AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srisailam Dam: శ్రీశైలం డ్యామ్‌ని సందర్శించిన ఎన్డీఎస్ఏ, కేఆర్ఎంబి సభ్యుల బృందం.. రిపేర్లకు చిన్న చిన్న సూచనలు..

శ్రీశైలం జలాశయం కెఆర్ఎంబి పరిధిలోకి తీసుకురానున్న నేపథ్యంలో డ్యాం భద్రత, నీటి నిల్వలు వినియోగపై పూర్తిస్థాయిలో నిపుణుల బృందం అధ్యయనం చేస్తుంది. జలాశయం భద్రత, నీటి నిల్వలు, నీటి వినియోగంపై సమగ్రంగా పరిశీలించి జలాశయం వివరాలను డ్యామ్ అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు.  అలానే 2009 లో జలాశయం వరదలపై అధికారులతో తెలుసుకొని డాయగ్రామ్స్ పరిశీలించారు.

Srisailam Dam: శ్రీశైలం డ్యామ్‌ని సందర్శించిన ఎన్డీఎస్ఏ, కేఆర్ఎంబి సభ్యుల బృందం.. రిపేర్లకు చిన్న చిన్న సూచనలు..
Srisailam Dam
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Feb 08, 2024 | 5:09 PM

Share

నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయం రెండు రోజుల పర్యటనలో భాగంగా ఎన్డిఎస్ఏ చైర్మన్ వివేక్ త్రిపాఠి, సాంకేతిక సభ్యుడు రాకేష్ కశ్యప్, కెఆర్ఎంబి సంబంధించిన 10 మంది బృంద సభ్యులు జలాశయాన్ని సందర్శించారు.  ప్రాజెక్ట్ పరిశీలనకు వచ్చిన సభ్యుల బృందానికి డ్యామ్ ఎస్ఈ శ్రీరామచంద్రమూర్తి, పలువురు డ్యామ్ ఇంజనీర్లు స్వాగతం పలికారు. ముఖ్యంగా శ్రీశైలం జలాశయం కెఆర్ఎంబి పరిధిలోకి తీసుకురానున్న నేపథ్యంలో డ్యాం భద్రత, నీటి నిల్వలు వినియోగపై పూర్తిస్థాయిలో నిపుణుల బృందం అధ్యయనం చేస్తుంది. జలాశయం భద్రత, నీటి నిల్వలు, నీటి వినియోగంపై సమగ్రంగా పరిశీలించి జలాశయం వివరాలను డ్యామ్ అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు.  అలానే 2009 లో జలాశయం వరదలపై అధికారులతో తెలుసుకొని డాయగ్రామ్స్ పరిశీలించారు. అలానే జలాశయం డ్యామ్ గేట్లు, గ్యాలరీ, రోప్స్, డ్యామ్ ముందు ఏర్పడిన ప్లాంజ్ ఫుల్ (పెద్ద గొయ్యి ) గురించి అలానే డ్యామ్ ముందుగల గేట్లను పరిశీలించి అధికారులతో చర్చించారు. డ్యామ్ భద్రత ఎలా పని చేస్తుందని అరా తీశారు పరిశీలన అనంతరం డ్యామ్ అధికారులతో రేపు ఉదయం సమావేశం నిర్వహించనున్నారు.

పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రాజెక్టు సిఈ కబీర్ బాషా నేషనల్ జలశక్తి సూచనల మేరకు డ్యాం నేషనల్ సేఫ్టీ అథారిటీ డ్యామ్ పరిశీలనకు వచ్చారని వివేక్, విటల్ ఆధ్వర్యంలో డ్యామును పరిశీలించారని డ్యామ్ స్థితి గతి ఎలా ఉంది ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందన్నారు. ప్లాంజ్ ఫుల్ పరిస్థితి ఎలా ఉంది దానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేదానిపై పరిశీలన చేశారని ప్లాంజ్ ఫుల్ మరీ లోతుగా గోయి పడకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారని చెప్పారు. అంతేకాదు మూడు గ్యాలరీలు పరిశీలించి వాటి సీపీసీ ఎలా వస్తుంది ఎలా అందజేస్తున్నారని డ్యామ్ గేట్లు ఎలా ఆపరేటింగ్ చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మళ్ళీ మధ్యాహ్నం నుండి వీటన్నిటికీ సంబంధించి చర్చ చేసి నిపుణులు బృందం సలహాలు సూచనలు చేశారు. వీటితోపాటు అప్రోచ్ రోడ్డు సిలికాన్ సిలిండర్ గురించి గతంలోనే ప్రపంచ బ్యాంకుకు ప్రతిపాదన సమర్పించడం జరిగిందని దానిపై కూడా చర్చ చేశారని అలానే ఇప్పటికే ప్రపంచ బ్యాంకు కి సుమారు డ్యామ్ మరమ్మతులకు 135 కోట్లు అంచనా వ్యయం వేసి పంపించామని మరొకసారి ఎన్డిఎస్ఏ బృందం సలహాలతో ఇంకా ఏమైనా కావాల్సినా వాటి గురించి కూడా ప్రతిపాదన చేస్తామని తెలిపారు. ప్రస్తుతానికి డ్యాం స్థితిగతికి ఎటువంటి ఇబ్బంది లేదని ప్లాంజ్ ఫుల్ అలానే చిన్నచిన్న రిపేర్లకుపై నిపుణుల బృందం సభ్యులు కొన్ని సలహాలు సూచనలు చేశారని శ్రీశైలం ప్రాజెక్టు సిఈ కబీర్ భాషా తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్