AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: బంగారు కమ్మలు చూపించమన్నాడు.. నచ్చినవి తీసుకుని పరుగో పరుగు.. క్షణాల్లో మాయం..

దర్జాగా షాపులోకి వచ్చాడు... చెవి కమ్మలు తీసుకొని షాపు యజమానిని మాటల్లోపెట్టాడు. షాపు బయట ఎవరూ లేరు అని నిర్ధారించుకున్న తర్వాత ఆ దొంగ ఎలా పరిగెత్తాడంటే ఒలంపిక్స్ కి పంపిస్తే మెడల్ ఖాయం అనేటంత స్వీడ్ గా పరిగెత్తాడు. రాయదుర్గం పట్టణంలో ఓ జ్యువెలరీ షాపులో జరిగిన దొంగతనాన్ని సీసీ కెమెరాలో చూసిన వారంతా.... ఆ దొంగ పరుగు పెట్టిన తీరు ఒలంపిక్స్ పంపిస్తే గోల్డ్ మెడలు తీసుకొచ్చేలా ఉన్నాడే అనుకుంటున్నారు.

Andhra Pradesh: బంగారు కమ్మలు చూపించమన్నాడు.. నచ్చినవి తీసుకుని పరుగో పరుగు.. క్షణాల్లో మాయం..
Super Donga In Anantapur
Nalluri Naresh
| Edited By: |

Updated on: Jan 28, 2024 | 12:55 PM

Share

బంగారం షాపులోకి వచ్చాడు.. నచ్చిన చెవి కమ్మలు అడిగి తీసుకున్నాడు.. చేతితో పట్టుకుని చూశాడు.. షాపు యజమాని ముందే చెవి కమ్మలు తీసుకుని పరుగో.. పరుగు అంటూ దొంగ పారిపోయాడు. బంగారం ఎత్తుకెళ్లిన దొంగ యజమాని కళ్ళు కప్పలేదు.. కనికట్టు చేయలేదు.. దర్జాగా షాపులోకి వచ్చాడు… చెవి కమ్మలు తీసుకొని షాపు యజమానిని మాటల్లోపెట్టాడు. షాపు బయట ఎవరూ లేరు అని నిర్ధారించుకున్న తర్వాత ఆ దొంగ ఎలా పరిగెత్తాడంటే ఒలంపిక్స్ కి పంపిస్తే మెడల్ ఖాయం అనేటంత స్వీడ్ గా పరిగెత్తాడు. రాయదుర్గం పట్టణంలో ఓ జ్యువెలరీ షాపులో జరిగిన దొంగతనాన్ని సీసీ కెమెరాలో చూసిన వారంతా…. ఆ దొంగ పరుగు పెట్టిన తీరు ఒలంపిక్స్ పంపిస్తే గోల్డ్ మెడలు తీసుకొచ్చేలా ఉన్నాడే అనుకుంటున్నారు.

రద్దీ లేని బంగారం షాపును ఎంచుకొని.. అందులోనూ షాపులో ఒక ముసలి వ్యక్తి కౌంటర్లో ఉండటానికి గమనించిన దొంగ ఇదే సరైన సమయం అనుకున్నాడు. ఇంకేముంది షాపు లోపలికి వెళ్ళాడు.. చెవి కమ్మలు కావాలని షాపు నిర్వాహకుని అడిగి నాలుగైదు రకాల చెవి కమ్మలను చూశాడు. నచ్చింది తీసుకున్నాడు.  చేతిలో పట్టుకున్నాడు. ఇంతలో యజమానికి ఏదో ఫోన్ కాల్ వచ్చిందని మాట్లాడుతుండగానే..  అటు..   ఇటు చూసాడు ఇక పరుగో పరుగు అంటూ పరుగులంకించుకున్నాడు ఆ దొంగ.

ఇవి కూడా చదవండి

షాపు యజమాని తేరుకొని తీరిగ్గా షాపు బయటకు వచ్చి చెప్పులేసుకుని వెళ్లే లోపు దొంగ కంటికి కూడా కనిపించలేదు. ఈ మొత్తం వ్యవహారం దొంగతనం జరిగిన తీరు అక్కడున్న సీసీ కెమెరాలు రికార్డు అయింది. చెవి కమ్మలు తీసుకొని ఉడాయించిన దొంగ పరుగు తీసిన విధానం చూస్తే మనోడు పరుగు పందాల్లో డిస్టిక్ ఫస్ట్ అన్నట్లుగా ఉంది. ఇంకేముంది బంగారం షాపు నిర్వాహకుడు లబోదిబోమంటూ చుట్టుపక్కలందరితో..  ఆ చుట్టుపక్కల అంతా వెతికినా.. ఎక్కడా దొంగ కనిపించలేదు.. తుపాకీ గుండుకు దొరకనంతగా పరిగెత్తి పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్