Pakistan: భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్న నవాజ్ షరీఫ్ .. 370 రద్దు వెనక్కి తీసుకోవాలంటూ కండిషన్

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ పీఎంఎల్-ఎన్ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలో భారత్ ప్రస్తావన కూడా ఉంది. మేనిఫెస్టోలో భారత్‌తో పాకిస్తాన్ సంబంధాలను మెరుగు పరిచి శాంతిని నెలకొల్పడంపై  ప్రస్తావించారు. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకునే షరతుని పెడుతున్నామని.. ఈ సందేశం పాకిస్తాన్ నుండి భారతదేశానికి తమ పార్టీ పంపిస్తుందని ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పినట్లు పాక్ మీడియా పేర్కొంది. 

Pakistan: భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్న నవాజ్ షరీఫ్ .. 370 రద్దు వెనక్కి తీసుకోవాలంటూ కండిషన్
Nawaz Sharif Party Manifest
Follow us
Surya Kala

|

Updated on: Jan 28, 2024 | 11:23 AM

మన పొరుగుదేశం పాకిస్తాన్ లో సార్వత్రిక ఎన్నికలు ఫిబ్రవరి 8న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ప్రజలను ఆకట్టుకునేందుకు.. ఎన్నికల కోసం నిమగ్నమయ్యాయి. దేశ ప్రజలను ఆకట్టుకునేందుకు పార్టీలు రకరకాల వాగ్దానాలు చేస్తున్నాయి. ఇదిలావుండగా పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ పీఎంఎల్-ఎన్ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలో భారత్ ప్రస్తావన కూడా ఉంది. మేనిఫెస్టోలో భారత్‌తో పాకిస్తాన్ సంబంధాలను మెరుగు పరిచి శాంతిని నెలకొల్పడంపై  ప్రస్తావించారు.

పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ మ్యానిఫెస్టోలో భారతదేశంతో సహా ఇతర దేశాలతో శాంతిని నెలకొల్పడానికి ప్రాధాన్యత ఇవ్వబడింది. దేశాలకు శాంతి సందేశాన్ని పంపుతామని హామీ ఇచ్చారు. పాక్ తో భారత్ దేశం శాంతి నెలకొల్పాలని భావిస్తే.. తాము  జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకునే షరతుని పెడుతున్నామని.. ఈ సందేశం పాకిస్తాన్ నుండి భారతదేశానికి తమ పార్టీ పంపిస్తుందని ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పినట్లు పాక్ మీడియా పేర్కొంది.

ఈ  మేనిఫెస్టోలో భారత్ తీసుకున్న ఆగస్టు 2019 నాటి నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చేస్తామని.. షరత్తుతో పొరుగు దేశమైన భారత్‌తో మెరుగైన సంబంధాలను ఏర్పరచుకోవాలని నవాజ్ షరీఫ్ భావిస్తున్నట్లు పేర్కొంది.

ఇవి కూడా చదవండి

‘జమ్మూ కాశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగం’

అయితే, PML-N మేనిఫెస్టో.. దానిలో భారత్ ముందు పెట్టిన షరతు ఎప్పటికీ నెరవేరదు. జమ్మూ కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని ఒకటి రెండు సార్లు కాదు.. చాలాసార్లు భారత్ స్పష్టం చేసింది. 2019లో భారత పార్లమెంటు ఆర్టికల్ 370లోని నిబంధనలను రద్దు చేసింది. ఇది తమ రాజ్యాంగంలో అంతర్గత విషయమని భారతదేశం పేర్కొంది.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ పాలసీ హామీ

అంతేకాదు పీఎంఎల్-ఎన్ మేనిఫెస్టోలో క్షీణిస్తున్న పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తామని, వాతావరణ మార్పుల ప్రభావాలతో పోరాడతామని, ప్రజలకు చౌకగా విద్యుత్‌ను అందిస్తామని, విద్యుత్ బిల్లులను 20 నుంచి 30 శాతం తగ్గిస్తామని, అలాగే ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ పాలసీని కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో దేశ ప్రగతికి పెద్దపీట వేశారు. PML-N తన అధికారిక X ఖాతాలో ‘గివ్ పాకిస్థాన్ కో నవాజ్’ పేరుతో తన మ్యానిఫెస్టోను కూడా పంచుకుంది.

నవాజ్ షరీఫ్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నం

2017లో పీఎంఎల్‌-ఎన్‌ అధినేత నవాజ్‌ షరీఫ్‌ను ప్రధాని పదవి నుంచి తొలగించారు. నవాజ్ షరీఫ్ మూడుసార్లు పాకిస్థాన్ ప్రధానిగా పనిచేశారు. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇందు కోసం పార్టీ ముమ్మరంగా సన్నాహాలు చేస్తుండగా.. ఆయన కుమార్తె, నవాజ్ కూడా పార్టీని ప్రమోట్ చేయడంలో నిమగ్నమై ఉన్నారు. మరియమ్ స్వయంగా లాహోర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇటీవల, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీ అభ్యర్థి మరియమ్‌కు మద్దతుగా తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..