AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heat Waves: తెలుగు రాష్ట్రాల ప్రజలకు హెచ్చరిక.. నెల ముందే వచ్చేసిన వేసవి కాలం.. వడ గాలుల తీవ్రత ఎక్కువేనని హెచ్చరిక..

ఎల్ నినో ప్రభావం తో ఈ సంవత్సరం చలికాలం కూడా చాలా వేడిగా గడుస్తుంది. చలి కాలం కంప్లీట్ అవ్వడానికి ఇంకా నెల రోజుల సమయం ఉన్నప్పటికీ వాతావరణం మాత్రం వేడి గా మారుతుంది. గత సంవత్సరం తో పోల్చితే చలి కాలం లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ఫిబ్రవరి చివరి నుండి వేసవి కాలం మొదలు అవుతుంది అని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అంతేకాదు గతం కంటే ఎక్కువ ఎండ ప్రభావం ఈ వేసవి లో ఉండ నుంది అని అంటున్నారు నిపుణులు.

Heat Waves: తెలుగు రాష్ట్రాల ప్రజలకు హెచ్చరిక.. నెల ముందే వచ్చేసిన వేసవి కాలం.. వడ గాలుల తీవ్రత ఎక్కువేనని హెచ్చరిక..
Heat Waves
Yellender Reddy Ramasagram
| Edited By: Surya Kala|

Updated on: Feb 08, 2024 | 2:32 PM

Share

ఫిబ్రవరి రెండో వారం ఇంకా రానే లేదు..అప్పుడే భానుడి ప్రతాపం కనిపిస్తుంది. గడిచిన రెండు, మూడు రోజుల నుండి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒక్కసారిగా మారిన వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ సారి ఎండలు ముందే రానున్నాయి అని.. గత ఏడాది కంటే కూడా ఎండల ఎక్కువగా ఉండనున్నాయి అని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. అంతేకాదు వాతావరణ శాఖ ముందస్తుగా తగిన ఏర్పాట్లు చేసుకోమంటూ కొన్ని హెచ్చరికలను జారీ చేసింది.

ఈ ఏడాది ఎండలు బాబోయ్ అనేలా ఉంటాయని అంటుంది వాతావరణ శాఖ. ఎల్ నినో ప్రభావం తో ఈ సంవత్సరం చలికాలం కూడా చాలా వేడిగా గడుస్తుంది. చలి కాలం కంప్లీట్ అవ్వడానికి ఇంకా నెల రోజుల సమయం ఉన్నప్పటికీ వాతావరణం మాత్రం వేడి గా మారుతుంది. గత సంవత్సరం తో పోల్చితే చలి కాలం లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ఫిబ్రవరి చివరి నుండి వేసవి కాలం మొదలు అవుతుంది అని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అంతేకాదు గతం కంటే ఎక్కువ ఎండ ప్రభావం ఈ వేసవి లో ఉండ నుంది అని అంటున్నారు నిపుణులు.

మామూలుగా మార్చి నెల మధ్య నుండి సమ్మర్ ఎఫెక్ట్ మొదలు అవుతుంది. కానీ ఈ సంవత్సరం నెల ముందు నుండే అంటే ఫిబ్రవరి ఎండింగ్ నుండి సమ్మర్ సుర్రు మనడానికి రెడీ అవుతుంది అని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఇందుకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. దీనంతటికీ కారణం వాతావరణ లో ఏర్పడిన ఎల్ నినో ఎఫెక్ట్ అని అంటున్నారు నిపుణులు. దీని వల్ల భూ తాపం ఎప్పటికప్పుడు పెరుగుతుంది అని అంటున్నారు. అయితే ఈ వేసవి లో వడ గాల్పుల ప్రభావం చూపనుంది అని.. సమ్మర్ మొత్తం లో హీట్ వేవ్స్ కొన్ని సార్లు ఎఫెక్ట్ చూపిస్తుంది అని అంటున్నారు నిపుణులు. అయితే తగిన జాగ్రతలు తప్పనిసరి అని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే ఇంతటి హాట్ మ్యాటర్ లో చల్లని మాట ఒక్కటి ఉంది. ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఉష్ణోగ్రతలు తగ్గుతూ, పెరుగుతూ నెల చివరి నాటికి ఎండ తీవ్రత పెరుగుతుంది అని అంటున్నారు. ఒకటి,రెండు రోజుల తరవాత ఉపరితల ద్రోణి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షం పడే ఛాన్స్ ఉంది అని అంటుంది వాతావరణ శాఖ.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..