Imli Tala: ఇమ్లితాల ఆలయంలో శాపగ్రస్తమైన చింత చెట్టు.. నేటికీ కాయలు ఎందుకు కాయవంటే

ఒకసారి రాధా దేవి కన్నయ్యతో ఉన్న సమయంలో అదృశ్యమయ్యిందట. అప్పుడు శ్రీ కృష్ణుడు ఈ చింతపండు క్రింద కూర్చుని రాధా దేవి వియోగాన్ని అనుభవిస్తూ.. విచారకరంగా ఉన్న సమయంలో అనుభూతిలో మునిగిపోయాడని..  ఈ సమయంలో అతను శ్రీవారి మధురమైన పాటలను విన్నాడని కూడా చెబుతారు. రాధ పేరుని జపిస్తూ ఈ చెట్టు కింద ఉన్నాడని  విశ్వాసం. బృందావన్‌లోని ఇమ్లితాల ఆలయంలోని ఈ దైవత్వం దీనిని అత్యంత ఆకర్షణీయంగా చేసింది. చైతన్య మహాప్రభుతో పాటు రాధా కృష్ణుడు, నితాయ్ గౌర్ ఇప్పటికీ ఇమ్లితాలా ఆలయంలో నివసిస్తున్నారని కూడా నమ్ముతారు.

Imli Tala: ఇమ్లితాల ఆలయంలో శాపగ్రస్తమైన చింత చెట్టు.. నేటికీ కాయలు ఎందుకు కాయవంటే
Imlitala Mandir
Follow us
Surya Kala

|

Updated on: Feb 08, 2024 | 3:18 PM

శ్రీ కృష్ణుడు అనగానే బృందావనంఅందరికి గుర్తుకొస్తుంది. ప్రతి సంవత్సరం శ్రీ కృష్ణుని ఆలయాలను దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుండి బృందావనానికి వస్తుంటారు. శ్రీ కృష్ణుని ప్రతి ఆలయంలో ఒకొక్క లీల ఉంటుంది. ఈ లీలలు విన్నా తలచినా భక్తులకు రమణీయం అనిపిస్తుంది. అటువంటి అనేక ప్రదేశాలు, దేవాలయాలు బృందావనంలో ఉన్నాయి. ఇక్కడ కన్నయ్య చిన్నతనంలో గడిపిన తీరుకి సంబంధించిన సాక్ష్యాలు నేటికీ కనిపిస్తాయి. ఆ ప్రదేశాలలో ఇమ్లితాలా ఆలయం ఒకటి. ఇక్కడ మనుషులే కాదు చెట్లు, మొక్కలు కూడా శాపానికి గురిఅయ్యాయి అని చెప్పడానికి సజీవ సాక్ష్యం అని అంటారు. బృందావన్‌లోని శాపగ్రస్తమైన చింత చెట్టు ఒకటి ఉంది. ఈ చెట్టుకి రాధ  శాపం ఇచ్చిందని చెబుతారు. ఈ చెట్టుకి శాపం ఇవ్వడానికి ఉన్న కథ, నమ్మకం ఏమిటి ఈ కథనంలో చూద్దాం..

ఇమ్లితాల ఆలయం యమున తీరంలో ఉన్న పవిత్రమైన ఆలయం. ఇమ్లితల దేవాలయానికి సంబంధించి అనేక కథలు, నమ్మకాలు ఉన్నాయి. అయితే చైతన్య మహాప్రభు గురించి చాలా ప్రసిద్ధ కథ వినబడుతుంది. ఈ ప్రసిద్ధ చింతచెట్టు కింద కూర్చొని శ్రీ కృష్ణ నామాన్ని జపిస్తూ తపస్సు చేశాడని చెబుతారు. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు వస్తుంటారు. ఈ ఆలయం చుట్టూ గోడలపై, ఇమ్లితలా ఘాట్ కథలను వర్ణించే కళాఖండాలు ఉన్నాయి.

