఈ పనులు చేస్తున్నారా.. జీవితంలో సమస్యలు తప్పవట

ఇంట్లో పూజ చేయడంతో పాటు.. కొంతమంది గుడికి వెళ్లి పూజను కూడా చేస్తారు. అలా గుడిలో పూజ చేసి వచ్చేటపుడు కొన్ని పనులు చేయకూడదని జ్యోతిష్యశాస్త్రం పేర్కొంది. ఈరోజు ఆలయంలో పూజ చేసి వస్తూ చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం.. ఎవరైనా సరే గుడిలో ప్రసాదం సమర్పించడం కోసం గుడికి తీసుకుని వెళ్లి.. పూజ, ప్రసాద వితరణ అనంతరం ఆ ప్రసాదం ఇంటికి తీసుకుని వచ్చే సమయంలో కొన్ని విషయాలను పాటించాలని పండితులు చెప్పారు.

Puja Astro Tips: గుడి నుంచి ఇంటికి తిరిగి వస్తూ ఈ పనులు చేస్తున్నారా.. జీవితంలో సమస్యలు తప్పవట
Puja Astro Tips
Follow us

|

Updated on: Feb 08, 2024 | 8:41 PM

హిందూ మతంలో భగవంతుని ఆరాధన అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అందుకనే ఎవరైనా పూజ చేసే సమయంలో పొరపాట్లు చేయవద్దు అని పెద్దలు సూచిస్తారు. ఎందుకంటే పూజలు చేసే సమయంలో తప్పులు చేస్తే దేవుడు ఆగ్రహిస్తాడనీ, మనిషి జీవితంలో సమస్యలు తలెత్తుతాయని నమ్ముతారు. ఇంట్లో పూజ చేయడంతో పాటు.. కొంతమంది గుడికి వెళ్లి పూజను కూడా చేస్తారు. అలా గుడిలో పూజ చేసి వచ్చేటపుడు కొన్ని పనులు చేయకూడదని జ్యోతిష్యశాస్త్రం పేర్కొంది. ఈరోజు ఆలయంలో పూజ చేసి వస్తూ చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం..

దారిలో ప్రసాదం తినకూడదా?

ఎవరైనా సరే గుడిలో ప్రసాదం సమర్పించడం కోసం గుడికి తీసుకుని వెళ్లి.. పూజ, ప్రసాద వితరణ అనంతరం ఆ ప్రసాదం ఇంటికి తీసుకుని వచ్చే సమయంలో కొన్ని విషయాలను పాటించాలని పండితులు చెప్పారు. గుడి నుండి ఇంటికి తిరుగు ప్రయాణంలో ఎప్పుడూ ప్రసాదాన్ని తినరాదు. ఇలా చేయడం వలన  ఆరాధన అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. నమ్మకం ప్రకారం ఆలయం నుండి స్వీకరించిన ప్రసాదాన్ని ఇంట్లో ఉన్న ప్రసాదంతో కలిపి కుటుంబ సభ్యులందరికీ పంచి, కలిసి సేవించాలి.

ఎవరైనా పంచ పాత్ర లేదా పాత్రను ఇంటికి తీసుకురాకూడదా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గుడికి వెళ్లేటప్పుడు లేదా వచ్చే సమయంలో ఖాళీ పాత్రను ఇంటి నుంచి తీసుకుని వెళ్ళరాదు. అదే విధంగా గుడి నుంచి ఇంటికి తీసుకురాకూడదు. ఇంట్లోకి ఖాళీ పంచ పాత్రను  తీసుకురావడం వల్ల జీవితంలో చేసే పని కూడా చెడిపోతుందని నమ్ముతారు. కనుక దేవుడికి నీరుని సమర్పించే ముందు పాత్రలోని కొంచెం నీరు ఉంచాలి. లేదా నీరు అందుబాటులో లేనట్లయితే గుడి నుండి తెచ్చే పూజ పుష్పాలను పాత్రలో ఉంచవచ్చు. గుడి నుంచి వచ్చే సమయంలో పంచ పాత్ర నిండుగా నీరు ఇంటికి తీసుకురావడం వల్ల ఇంట్లో సుఖ శాంతులు, సిరి సంపదలు లభిస్తాయని చెబుతారు.

ఇవి కూడా చదవండి

గుడిలో పూజ చేసేటప్పుడు ఈ తప్పులు చేయకూడదా?

గుడిలో లేదా ఇంట్లో పూజ చేసే సమయంలో వెలిగించిన దీపంతో మరో దీపాన్ని వెలిగించకూడదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇలా చేయడం వలన దేవుడికి కోపం వస్తుందని నమ్ముతారు. అంతేకాదు పూజ ఫలం లభించదు. పూజ సమయంలో దేవునికి ఏ పూజా సామాగ్రిని సమర్పిం.చాలనుకున్నా.. నేలపై పడిన ఏ వస్తువునైనా తిరిగి దేవుడికి సమర్పించకూడదు. ఇలా చేయడం వలన భగవంతుడిని అగౌరవ పరిచినట్లు పరిగణిస్తారు. అలాగే పూజ చేసేటప్పుడు, పూజా స్థలంలో పూజ సామగ్రి ఉన్న సమయంలో అక్కడ శుభ్రం చేయకూడదు.  ఇలా చేయడం వల్ల దేవునికి అసంతృప్తి కలుగుతుందని.. ఆ పూజ  పరిపూర్ణం కాదని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!