Flowers-Fruits Show: మూడు రోజుల పాటు ఫల, పుష్ప ప్రదర్శన… ఆకట్టుకుంటున్న పూల వనం.. పండ్లతో నిర్మాణాలు..

కర్ణాటక రాష్ట్రంలో పూల సోయగాలు ప్రకృతి ప్రేమికులను అలరిస్తున్నాయి. యాదగిరి లుంబినీ పార్కులో నిర్మించిన పూల వనం అత్యంత సుందరంగా ఉంది. పార్కులో పూలు, పండ్లతో తయారు చేసిన చిత్రాలు చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. పూల ప్రపంచం ఆవిష్కృతమైంది. వివిధ రకాల పండ్లు, పూలతో అలంకరించిన చిత్రాలను చూసేందుకు భారీగా సందర్శకులు వస్తున్నారు. సెల్ఫీలు దిగుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫల, పుష్ప ప్రదర్శన ఎలా జరిగిందో తెలుసుకుందాం..

Surya Kala

|

Updated on: Jan 28, 2024 | 12:08 PM

యాదగిరి నగరంలోని లుంబినీ పార్కులో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఫల, పూల ప్రదర్శన జరుగుతోంది. శనివారం ప్రారంభమైన ఫల, పుష్ప ప్రదర్శనను చూసేందుకు ఆదివారం సెలవు దినం కావడంతో భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

1 / 9
జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు పండించిన పూలు, పండ్లను ప్రదర్శనలో ఉంచారు. అంతేకాకుండా ఇతర జిల్లాల నుంచి కొన్ని పూలను తీసుకొచ్చి అలంకరించారు.

2 / 9
ఈ ఏడాది క్రికెట్ ప్రపంచకప్ నేపథ్యంలో క్రికెట్ మైదానం, పిచ్ నిర్మాణంతోపాటు బ్యాట్, బంతిని పూలతో తయారు చేశారు. దీంతో పాటు యాదగిరి జిల్లా ఇన్‌చార్జి మంత్రి శరణబసప్ప దర్శనాపుర, ఎమ్మెల్యే చెన్నారెడ్డి పాటిల్, శరంగౌడ్ కందకూర్, రాజా వెంకటప్ప నాయక, జిల్లా కౌన్సిల్ సభ్యులు, డీసీ, ఎస్పీ, సీఈవోలతో పాటు పలువురు అధికారుల చిత్రాలను పండ్లపై వేశారు.

3 / 9

చిలుకలు, నెమళ్లు వంటి పక్షుల నిశ్శబ్ద చిత్రాలను రూపొందించడానికి వివిధ రకాల కూరగాయలను ఉపయోగించారు. నరేగాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పూలతో అందంగా మలిచారు.   

4 / 9

ముఖ్యంగా పూలతో అందమైన ఎర్రకోటను నిర్మించారు. ప్రజలు తమ మొబైల్ ఫోన్‌లతో సెల్ఫీలు దిగుతూ ఈ పూల కోటను చూసి సంతోషిస్తున్నారు. 

5 / 9
పుచ్చకాయ పండులో రాముడు-సీత నిలబడి ఉన్నారు. శివలింగం, ఆంజనేయ చిత్రం, సిద్దేశ్వర్,  డా. బీఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, జవహర్ లాల్ నెహ్రూ, భగత్ సింగ్‌లతో పాటు బసవేశ్వరుడి చిత్రాలను పుచ్చకాయ, గుమ్మడికాయలో అందంగా చెక్కారు.

6 / 9
ఫల, పుష్ప ప్రదర్శనలో ఇది ఒక ముఖ్యమైన ఆకర్షణగా నిలుస్తోంది. వందలాది మంది ప్రజలు సెల్ఫీలు  తీసుకుంటూ సందడి చేస్తున్నారు. దీనికి ఒకవైపు  పండ్లతో వివిధ రకాలను ప్రతిమలను నిర్మించగా..  మరోవైపు కేవలం పూలతో వివిధ చారిత్రక వస్తువులను నిర్మించారు. జిల్లాలో అత్యంత ముఖ్యమైన నారాయణపుర రిజర్వాయర్‌ను నిర్మించారు. అందంగా నిర్మించిన రిజర్వాయర్ ముందు ప్రజలు నిలబడి ఫోటోలు దిగుతున్నారు.

7 / 9
దీంతో పాటు ఉద్యానవన శాఖ అధికారులు రైతులకు ఉద్యానవన పంటను ఎలా పండించాలి, ఆ శాఖ నుంచి ఎలాంటి సహాయం అందుతుందనే విషయాలను రైతులకు తెలియజేస్తున్నారు. దీంతో పాటు ఇతర జిల్లాల్లో సాగుచేస్తున్న పంటల వివరాలను జిల్లా రైతులకు అందజేస్తున్నారు.

8 / 9
గణతంత్ర దినోత్సవంలో భాగంగా యాదగిరి నగరంలోని లుంబినీ వనంలో పుష్పలోకాన్ని ఆవిష్కరించారు. నగరంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడంతో ఉత్సాహంగా ప్రజలను సందర్శనానికి చేరుకుంటున్నారు.  

9 / 9
Follow us