విశ్వాసాల ప్రకారం ఒకసారి రాధా దేవి కన్నయ్యతో ఉన్న సమయంలో అదృశ్యమయ్యిందట. అప్పుడు శ్రీ కృష్ణుడు ఈ చింతపండు క్రింద కూర్చుని రాధా దేవి వియోగాన్ని అనుభవిస్తూ.. విచారకరంగా ఉన్న సమయంలో అనుభూతిలో మునిగిపోయాడని..  ఈ సమయంలో అతను శ్రీవారి మధురమైన పాటలను విన్నాడని కూడా చెబుతారు. రాధ పేరుని జపిస్తూ ఈ చెట్టు కింద ఉన్నాడని  విశ్వాసం. బృందావన్‌లోని ఇమ్లితాల ఆలయంలోని ఈ దైవత్వం దీనిని అత్యంత ఆకర్షణీయంగా చేసింది. చైతన్య మహాప్రభుతో పాటు రాధా కృష్ణుడు, నితాయ్ గౌర్ ఇప్పటికీ ఇమ్లితాలా ఆలయంలో నివసిస్తున్నారని కూడా నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

 రాధా దేవి అలంకరణను చెడగొట్టిన చింత చెట్టు

ఈ ఇమ్లి తాలా దేవాలయం బృందావన్ జుగల్ ఘాట్ సమీపంలో ఉంది. ఈ ప్రదేశం 5500 సంవత్సరాలకు పైగా పురాతనమైనదని చెబుతారు. ఈ ఆలయం లోపల అనేక నమ్మకాలకు సంబంధించిన చింత చెట్టు ఉంది. ద్వాపర యుగంలో ఈ చెట్టు నిండా చింతపండు ఉండేదని చెబుతారు. ఒకసారి రాధారాణి యమునా నదిలో స్నానం చేసి అలంకరించుకుని ఈ చెట్టు కింద నుంచి వెళ్తోంది. అదే సమయంలో ఈ చెట్టు నుండి పండిన చింతపండు ఒకటి రాలి.. రాధాదేవి అడుగు వేస్తున్న మార్గంలో పడింది. చెట్టు పండు మీద కాలు వేసిన రాధాదేవి జారి పడిపోయింది. దీంతో ఆమె అలంకరణ చెడిపోయింది.

అందుకే చింత చెట్టుకి శాపం..

ఈ చెట్టులోని పండిన చింతపండు మీద కాలు వేసి పడిన రాధాదేవి తన అలంకరణ పాడైపోయిందని కోపంతో ఈ చింత చెట్టును శపించిందట. ఈ శాపం కారణంగా ఇప్పటి వరకూ ఈ చింత చెట్టుకి ఒక్కసారి కూడా కాయలు కాయలేదు. బ్రజ్ ల్యాండ్‌లో ఉన్న ఈ చింత చెట్టుకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కాయలేదు.

కార్తీక పూర్ణిమ రోజున శ్రీ కృష్ణ చైతన్య మహాప్రభువు బృందావన ధామ్ చేరుకుని ఈ చింత చెట్టు కింద కూర్చుని సంకీర్తన చేశారు. అప్పుడు ఈ చెట్టు కొమ్మ కితంగఢ్ రాజు రాథోడ్ రాజభవనంపై వ్యాపించింది. దీంతో ఆ రాజు ఈ చింత చెట్టు కొమ్మని రాజు నరికివేయించాడు. అప్పుడు ఆ కొమ్మ నుండి వరుసగా మూడు రోజులు రక్తం వస్తూనే ఉందట. తరువాత ఈ చింత చెట్టు పక్కనే మరో ప్రతీకాత్మకమైన చింత చెట్టును నాటారని స్థానికుల కథనం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

అందరు చూస్తుండగానే ముక్కలైన మూగ జీవి!
అందరు చూస్తుండగానే ముక్కలైన మూగ జీవి!
రెండో రోజుకు న్యూస్9 గ్లోబల్ సమ్మిట్..
రెండో రోజుకు న్యూస్9 గ్లోబల్ సమ్మిట్..
హీరో ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు.. ఆయనతో ఎలాంటి సంబంధం లేదు
హీరో ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు.. ఆయనతో ఎలాంటి సంబంధం లేదు
శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజ
శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజ
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA